అన్వేషించండి

Hyderabad News: తోటి విద్యార్థితో కూతురి ప్రేమ పెళ్లి - తట్టుకోలేక తల్లి ఘోరమైన పని!

Hyderabad Crime News: ఇన్నాళ్లూ ప్రామంగా ప్రేమించుకున్న కూతురు తనకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకొని ఇంట్లోంచి వెళ్లిపోయింది. అది భరించలేని తల్లి ఆత్మహత్య చేసుకుంది. 

Hyderabad Crime News: ఆమె పుట్టినప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకుంది. తనకు ఏం కావాలన్నా అమ్మా అమ్మా అంటూ వెనకే వస్తే ఆనందపడిపోయింది. తనకు తెలియకుండా తన కూతురు ఏం చేయదు అనుకునేది. ఆ పాప కూడా అన్ని విషయాలు ఆమెతో చెప్పేది. అయితే పాప పెద్దదై కాలేజీకి వెళ్తోంది. ఈ క్రమంలోనే తన తోటి విద్యార్థితో ప్రేమలో పడింది. ఇంట్లో చెప్పకుండా అతడిని పెళ్లి చేసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. అది తట్టుకోలేని తల్లి ఇంట్లోని తన గదిలోకి వెళ్లి ఉరివేసుకొని చనిపోయింది. 

అసలేం జరిగిందంటే..?

కూకట్ పల్లి జయానగర్ కాలనీలోని మైత్రేయి నిలయంలో ప్రైవేటు ఉద్యోగి గోనుగుంట శ్రీనివాస రావు, నిర్మల కుటుంబం నివాసం ఉంటున్నారు. అయితే వీరికి కుమారుడు సాయితేజ, కుమార్తె ఉన్నారు. ఇటీవలే కూతురు తనతో పాట చదువుతున్న ఓ విద్యార్థిని ప్రేమించింది. ఈనెల 17వ తేదీన ఇంట్లోంచి వెళ్లిపోయి అతడిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి తల్లి నిర్మల తీవ్రంగా మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం తన బెడ్ రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎంతకీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుమారుడు మరో తాళం చెవితో తలుపులు తెరిచి చూడగా... తల్లి చీరతో ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించింది. దీంతో కుమారుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. గట్టిగా ఏడ్వడంతో తండ్రి వచ్చాడు. ఆపై పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

ఇటీవలే ఏపీలోని గుంటూరులో కూడా ఇలాంటి ఘటనే

అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె.. ఓ ఆటో డ్రైవర్ ను ప్రేమించింది. వద్దని చెబుతున్నా వినకుండా అతడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అయితే విషయం తెలుసుకున్న తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. తన పరువు పోయిందని బావురుమంది. ఊళ్లో వాళ్లు అంటున్న మాటలు వినలేక.. తన కూతురు పరువు తీసి వెళ్లిపోయిందని భావించిన తల్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కూతురు ప్రేమ పెళ్లితో తమ పరువు పోయిందని..

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గుండారం గ్రామంలో పరువు ఆత్మహత్య చోటు చేసుకుంది.  దాసరి అనితకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు గతంలోనే వివాహం అయింది.  అయితే రెండో కుమార్తె డిగ్రీ చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తో ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసుకున్న తల్లి పలుమార్లు కూతురును మందలించింది. ఈ నెల ఏడవ తేదీన కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమించిన ఆటో డ్రైవర్ ను వివాహం చేసుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న తల్లి అనిత తల్లడిల్లి పోయింది. గ్రామంలో పలు విధాలుగా ప్రచారం జరగడంతో తట్టుకోలేక పోయింది. ఈ ప్రేమ వివాహంతో తమ కుటుంబ పరువు రోడ్డుపై పడిందని ఆవేదన చెందింది.ఈ క్రమంలోనే ఆమె నిన్న రాత్రి ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న చేబ్రోలు పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Embed widget