Jeedimetla News : ఇంట్లో దాచిన రూ.4 లక్షలు ఇరవై రోజుల్లో ఖర్చుపెట్టేసిన పిల్లలు
Jeedimetla News : ఇంట్లో పిల్లల ముందు డబ్బు దాచిన తల్లిదండ్రులకు పెద్ద షాక్ తగిలింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పిల్లలు ఆ డబ్బులు కాజేసి జల్సాలు చేసిన ఘటన జీడిమెట్లలో వెలుగుచూసింది.
Jeedimetla News : ఇంట్లో తల్లిదండ్రులు దాటిన 4 లక్షల రూపాయలను ఇరవై రోజుల్లో ఖర్చుపెట్టాశారు ఇద్దరు మైనర్లు. హైదరాబాద్ జీడిమెట్ల పీఎస్ పరిధిలోని ఎస్ఆర్ నాయక్ నగర్ లో నివాసం ఉంటున్న శివశంకర్ గుప్త, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. శివశంకర్ ప్రైవేటు ఉద్యోగి, భార్య వరలక్ష్మి పక్క వీధిలో కిరాణా షాపు నిర్వహిస్తుంది. నెల క్రితం శివశంకర్ నాలుగు లక్షల రూపాయలను పిల్లలు చూస్తుండగా తన ఇంట్లోని ఓ బ్యాగులో దాచిపెట్టాడు. స్కూల్ కు సెలవులు కావడంతో పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు. ప్రతిరోజు భార్యాభర్తలు బైటకు వెళ్లగానే పిల్లలు ఇద్దరు బ్యాగులో దాచిపెట్టిన డబ్బులను కొన్ని కొన్ని తీసుకొని సమీపంలోని బేకరీలలో ఖర్చుపెట్టేవారు.
Also Read : Guntur Crime : వాలంటీర్ ని కొట్టి చంపిన మైనర్, రూ. 2 వేలు తిరిగి ఇవ్వమన్నందుకు దారుణం
పక్కింటి ఫ్రెండ్స్ కాజేశారు
వీరికి పక్కింట్లో ఉండే 10వ తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్లతో పరిచయం ఏర్పడింది. శివశంకర్ పిల్లలు ప్రతిరోజు డబ్బులు ఇంట్లో నుంచి తెచ్చి షాపులలో ఖర్చుపెట్టేది గమనించిన పక్కింటి మైనర్లు ఎలాగైనా పిల్లల వద్ద డబ్బులు కాజేయాలని పథకం పన్నారు. పిల్లలకు వాచీలు, సెన్ ఫోన్ ఇయర్ ఫోన్స్, ఇతర వస్తువులు ఆశ చూపి దానికి బదులుగా ఇంట్లో ఉన్న డబ్బులను అడిగి తీసుకునేవారు. ఇలా పిల్లలకు వాచీలు, లైటర్స్, సెల్ ఫోన్ ఇయర్ ఫోన్ ఇలా పలు రకాల ఐటమ్స్ చూపించి పిల్లల దగ్గర నుంచి మొత్తం నాలుగు లక్షల రూపాయలు దోచేశారు. ఈ నెల 9వ తేదీన శివశంకర్ ఇంట్లో దాచిపెట్టిన 4 లక్షల డబ్బుల కోసం బ్యాగులో చూడగా లేకపోయేసరికి ఇంట్లోని పిల్లలను అడగగా వారు తామే డబ్బులు పక్కింటి అన్నలకు ఇచ్చామని తెలిపారు. చేసేది లేక శివశంకర్ జీడిమెట్ల పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జీడిమెట్ల సీఐ బాలరాజు మాట్లాడుతూ ఇంట్లో పిల్లల ఎదురుగా డబ్బులు దాచిపెట్టవద్దని, ప్రతిరోజు పిల్లలపై నిఘా పెట్టాలని, పిల్లలు సెల్ ఫోన్ లలో ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ పక్కదారి పడుతున్నారని, డబ్బులు ఎత్తుకెళ్లి షాపింగులు చేస్తున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లలను డబ్బులకు దూరంగా పెట్టాలని కోరారు.
Also Read : Husband Murder : 'మీ భర్తను ఎలా చంపాలి' అనే పుస్తకం రాసిన రచయిత్రి, ఆపై పక్కా ప్లాన్ తో భర్త మర్డర్!
Also Read : Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం