By: ABP Desam | Updated at : 04 Mar 2023 06:37 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ల్యాప్ టాప్స్ చోరీ
Hyderabad Crime : 33 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మామిడి శెట్టి సత్యాన్వేష్(27) అనే వ్యక్తిని కేపీహెచ్బీ రమ్య గ్రౌండ్స్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలానగర్ సీసీఎస్, కేపీహెచ్ బీ పోలీసులు సంయుక్తంగా నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు వద్ద నుంచి రూ.21 లక్షల 50 వేల విలువ చేసే 50 ల్యాప్ టాప్ లు, 5 సెల్ ఫోన్లు, ఒక ట్యాబ్ తో పాటు ఐపాడ్ ను స్వాధీనం చేసుకొన్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు.
బ్యాచిలర్ రూమ్స్ టార్గెట్
రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, హాస్టల్స్, బ్యాచిలర్ రూమ్స్ ను టార్గెట్ గా చేసుకొని నిందితుడు మామిడిశెట్టి సత్యాన్వేష్ చోరీలు చేస్తున్నాడని డీసీపీ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సత్యాన్వేష్ సికింద్రాబాద్ లో నివాసం ఉంటూ ఈ దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు.
33 కేసులు
"మామిడిశెట్టి సత్యాన్వేష్ అనే నిందితుడ్ని కేపీహెచ్ బీలో అరెస్టు చేశాం. ఇతనిపై 33 కేసులు ఉన్నాయి. మొత్తం 21 లక్షల విలువైన ల్యాప్ టాప్, ఫోన్లు, రికవరీ చేశాం. ఇతను రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్స్ లో అజాగ్రత్తగా ఉన్న వాళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడతాడు. తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడతాడు. బ్యాచులర్ రూములలో ల్యాప్ ట్యాప్ లు , ఫోన్లు చోరీ చేస్తాడు. ఇతనిది పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం పాందువ్వ గ్రామం. ప్రస్తుతం సికింద్రాబాద్ లో ఉంటున్నాడు. " - బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు
గంజాయి డ్రైవ్
అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 400 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి ఒక డీసీఎం, ఒక కారు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటి 50 లక్షలు ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ తెలిపారు. మరోకేసులో 10 గ్రాముల హెరాయిన్, ముగ్గురిని అరెస్టు చేశారు ఎల్బీనగర్ ఎస్ఓటి, మీర్ పేట్ పోలీసులు తెలిపారు.
400 కిలోల గంజాయి స్వాధీనం
"మాదక ద్రవ్యాలపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నాం. పక్కా సమాచారంతో గంజాయి ముఠాను అరెస్ట్ చేశాం. అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను చౌటుప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. 400 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాం. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్ర కర్ణాటక తరలిస్తున్నట్లు గుర్తుంచాం. డీసీఎం వ్యాన్ లో లోపల ఎవ్వరికి తెలియకుండా గంజాయి తరలిస్తున్నారు. మొత్తం నలుగురు నిందితులను అదుపులోపి తీసుకున్నాం. మెయిన్ కింగ్ పిన్ వీరన్న, సప్లై చేసింది సంతోష్ గా గుర్తించాం. మొత్తం నెట్ వర్క్ ను నిర్మూలించడానికి కృషి చేస్తున్నాం." - డీఎస్ చౌహన్, రాచకొండ పోలీస్ కమిషనర్
#Interstate_Drug_Peddlers / #Ganja_Smuggling_Racket busted by @ChoutuppalPS police– (04) held - seized 400 kgs of #Ganja, other incriminating material all worth about Rs/- 1.5 Crores.@TelanganaCOPs @DcpBhongir @AcpChoutuppal pic.twitter.com/76GuzA1CuG
— Rachakonda Police (@RachakondaCop) March 4, 2023
MLC Kavitha: సుదీర్ఘంగా కవితను విచారించిన ఈడీ, మళ్లీ నేడు రావాలని నోటీసులు
Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్
Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ
Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!
AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి
వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్
CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్
Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్