i bomma Website : ఐ బొమ్మలాంటి పైరసీ వెబ్‌సైట్‌లలో సినిమాలు చూస్తే డేటా ఎలా చోరీ అవుతుంది?
i bomma one Case : ఐ బొమ్మలాంటి పైరసీ వెబ్‌సైట్‌లో సినిమాలు చూడటం తప్పేంకాదని చాలా మంది భావిస్తున్నారు. కానీ ఒక సినిమా చూసే లోపు మీ డేటాను సైబర్ నేరగాళ్లుకు ఎలా చేరుతుందో చూద్దాం.

i bomma one Case : తాజా సినిమాలు రిలీజ్ అయిన రోజే “ఐబొమ్మ, మూవీరూల్స్, తమిళ్‌రాకర్స్, జియోరాకర్స్, మూవీస్‌డా” లాంటి పైరసీ వెబ్‌సైట్‌ల్లో ఉచితంగా చూడాలనే ఆశతో లక్షల మంది యూజర్లు ప్రతిరోజూ ఈ సైట్లను సందర్శిస్తున్నారు. కానీ మీరు ఒక్క సినిమా చూసే సమయంలోనే మీ ఫోన్ నుంచి వ్యక్తిగత డేటా (ఫోటోలు, బ్యాంక్ డీటెయిల్స్, పాస్‌వర్డ్స్, లొకేషన్) పూర్తిగా చోరీ అవుతుందని మీకు తెలుసా.
ఉచితంగా వస్తుందని అనుకోవద్దు
ప్రపంచంలో ఏదైనా సరే ఉచితంగా రాదు. మీకు సినిమాను ఎరగా వేసిన సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. మీ డేటాను చోరీ చేసి డార్క్‌సైట్‌లకు ఇచ్చేస్తున్నారు. ఈ కారణంగానే మీకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వస్తున్నాయి. మీ అకౌంట్స్ హ్యాక్ అవుతున్నాయి. మీకు తెలియకుండానే మీరు సైబర్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. కేవలం ఒక సినిమా చూసి మీ విలువైన డేటాను ప్రమాదలో పడేస్తున్నారు. ఇదంతా ఎలా జరుగుతుంది? మీకు తెలియకుండానే డేటాను ఎలా చోరీ చేస్తారో ఇక్కడ చూద్దాం.
8 రకాలుగా డేటా చోరీ
మీరు ఐ బొమ్మ సహా ఏదైనా పైరసీ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే మీకు మొదట పాప్ అప్స్ వస్తుంటాయి. వాటిని మీరు రిజెక్ట్ కొట్టినా సరే మీ సిస్టమ్‌లోకి మాల్వేరు చేరిపోతుంది. వచ్చే పాప్ అప్స్‌ను రిజెక్ట్ చేస్తే నష్టం ఉండదని అనుకుంటారు. కానీ ఇక్కడే సైబర్ నేరగాళ్లు తమ బుర్రకు పదును పెడతారు. మీరు పైరసీ సైట్‌లోకి వెళ్లాలంటే కచ్చితంగా ఈ పాప్‌అప్స్‌ను దాటాల్సిందే. అందుకే సైబర్ నేరగాళ్లు ఈ పాప్ అప్స్‌లోనే మాల్వేర్ పెడుతున్నారు. దాన్ని మీరు క్లిక్ చేస్తే చాలు మీసిస్టమ్‌లోకి మాల్వేర్ వచ్చేస్తుంది. రిజెక్టు చేసినా మీకు ముప్పు తప్పదు. ఇదొకటే కాదు పైరసీ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే 8 మార్గాల్లో మీ డేటాకు ముప్పు పొంచి ఉంది.
సైట్ ఓపెన్ చేసిన వెంటనే వచ్చే పాప్-అప్స్ క్లిక్ చేస్తే “Drive-by Download” అనే మాల్వేర్ ఆటోమాటిక్‌గా ఫోన్‌లోకి డౌన్‌లోడ్ అవుతుంది. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయి మీ ఫైల్స్, ఫోటోలు, మెసేజెస్‌ను అవతలి వ్యక్తులకు మీకు తెలియకుండానే పంపిస్తుంది.
క్రిప్టోజాకింగ్ మైనింగ్
మీరు సినిమా చూస్తున్నప్పుడు వెబ్‌సైట్ మీ ఫోన్ CPU/GPUని ఉపయోగించి బిట్‌కాయిన్ మైనింగ్ చేస్తుంది. దీని వల్ల బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుంది, ఫోన్ వేడెక్కుతుంది, నెట్ స్పీడ్ తగ్గుతుంది.
ఫేక్ “Play” బటన్ ట్రాప్
సినిమా ప్లే చేయడానికి “Play” బటన్ నొక్కితే అది నిజమైన బటన్ కాదు – అది ఫేక్ APK డౌన్‌లోడ్ లింక్. దాన్ని ఇన్‌స్టాల్ చేస్తే ఫోన్ పూర్తిగా హ్యాకర్స్ నియంత్రణలోకి వెళ్తుంది.
కుకీస్ & ట్రాకర్స్ ద్వారా పర్సనల్ ప్రొఫైల్
ఈ సైట్లు 50-100 కంటే ఎక్కువ థర్డ్-పార్టీ ట్రాకర్స్ ఉపయోగిస్తాయి. మీ లొకేషన్, ఫోన్ మోడల్, బ్రౌజర్ హిస్టరీ, గూగుల్ అకౌంట్ డీటెయిల్స్ – అన్నీ రికార్డ్ చేసి డార్క్ వెబ్‌లో అమ్ముతాయి.
ఫిషింగ్ పేజీలు & OTP చోరీ
“సినిమా చూడాలంటే రిజిస్టర్ అవ్వండి” అని ఫేక్ లాగిన్ పేజీ వస్తుంది. మీరు మొబైల్ నంబర్, OTP ఎంటర్ చేస్తే ఆ నంబర్‌తో మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేయడం సులువు.
రాన్‌సమ్‌వేర్ దాడులు
2024-25లో దాదాపు 18,000 మంది ఆంధ్ర-తెలంగాణ యూజర్లు ఐబొమ్మ సైట్ నుంచి రాన్‌సమ్‌వేర్ దాడికి గురయ్యారు. ఫోన్‌లోని ఫోటోలు, డాక్యుమెంట్స్ లాక్ చేసి ₹15,000 నుంచి ₹50,000 వరకు డిమాండ్ చేస్తారు.
కెమెరా & మైక్ యాక్సెస్
కొన్ని సైట్లు “వీడియో ప్లే చేయడానికి కెమెరా అనుమతి ఇవ్వండి” అని అడుగుతాయి. అనుమతి ఇస్తే మీ ఫోన్ కెమెరా, మైక్ ద్వారా రికార్డింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేసే కేసులు కూడా నమోదయ్యాయి.
డార్క్ వెబ్‌లో మీ డేటా అమ్మకం
మీ ఫోన్ నంబర్, బ్యాంక్ OTP ,ఫోటోల కాంబినేషన్ డార్క్ వెబ్‌లో ₹800 నుంచి ₹5,000 వరకు అమ్ముడవుతుంది. ఐబొమ్మ, మూవీరూల్స్ సైట్లను ప్రతిరోజూ 80 లక్షల మంది ఇండియన్ యూజర్లు విజిట్ చేస్తున్నారు. 2025లో ఈ సైట్ల వల్ల ₹1,800 కోట్లకు పైగా సైబర్ మోసాలు జరిగాయి . హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో మాత్రమే 2,800 కంప్లైంట్స్ నమోదు.
సురక్షితంగా సినిమాలు చూడాలంటే?
- ఒరిజినల్ OTT ప్లాట్‌ఫామ్స్ (నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, హాట్‌స్టార్, ఆహా, జీ5) మాత్రమే ఉపయోగించండి.
- ఉచితంగా సినిమాలు ఇచ్చే సైట్ అంటే 100% మోసమే.
- మొబైల్‌లో మంచి యాంటీవైరస్ ఇన్‌స్టాల్ చేయండి.
- VPN ఉపయోగించినా పైరసీ సైట్లు సేఫ్ కావు – VPN మాల్వేర్‌ను ఆపదు.





















