Gurajala Incident : గురజాల రైల్వే స్టేషన్ లో ఒడిశా మహిళపై అత్యాచారం, మరో నిందితుడి అరెస్టు
Gurajala Incident : గురజాల రైల్వే స్టేషన్ లో ఒడిశా మహిళపై అత్యాచారం చేసిన మరో యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 16న గురజాల రైల్వే స్టేషన్ లో మహిళపై ఇద్దరు అత్యాచారం చేశారు.
![Gurajala Incident : గురజాల రైల్వే స్టేషన్ లో ఒడిశా మహిళపై అత్యాచారం, మరో నిందితుడి అరెస్టు Gurajala Railway station Odisha woman sexually abused culprit arrested Gurajala Incident : గురజాల రైల్వే స్టేషన్ లో ఒడిశా మహిళపై అత్యాచారం, మరో నిందితుడి అరెస్టు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/02/dd8b1d7c32dcfa1672f31078c920a44a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gurajala Incident : పల్నాడు జిల్లా గురజాల రైల్వే స్టేషన్‌లో ఒడిశా మహిళపై అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. ఏప్రిల్ 16వ తేదీన గురజాల రైల్వే స్టేషన్‌లో రెండేళ్ల బాలుడితో కలిసి నిద్రపోతున్న మహిళను ఇద్దరు యువకులు నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. రాత్రి సమయం కావడంతో ఈ ఘటనను ఎవరూ గుర్తించలేకపోయారు. మరుసటి ఉదయం అటువైపు వెళ్లిన స్థానికులు స్పృహ లేకుండా పడి ఉన్న మహిళను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసు దర్యాప్తు చేపట్టారు. గురజాలకు చెందిన మాదిరాజు ప్రసాద్‌ను గత నెలలోనే అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ1 నిందితుడు కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన కండ్రకొండ సుబ్బారావు పరారీల ఉన్నాడు. అతడిని ఇవాళ అరెస్టు చేశారు.
అసలేం జరిగింది?
గుంటూరు జిల్లాలో గత నెలలో దారుణ ఘటన జరిగింది. గురజాల రైల్వేస్టేషన్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒడిశా నుంచి వచ్చిన ఒక మహిళ అపస్మారక స్థితిలో ఉంది. మహిళ పక్కనే రెండేళ్ల వయసున్న బాలుడు ఏడుస్తున్న ఘటన స్థానికులను కలచివేసింది. దీంతో వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన మహిళ తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసినట్లుగా సైగలతో చెబుతుందని స్థానికులు చెబుతున్నారు. ఒడిశాకు చెందిన మహిళగా కావటంతో భాష అర్థం కావటం లేదని, ఏం జరిగిందనేది పూర్తిగా తెలియాల్సి ఉందని ఆసుపత్రి వైద్యురాలు లక్ష్మీ తెలిపారు. బాధితురాలికి వైద్యులు చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వైద్యురాలు లక్ష్మీ తెలిపారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేశారు.
"6.30 గంటలకు 108 గంటలకు ఓ మహిళను ఆసుపత్రికి తీసుకొచ్చారు. రైల్వేస్టేషన్ లో అపస్మారక స్థితిలో ఉందని 108 సిబ్బంది తెలిపారు. ఆమె భాష కూడా అర్థం కావడంలేదు. సైగల ద్వారా రైల్వే గేట్ వద్ద తనపై ఇద్దరు అత్యాచారం చేశారని చెబుతోంది. ఇక్కడకు వచ్చినప్పుడు ఆమె బీపీ కూడా డిటెక్ట్ అవ్వలేదు. ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాము. ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగుపడింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసుల విచారణ పూర్తి అయిన తర్వాత అసలేం జరిగిందే స్పష్టత వస్తుంది. అమ్మాయి పేరు సారిక అని చెబుతోంది. తన భర్త పేరు, ఇతర వివరాలు తెలపలేదు." అని వైద్యురాలు లక్ష్మీ తెలిపారు.
Also Read : House Rent Crime : "టూ లెట్" అంటే ఆ జంటకు అలా అర్థం అయింది - చూస్తామని వెళ్లి ఏం చేశారంటే ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)