News
News
X

Hyderabad Crime News: ఒకరితో సహజీవనం, మరొకరితో పెళ్లి - చివరకు అదిరిపోయే ట్విస్ట్ 

Hyderabad Crime News: ఒకరిని ప్రేమించి, సహజీవనం చేసి మరో వ్యక్తిని పెళ్లాడింది. ప్రియుడి కోరక మేరకు భర్తకు విడాకులిచ్చి వచ్చేసింది.. ఆమెతో కొంతకాలం ఉన్న ప్రియుడు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు.

FOLLOW US: 
Share:

Hyderabad Crime News: ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పరిచయం ఏర్పడంది. అది కాస్తా తర్వాత ప్రేమగా, సహజీవనంగా మారింది. చాలా రోజుల పాటు వీరిద్దరూ కలిసే ఉన్నారు. ఇంతలో ఆ యువతికి కుటుంబ సభ్యులు మరొకరితో పెళ్లి చేసి దుబాయి పంపించారు. మాజీ ప్రియుడి కోరిక మేరకు మళ్లీ హైదరాబాద్ తిరిగొచ్చేసింది. కొంత కాలం అతడు ఆమెతో సవ్యంగానే ఉన్నప్పటికీ.. ఆమెకు తెలియకుండానే వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధం అయ్యాడు. ఇదే విషయం గుర్తించిన సదరు మహిళ ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

అసలేం జరిగిందంటే..?

హైదరాబాద్ బోరబంజ రాజ్ నగర్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల ఓ యువతి టెలీకాలర్ గా పనిచేస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఐధేళ్ల క్రితం మహారాష్ట్ర జలగావ్ కు చెందిన 28 ఏళ్ల సైఫ్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. నగరానికి వచ్చిన సైఫ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో సహజీవనం చేశాడు. ఈ క్రమంలోనే 2020లో యువతికి ఆమె కుటుంబ సభ్యులు మరో సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేసిచ్చారు. ఆపై ఆమెను దుబాయ్ కి కూడా పంపారు. భర్తకు విడాకులిచ్చి రావాలని, తాను పెళ్లి చేసుకుంటానని సైఫ్ మళ్లీ మాయ మాటలతో మభ్య పెట్టాడు. అది నమ్మిన యువతి భర్తకు విడాకులు ఇచ్చి నగరానికి వచ్చింది. ఆమెకు గర్భస్రావం సైతం చేయించాడు. కొంతకాలం కలిసి ఉండి తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. ఈనెల 22వ తేదీన వేరొక యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. 

విషయం గుర్తించిన ప్రేమికురాలు సైఫ్ స్వగ్రామానికి వెళ్లి నిలదీసింది. సైఫ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు యువతిని అంగీకరించకపోవడంతో తిరిగొచ్చి ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

మూడ్రోజుల క్రితం మంచిర్యాలలో కూడా ఇలాంటి ఘటనే

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచలాపురం గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన స్వప్న అనే యువతితో కాలేజీలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వారి మధ్య ప్రేమ పెరిగి ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు. పెళ్లి వరకు మాటలు వచ్చాయి. పెళ్లికి ఓకే అని చెప్పాడు కృష్ణ.  ఆ తర్వాత ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని స్వప్న అడిగినప్పుడల్లా పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పుతూ కాలయాపన చేశాడు. చివరికి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవట్లేదని, కొద్దిరోజులు ఆగని చెప్పడంతో ఆ యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొద్దిరోజులు కాలం గడిచింది. 

ఫొటోలు బయటపెడతానని వేధింపులు

ఇటీవల కృష్ణ యువతికి ఫోన్ చేసి ఎందుకు పెళ్లి చేసుకున్నావు. నేను కొన్ని రోజులు తర్వాత పెళ్లి చేసుకుంటాను అన్న కదా.. ఇలా ఎందుకు చేశావు అని వేధింపులు మొదలుపెట్టాడు. నువ్వు నాతో దిగిన ఫొటోలు ఉన్నాయి. నువ్వు మీ ఆయనతో కలిసి ఆ ఫొటోలు వీడియోలు బయటపెడతా అని బెదిరించాడు. దీంతో స్వప్న మళ్లీ అతడి మాయమాటలు నమ్మి భర్తతో విడాకులకు కూడా వెళ్లింది. ఈ విషయాన్ని యువతి కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచింది.  తీరా ఇప్పుడు పెళ్లి మాట ఎత్తేసరికి కృష్ణ ఉలుకు పలుకు లేదని బాధిత యువతి ఆరోపిస్తుంది. అతడు వేరే అమ్మాయితో పెళ్లికి ఒప్పుకోవడంతో యువతి చివరికి పోలీస్ స్టేషన్ వెళ్లింది. పెద్ద మనుషుల దగ్గరకు వెళ్లి తన సమస్య చెప్పుకుంది.  అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో తన భవిష్యత్తు ప్రశ్నానార్థకంగాగా మారిందని కృష్ణ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి స్వప్న తనకు న్యాయం కావాలని పోరాటం చేస్తోంది. ప్రేమ పేరిట మోసపోయిన ఆ యువతి తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తెలిపింది.  

Published at : 13 Feb 2023 08:47 AM (IST) Tags: man cheating Telangana News lover cheating Hyderabad Crime News Latest Cheating News

సంబంధిత కథనాలు

MLC Kavitha: సుదీర్ఘంగా కవితను విచారించిన ఈడీ, మళ్లీ నేడు రావాలని నోటీసులు

MLC Kavitha: సుదీర్ఘంగా కవితను విచారించిన ఈడీ, మళ్లీ నేడు రావాలని నోటీసులు

Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్

Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

టాప్ స్టోరీస్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

TS Paper Leak Politics : "పేపర్ లీక్" కేసు - రాజకీయ పుట్టలో వేలు పట్టిన సిట్ ! వ్యూహాత్మక తప్పిదమేనా ?

TS Paper Leak Politics :

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు,  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!

Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!