News
News
X

Hyderabad Crime : చింతల్ లో దారుణం, బీర్ సీసా పగలగొట్టి గొంతులో పొడిచిన యువకుడు!

Hyderabad Crime : హైదరాబాద్ చింతల్ లో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఘర్షణ పడ్డారు. ఓ యువకుడు బీర్ బాటిల్ పగలకొట్టి మరో యువకుడి గొంతులో పొడిచాడు.

FOLLOW US: 

Hyderabad Crime : మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని చింతల్ లో దారుణం జరిగింది. ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో ఓ యువకుడు బీర్ సీసా పగలగొట్టి మరో యువకుడిపై దాడి చేశాడు. సోమవారం అర్థరాత్రి ఓ పాన్ వద్ద గౌతమ్(28),షాబాజ్ (30)అనే ఇద్దరు యువకులు సేవిస్తున్నారు. అదే సమయంలో పాన్ షాప్ వద్దకి విద్యాసాగర్(27), సంధీప్(27) అనే యువకులు వచ్చారు. విద్యాసాగర్,షాబాజ్ ల మధ్య ఘర్షణ జరిగింది. షాబాజ్ చేతిలో ఉన్న బీర్ బాటిల్ పగలగొట్టి విద్యాసాగర్ గొంతులో పొడిచాడు.  ఈ దాడిని అడ్డుకున్న సందీప్ కి కూడా గాయాలయ్యాయి.  గాయపడిన యువకుడిని చింతల్ లోని ఆర్ఎన్ఆర్ హాస్పిటల్ కి తరలించారు. ఈ దాడిలో విద్యాసాగర్ మెడ నరాలు తెగి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు.  

అసలేం జరిగింది? 

అర్ధరాత్రి మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన ఘర్షణ పరస్పర దాడికి దారితీసింది. ఈ దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని చింతల్  పాషా పాన్ షాప్ వద్ద సోమవారం అర్ధరాత్రి 1.30 మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. పాన్ షాప్ వద్ద గౌతమ్(28), షాబాజ్ (30) లు మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో పాన్ షాప్ వద్దకి చేరుకున్న విద్యాసాగర్(35), సంధీప్(27) లు మద్యం సేవిస్తున్న షాబాజ్ తో ఘర్షణ పడ్డారు.  వీరిమద్య మాటామాటా పెరగడంతో షాబాజ్ చేతిలో ఉన్న బీర్ బాటిల్ పగలగొట్టి విద్యాసాగర్ గొంతులో పొడిచాడు. గొడవను అడ్డుకునే ప్రయత్నంలో సందీప్ కు సైతం స్వల్పగాయాలు అయ్యాయి. స్థానికులు వీరిని చింతల్ లోని ఆర్ఎన్ఆర్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో విద్యాసాగర్ మెడనరాలు తెగిపోయాయి. పరిస్థితి విషయంగా ఉందని ఆసుపత్రి  వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వీరి మధ్య పాతకక్షలేమైనా ఉన్నాయా లేక మద్యం మత్తులో హత్యాయత్నం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కొడుకుని చంపిన తండ్రి

దేశాన్నిరక్షించాల్సిన సైనికుడు పైఅధికారులతో గొడవలు పడి పలుమార్లు సస్పెన్డ్‌ అయ్యాడు. అక్కడితో ఆగకుండా ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులకు చిత్రహింసలకు గురి చేశాడు. గ్రామంలోని చిన్నా పెద్దలపై దాడులు చేస్తూ భయాందోళనలు కలిగించాడు. ఇంత సహించి భరించినా చివరకు ఆదివారం వేకువజామున 3.30 గంటలకు తన తల్లిని చావ బాదాడు. ఆ తర్వాత భుజంపై వేసుకుని ఇంటి వెనుక భాగంలో ఉన్న పొలంలో విసిరి పడేశాడు. 

స్తంభానికి కట్టేసి కొట్టి

ఇది చూసి తట్టుకోలేని తండ్రి తన కుమారుడ్ని సమీపంలోని కరెంట్ స్తంభానికి తాళ్లతో కట్టి బంధించాడు. తన భార్య పరిస్థితిని గమనించి 108 వాహనంలో శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. తాళ్లతో కట్టి ఉంచిన కుమారుడు అంతటితో ఆగక తన తండ్రిని దుర్భాషలాడుతూ నువ్వు తిరిగి వచ్చేలోగా అందర్నీ చంపేస్తానని బెదిరించాడు. ఇది సహించలేని తండ్రి ఇనుప రాడ్డుతో బలంగా తలపై కొట్టడంతో అతను అక్కడికి అక్కడే మరణించాడు. వెను వెంటనే తండ్రి పోలీసులకు జరిగిన ఉదంతం అంతా వివరించి లొంగిపోయాడు. ఇది నరసన్నపేట మండలం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కిల్లాం గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

Also Read : పిల్లలతో ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన- చితక్కొట్టిన ప్రజలు

Also Read : ఆ నలుగురి ఆత్మహత్య వెనుక ఆ నలుగురు, సూసైడ్ లెటర్‌లో కీలక సమాచారం?

Published at : 23 Aug 2022 02:26 PM (IST) Tags: Crime News Hyderabad News Jeedimetla TS News Chintal youth fight each other

సంబంధిత కథనాలు

Chandrababu Tweet : స్కూల్ పిల్లల వరకూ గంజాయి వచ్చేసిందంటే, రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది- చంద్రబాబు

Chandrababu Tweet : స్కూల్ పిల్లల వరకూ గంజాయి వచ్చేసిందంటే, రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది- చంద్రబాబు

Vizag Crime News : 70 ఏళ్లు దాటిన వృద్ధుడ్ని ఇలా కూడా చంపేస్తారా ? విశాఖలో ఇక రోడ్డెక్కితే గ్యారంటీ ఉండదు !

Vizag Crime News : 70 ఏళ్లు దాటిన వృద్ధుడ్ని ఇలా కూడా చంపేస్తారా ?  విశాఖలో ఇక రోడ్డెక్కితే గ్యారంటీ ఉండదు !

Palnadu District News: పల్నాడులో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమం, కారులోనే వదిలి నిందితులు పరార్

Palnadu District News: పల్నాడులో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమం, కారులోనే వదిలి నిందితులు పరార్

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Cyber Crime : సైబర్ కేటుగాళ్లు డబ్బు కొట్టేశారా? అయితే ఇలా చేస్తే మీ సొమ్ము తిరిగొస్తుంది!

Cyber Crime : సైబర్ కేటుగాళ్లు డబ్బు కొట్టేశారా? అయితే ఇలా చేస్తే మీ సొమ్ము తిరిగొస్తుంది!

టాప్ స్టోరీస్

KCR Plan : కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టేది తెలంగాణలో మూడో సారి గెలవడానికే. - అంచనాలకు అందని కేసీఆర్ వ్యూహం ఇదే !

KCR Plan : కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టేది తెలంగాణలో మూడో సారి గెలవడానికే.  -  అంచనాలకు అందని కేసీఆర్ వ్యూహం ఇదే !

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి