By: ABP Desam | Updated at : 17 Feb 2022 05:12 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కాల్వలో ఇద్దరు యువకులు గల్లంతు
నలుగురు స్నేహితులు సరదాగా కలిసి పార్టీ చేసుకున్నారు. పార్టీ అనంతరం చల్లగుండ్ల వద్ద గల గోరంట్ల బ్రాంచ్ కెనాల్(Gorantla Branch Canal) లో ఈతకు దిగి గల్లంతైన(Drown) సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంగ గుంటూరు జిల్లా(Guntur District) కుంకలగుంట గ్రామానికి చెందిన నలుగురు యువకులు చల్లగుండ్లలోని గోరంట్ల మేజర్ కెనాల్ ఒడ్డున పార్టీ చేసుకున్నారు. అనంతరం ఈతకు కెనాల్ లో దిగిన వర్ణ శ్రీను, నందిగం ఏడుకొండలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. విషయం తెలిసిన గ్రామస్తులు పోలీసులు నీటి ప్రవాహం నిలిపివేసి వెతుకులాట ప్రారంభించారు. చీకటి సమయం కావడంతో వెతుకులాట ఇబ్బందికరంగా మారింది. నరసరావుపేట రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి, ఎస్ఐ సురేష్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని బంధువులు, స్థానికుల సహకారంతో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించారు. గురువారం ఉదయం గల్లంతైన శ్రీను మృతదేహం లభ్యమయింది. మధ్యాహ్నం ఏడు కొండలు మృతదేహం దొరికింది. మృతదేహాలను పోస్టు మార్టం కోసం నర్సారావుపేట ప్రభుత్వ హాస్పటల్(Narsaraopeta Govt Hospital) కు తరలించారు.
Also Read: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, కరోనా ముందు విధంగా దర్శనాలు, టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
బావిలో పడి 13 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్(UttarPradesh)లో ఘోర విషాదం జరిగింది. ఖుషీనగర్లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో బావిలో పడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 9 మంది బాలికలు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. వివాహానికి(Marriage) ముందు నిర్వహించిన హల్దీ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. పరేమేశ్వర్ కుష్వాహా అనే వ్యక్తికి సంబంధించిన వివాహ వేడుక నెబువా నౌరాంగియాలో నిర్వహించారు. హల్దీ కార్యక్రమానికి భారీగా అతిథులు తరలి వచ్చారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో 50-60 మంది మహిళలు, బాలికలు ఓ బావి దగ్గర వేడుకలు చేసుకున్నారు. ఇనుప కంచెతో మూసేసిన ఆ పాడుబడ్డ బావిపై కొంతమంది నిల్చున్నారు. అయితే బరువు ఎక్కువ కావడం వల్ల కంచె విరిగిపోయింది. కొంతమంది బావిలో పడిపోయారు. వెంటనే చుట్టూ ఉన్నవారంతా వచ్చి వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే అందులో 13 మంది మరణించారని వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) కూడా ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
Hyderabad news : ప్రియుడితో భార్య రాసలీలలు, రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్న భర్త
Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం, తొమ్మిదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
Kondapalli Hidden Treasures : కొండపల్లి ఫారెస్ట్ లో గుప్త నిధులున్నట్లు ప్రచారం, తవ్వకాలు స్టార్ట్ చేసేసిన కేటుగాళ్లు
Bapatla Volunteer Murder : మహిళా వాలంటీర్ మర్డర్ కేసులో నిందితుడు రైలు కింద పడి ఆత్మహత్య
Uttarakhand News : కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ, పోలీసులను ఆశ్రయించిన భర్త
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు