News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Hyderabad Boy Death: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడి మృతి, పది నిమిషాలకే అంత ఘోరం - పజిల్‌గా మారిన కేసు!

బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరు ఎవరూ లేకపోవడంతో పలు అనుమానాలకు తావునిస్తోంది.

FOLLOW US: 
Share:

ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరు ఎవరూ లేకపోవడంతో పలు అనుమానాలకు తావునిస్తోంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 

స్థానిక ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్ భవానిపురం వీకర్ సెక్షన్ కాలనీలో చెందిన బిస్సు కర్మ రాంజీ, పూజా దేవి దంపతులు నివాసం ఉంటున్నారు. కర్మ రాంజీ కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. వీరికి 12 సంవత్సరాలు వయసు కలిగిన కునాల్ అనే కుమారుడు ఉన్నాడు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో భార్య పూజ దేవి గుండెల్లో నొప్పిగా ఉందని ఆసుపత్రికి వెళ్లాలని భర్తకు ఫోన్ చేసింది. తాను రెడ్డి కాలనీలోని కమ్యూనిటీ హాల్ దగ్గర ఉంటానని చెప్పి రమ్మంది. పని ముగించుకొని అక్కడికి వచ్చిన భర్త రాంజీ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

వీరు ఆస్పత్రికి వెళ్లిన పది నిమిషాల్లోనే పక్కింటికి చెందిన దావీదు ఫోన్ చేశాడు. మీ కుమారుడు కొనాల్ బట్టలు ఆరేసే తీగ చుట్టుకొని ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పాడు. దీంతో వారు దాగుటిన ఆసుపత్రి నుంచి ఇంటికి బయలుదేరారు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారుని తీసుకొని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

అసలు బాలుడు ఒంటరిగా బట్టలు తీసేందుకు ఎందుకు వెళ్ళాడు? ఒక్కడే వెళ్లాలా లేక తోడుగా ఎవరినైనా తీసుకెళ్లాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇంట్లో ఇప్పటివరకు తమతో ఉన్న బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, సమీప బంధువులు కన్నీరు మునీరుగా విలపిస్తున్నారు.  బాలుని తమ వెంట తీసుకెళ్లిన ప్రాణం పోయేది కాదని గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

విచారిస్తున్న పోలీసులు

అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి పై పలు అనుమానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆ బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.     

మృతిచెందిన బాలుడిని పరిశీలించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇందుకు సంబందించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.  డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌టీం రప్పించి తనిఖీలు చేపట్టారు.  ఇంటి దగ్గర ఉన్న ఇరుగుపొరుగు వారిని, మృతుడి తల్లిదండ్రులను పోలీసులు మృతుని విచారణ చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. 

బట్టలు ఆరేసే తీగ మెడకు చుట్టుకొని ఎలా చనిపోతాడు అని అనుమానం కలుగుతుంది. తనకు తానే వేసుకున్నాడా? లేక ఎవరైనా మెడకు చుట్టారా అని అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిజాన్ని వెలికి తీయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆడుకున్న బాలుడు ఒకసారిగా మృతి చెందడంతో కాలనీవాసులు నిర్ధాంత పోయారు. 

Published at : 24 Sep 2023 11:31 AM (IST) Tags: Hyderabad News Boy death chandanagar police station

ఇవి కూడా చూడండి

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

మణిపూర్‌ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం

మణిపూర్‌ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం

ఆన్‌లైన్‌లో మెక్సికన్‌ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్

ఆన్‌లైన్‌లో మెక్సికన్‌ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య

టాప్ స్టోరీస్

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి,  తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
×