అన్వేషించండి

Hyderabad Couple Cheated: గూగుల్‌ని నమ్మితే.. కొన్నిసార్లు గోవిందే..

సమస్యలుంటే పక్కవాళ్లతో మాట్లాడటం మానేశాం.. ఇప్పుడు ఏదైనా గూగులే దిక్కు. అలా అన్నిసార్లు దానిపైనే ఆధారడినా.. డెంజరే.. కావాలంటే ఈ వార్త చదవండి..

ఆ దంపతులకు సమస్య వచ్చింది.. ఎవరితోనైనా చెప్పుకుంటే సలహా ఇచ్చేవారేమో.. కానీ వారిద్దరూ గూగుల్‌ని నమ్ముకున్నారు. అప్పులు తీర్చాలని చేసిన ప్రయత్నాల్లో ఇంకా అప్పుల్లోకి వెళ్లిపోయారు.


అప్పులు తీర్చేందుకు కిడ్నీలు అమ్ముకోవాలని భావించారు ఆ దంపతులు. వాటిని కోనేవారి కోసం ఆన్‌లైన్‌లో అన్వేషించారు. అలా సైబర్ మోసగాళ్లు మాయమాటలు చెప్పి వారి దగ్గర రూ.40.38 లక్షల వరకు కాజేశారు. ఈ ఘటనపై బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉండే మోది వెంకటేశ్, లావణ్య దంపతులు స్టేషనరీ, బ్యాంగిల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం సొంతింటి నిర్మాణం మెుదలుపెట్టారు. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ద్వారా  రూ.౩4లక్షలు, తర్వాత మరో రూ.10 లక్షలు రుణం తీసుకున్నారు. నాలుగంతస్తుల ఇల్లు అయ్యేసరికి రూ.1.50 కోట్ల అప్పులయ్యాయి. కరోనా లాక్‌డౌన్‌తో వ్యాపారం మూతపడింది. మరోవైపు అప్పులిచ్చినవారి నుంచి ఒత్తిడి.  ఎలాగైనా డబ్బులు తిరిగివ్వాలని.. తమ వాళ్లు సాయం చేసిన వారు ఇబ్బందులు పడొదనుకున్నారు. కిడ్నీలు అమ్ముకోవడానికి నిర్ణయించుకున్నారు. 
 
ఎలాగైనా కిడ్నీలు అమ్మాలని.. గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి పరిచయమై.. రిజిస్ట్ట్రేషన్ ఫీజు కడితే చాలు అని చెప్పాడు. ఆ తర్వాత కిడ్నీకి బీమా, కరెన్సీ ఎక్స్ఛేంజ్‌ల కోసమంటూ మెుత్తం రూ.10 లక్షల వరకు కట్టించుకున్నాడు. ఇలా మెుత్తం నలుగురిని ఆన్‌లైన్‌లో సంప్రదించారు ఆ దంపతులు. ఓ వ్యక్తి కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు కడితే రావాల్సిన మెుత్తంలో సగం ఖాతాలో వేస్తానని నమ్మించాడు. చెప్పినట్లే రెండు ఖాతాల్లో డబ్బులు జమైనట్లు కనిపించాయి. రెండు, మూడు రోజుల్లో ఆ డబ్బులు తీసుకోవచ్చని చెప్పాడు.  విత్‌డ్రా చేద్దామంటే.. రాలేదు. అతడిని మళ్లీ సంప్రదించగా..  ఏవేవో సర్టిఫికెట్లు కావాలంటూ.. డబ్బులు కట్టించుకున్నాడని దంపతులు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరో వ్యక్తి డబ్బులు తీసుకునేందుకు బెంగళూరుకు వస్తే.. తమ మనుషులు అడ్వాన్స్ చెల్లిస్తారని చెప్పాడు. అది నేజమేనని నమ్మి వారు అక్కడికి వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు హోటల్‌కు వచ్చారు. లాకర్ తెరిచి.. డబ్బులు చూపించారు. నోట్లు నలుపు రంగులో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించగా.. ఆర్‌బీఐ డబ్బు అని, రసాయనాలతో శుభ్రం చేయాల్సి ఉంటుందని చెప్పారు. కొన్నింటిని శుభ్రం చేసి చూపించారు. వాటని ఓ ప్యాకెట్‌లో కట్టి ఇచ్చి.. 48 గంటల వరకు తెరవకూడదన్నారు. ముంబయి నుంచి రసాయనాలు తెప్పించాలంటూ వారు డబ్బులు కట్టించుకున్నారు. దీనికోసం ఆ దంపతులు తెలిసినవారి దగ్గర బంగారాన్ని తాకట్టు పెట్టారు. తీరా హైదరాబాద్‌కు వచ్చాక ప్యాకెట్ తెరిచిచూస్తే.. అవన్నీ దొంగనోట్లని తెలిసిందని దంపతులు చెబుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Rains Update: బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Embed widget