Hyderabad Crime: పేస్ట్ రూపంలో గోల్డ్ స్మగ్లింగ్... విమానం సీట్ కింద సీక్రెట్ గా తరలింపు
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. పేస్ట్ రూపంలో బంగారాన్ని విమానంలోని సీటు కింద అతికించి రవాణా చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తో్న్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసోం నుంచి హైదరాబాద్ కు వచ్చిన విమానంలో అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నారని కస్టమ్స్ అధికారులకు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో లాండ్ అవ్వగానే సోదాలు చేయగా ఓ వ్యక్తి సీటు కింద పాకెట్‌లో పేస్ట్ రూపంలో ఉన్న 472.8 గ్రాముల బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ బంగారం ధర రూ. 23.33 లక్షలు అని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. నిత్యం బంగారం పట్టుబడుతున్న వార్తలు వెలుగుచూస్తున్నాయి. ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు తనిఖీల్లో భారీగా బంగారం స్వాధీనం చేసుకుంటున్నారు. ఎక్కువగా అరబ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అధికారులు అంటున్నారు.
On specific intelligence,Hyderabad Customs booked a case for smuggling of gold against unknown pax arriving by 6E187 from Guwahati on 29.11.21. Gold in paste form weighing 472.8 gms worth Rs.23.33 Lakhs seized. Gold was concealed inside the flight seat pockets. pic.twitter.com/KpQE5J71Ko
— Hyderabad Customs (@hydcus) November 30, 2021
సూట్ కేస్ రైలింగ్ లో బంగారం
నవంబర్ 27న దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు 410 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ పసిడి విలువ రూ.20.30 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పౌడర్ టిన్, సూట్ కేస్ రైలింగ్ లో బంగారాన్ని తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Also Read: దర్యాప్తు అలా కాదు.. ఇలా చేయండి..! వివేకా హత్య కేసులో సీబీఐ డైరక్టర్‌కు అరెస్టయిన నిందితుడి లేఖ !
బంగారం తరలిస్తున్న ముగ్గురు మహిళలు అరెస్ట్
శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో నవంబర్ 22న బంగారం, విదేశీ కరెన్సీ పట్టుబడింది. బంగారం, విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తూ పలువురు అధికారులకు చిక్కుతున్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. యూఏఈ, యుఎస్ కరెన్సీని తరలిస్తున్న ఇద్దరు మహిళలను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 11.49 లక్షల విలువైన యూఏఈ కరెన్సీ, యుఎస్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మరో మహిళ దగ్గర రూ. 17.69 లక్షలు విలువ చేసే బంగారం బిస్కెట్లను ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి