By: ABP Desam | Updated at : 16 Apr 2022 01:22 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
గురజాలలో ఒడిశాకు చెందిన మహిళపై దారుణం
Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం ఘటన జరిగింది. గురజాల రైల్వేస్టేషన్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒడిశా నుంచి వచ్చిన ఒక మహిళపై అపస్మారక స్థితిలో ఉంది. మహిళ పక్కనే రెండేళ్ల వయసున్న బాలుడు ఏడుస్తున్న ఘటన స్థానికులను కలచివేసింది. దీంతో వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన మహిళ తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసినట్లుగా సైగలతో చెబుతుందని స్థానికులు చెబుతున్నారు. ఒడిశాకు చెందిన మహిళగా కావటంతో బాషా అర్థం కావటం లేదని, ఏం జరిగిందనేది పూర్తిగా తెలియాల్సి ఉందని ఆసుపత్రి వైద్యురాలు లక్ష్మీ తెలిపారు. బాధితురాలికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వైద్యురాలు లక్ష్మీ తెలిపారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేశారు.
"6.30 గంటలకు 108 గంటలకు ఓ మహిళను ఆసుపత్రికి తీసుకొచ్చారు. రైల్వేస్టేషన్ లో అపస్మారక స్థితిలో ఉందని 108 సిబ్బంది తెలిపారు. ఆమె భాష కూడా అర్థం కావడంలేదు. సైగల ద్వారా రైల్వే గేట్ వద్ద తనపై ఇద్దరు అత్యాచారం చేశారని చెబుతోంది. ఇక్కడకు వచ్చినప్పుడు ఆమె బీపీ కూడా డిటెక్ట్ అవ్వలేదు. ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాము. ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగుపడింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసుల విచారణ పూర్తి అయిన తర్వాత అసలేం జరిగిందే స్పష్టత వస్తుంది. అమ్మాయి పేరు సారిక అని చెబుతోంది. తన భర్త పేరు, ఇతర వివరాలు తెలపలేదు." అని వైద్యురాలు లక్ష్మీ తెలిపారు.
ప్రకాశం జిల్లాలో మరో దారుణం
కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి యువతి నగ్న చిత్రాలు తీశాడు ఓ విద్యార్థి. ఈ ఫొటోలను మరో యువకుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. యువతి ఫిర్యాదుతో వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల స్టేషన్ ఎస్సై హరిబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దదోర్నాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన దూదేకుల నాగూర్ మీరావలి డిప్లామో చదువుతున్నాడు. మరో గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని స్నేహితురాలి పుట్టినరోజు వేడుకల కోసం ఇటీవల మార్కాపురం వచ్చింది. యువతితో పరిచయం ఉండటంతో మీరావలి ఆమెను పలకరించాడు. కూల్ డ్రింక్ తాగుదామని పిలిచాడు. అందులో మత్తు పదార్థాలు కలిపి ఇవ్వడంతో అది తాగి యువతి స్పృహ కోల్పోయింది. విద్యార్థిని వివస్త్రను చేసి మీరావలి నగ్న చిత్రాలు తీశాడు. ఆ ఫొటోలను మీరావలి స్నేహితుడు మోకానిక్ డి.రసూల్ కు చూపించాడు. అతడు వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్‌గా అయ్యాయి. విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్థులు ఈ ఘటనపై పెద్దదోర్నాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Anantapur: సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రైనీ జేసీ తనిఖీలు - పోలీసులు అరెస్టు చేయడంతో కి‘లేడీ’ ట్విస్ట్
DK SrinivaS Arrest : డ్రగ్స్ కేసులో డీకే ఆదికేశవులు కుమారుడు - బెంగళూరులో అరెస్ట్ చేసిన ఎన్సీబీ !
Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి
Goa News: దొంగల నయా ట్రెండ్- ఇల్లంతా దోచేసి, లవ్ లెటర్ రాసి పరార్!
Hyderabad: వంట మాస్టర్తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి