Human Sacrifice Kerala: మహిళలను దారుణంగా హత్య చేసి, ముక్కలుగా కోసి - కేరళలో నరబలి!
Human Sacrifice Kerala: కేరళలో నరబలి ఘటన పోలీసులను షాక్‌కు గురి చేసింది.
Human Sacrifice Kerala:
అతి కిరాతకంగా హత్య..
కేరళలో దారుణం జరిగింది. ఓ జంట ఇద్దరు మహిళలను అతి కిరాతకంగా హత్య చేశారు. నరబలి ఇస్తే సంపన్నులైపోతామని నమ్మిన దంపతులు...ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేయడమే కాకుండా...శరీరాన్ని 56 ముక్కలుగా కోశారు. ఇంకా జుగుప్సాకరమైన విషయం ఏంటంటే...వాళ్ల మాంసాన్ని కూడా తిన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. రోసెలిన్, పద్మ అనే ఇద్దరు మహిళలు చిత్రహింసకు గురై మృతి చెందారని విచారణలో తేలింది. చేతులు వెనక్కి కట్టేసి ఛాతీ భాగంపై తీవ్రంగా గాయం చేసి, కావాలనే రక్తంపోయే వరకూ హింసించినట్టు పోలీసులు వెల్లడించారు. ఒకరి శరీరాన్ని 56 ముక్కలుగా కోసి మూడు గోతులు తవ్వి వాటిలో ఆ అవయ వాలను పాతి పెట్టారు. ఆర్థిక సమస్యలు తీరిపోవాలంటే నరబలి ఇవ్వాలని నమ్మిన దంపతులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. వీరికి మరో ఏజెంట్ సాయపడ్డాడు. అయితే...లైంగిక వేధింపులకూ గురి చేసినట్టు భావిస్తున్నారు పోలీసులు. నిందితులను విచారిస్తున్న సమయంలోనేపోలీసుల ప్రశ్నలకు సమాధానంగా "మేం వాళ్ల మాంసాన్ని తిన్నాం" అని షాకింగ్ సమాధానమిచ్చారట. అయితే...పోలీసులు మాత్రం దీన్ని ఇంకా నిర్ధరించలేదు. "ఇది నిరూపించాలంటే మాకు ఆధారాలు దొరకాలి" అని వెల్లడించారు. ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ కొనసాగుతోంది. మృతుల్లో ఒకరైన రోసెలిన్ జూన్‌లో కనిపించకుండా పోయింది. ఆ తరవాత సెప్టెంబర్‌లో పద్మ మిస్సింగ్ అయినట్టు తేలింది.
Kerala | In Kochi, we registered a missing person case of a 52-year-old female lottery ticket seller on Sept 26. Our probe revealed that she was cheated, abducted, taken to Pathanamthitta dist & done to death there: CH Nagaraju, Kochi City CP, on Kerala 'human sacrifice' case pic.twitter.com/BZOiLYDZ4N
— ANI (@ANI) October 12, 2022
నమ్మించి..మోసం చేసి..
ఈ ఘటన జరిగే సమయానికే..పోలీసులు ఈ మిస్సింగ్ కేసులను ఛేదించే పనిలో ఉన్నారు. వీళ్లిద్దరి ఫోన్‌లనూ ట్రేస్ చేస్తే...మహమ్మద్ షఫీ అనే ఏజెంట్ వద్ద ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుంటే..మిగతా వివరాలన్నీ బయటపడ్డాయి. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి మహిళలతో పరిచయం ఏర్పరుచుకుని, ఏదో బహుమతి ఇస్తాను రమ్మని వారిని పిలిచాడు. వచ్చాక వారిని కిడ్నాప్ చేశాడు మహమ్మద్ షఫీ. అయితే...అశ్లీల చిత్రాల్లో నటిస్తే డబ్బులిస్తానని ఆశచూపినట్టు కొందరు చెబుతున్నారు. "గతంలోనూ ఈ ఏజెంట్ ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడా లేదా అన్న కోణంలో విచారణ చేపడుతున్నాం. ఈ హత్యల వెనక అతడి శాడిజమే మోటివ్‌గా కనిపిస్తోంది" అని పోలీసులు వెల్లడించారు. ఓ మహిళను ఈ ఏజెంట్ అత్యాచారం చేశాడనీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఒంటిపై ఉన్న గాయాలే ఈ అనుమానాలకు తావిస్తోంది.
All these 3 people together conducted a 'human sacrifice' ritual & killed this woman. It's a very gruesome murder; they cut this body into pieces & buried it in the backyard of the house. Our further probe revealed that this was not the only case: Kochi City Police Commissioner
— ANI (@ANI) October 12, 2022
Also Read: KTR: ఇండియాకి దేశభాష లేదు, భాష సెలెక్ట్ చేసుకొనే హక్కు ప్రజలదే: కేటీఆర్
Also Read: IAF MiG 29K Fighter Jet Crash: సముద్ర తీరంలో కుప్పకూలిన మిగ్- 29కే- పైలట్ సేఫ్!