అన్వేషించండి

Man Set on Fire: కోడలు అక్రమ సంబంధాన్ని ప్రశ్నించాడని మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు

కోడలి అక్రమ సంబంధంపై నిలదీసినందుకు మామపై కిరాతకానికి పాల్పడ్డారు. దారికాచి మరీ బైక్ ఆపి పెట్రోల్ పోసి నిప్పటించి నిందితులు పరారయ్యారు. ఈ కేసులో పోలీసులు నలుగుర్ని అరెస్ట్ చేశారు.

కడలూరు: తమిళనాడులోని కడలూరు జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. కోడలు అక్రమ సంబంధం పెట్టుకుందని మందలించినందుకు, ఆ వృద్ధుడ్ని ఆమె ప్రియుడు అత్యంత దారుణంగా సజీవ దహనం చేయడానికి ప్రయత్నించాడు. తీవ్ర కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

బాధితుడు రాజేంద్రన్ (64) తన కోడల్ని ప్రవర్తన మార్చుకోవాలని, ఆమెకు మణికందన్ అనే వ్యక్తితో ఉన్న అక్రమ సంబంధాన్ని గత కొంతకాలంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో కుటుంబంలో పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కోపంతో రాజేంద్రన్‌ను అడ్డుతొలగించుకోవాలని ఆయన కోడలు తన ప్రియుడు మణికందన్ తో కలిసి ప్లాన్ చేసింది. 

నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు

బాధితుడు రాజేంద్రన్ బైక్‌పై వెళ్తున్న సమయంలో నిందితుడు మణికందన్ తన అనుచరులతో కలిసి అతడిని అడ్డుకున్నాడు. అందరూ చూస్తుండగానే రాజేంద్రన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. మంటల్లో చిక్కుకున్న రాజేంద్రన్ ఆర్తనాదాలు చేస్తూ రోడ్డుపై పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  శరీరానికి 70 శాతం గాయాలవ్వడంతో ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూసిన వారు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నలుగురు నిందితుల అరెస్ట్

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు మణికందన్, బాధితుడి కోడలు జయప్రియతో పాటు ఇందులో పాల్గొన్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కడలూరు పోలీసులు వెల్లడించారు. వివాహేతర సంబంధాల వల్ల ప్రాణాల మీదకు వస్తున్న ఇటువంటి ఘటనలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు వారి జీవితాలతో పాటు ఇతరుల ప్రాణాలను రిస్కులో పెడుతున్నాయి. కొన్ని సందర్భాలలో కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. అయినా మనుషుల ప్రవర్తనలో మార్పు రావడం లేదని పోలీసులు అంటున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget