By: ABP Desam | Updated at : 23 Apr 2022 04:53 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఎర్రబాలెం భర్త ఇంటి ముందు యువతి ఆందోళన
Guntur News : గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎర్రబాలెంలోని భర్త ఇంటి ముందు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మౌన పోరాటానికి దిగింది. ప్రేమించి, పెళ్లి చేసుకుని ఏడేళ్లు కాపరం చేసి పిల్లల్ని కన్నాక తన భర్తకు వేరొక పెళ్లి చేసే ప్రయత్నం జరుగుతోందంటూ పోలీసులను ఆశ్రయించింది సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనూష. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగటం లేదంటూ భర్త ఇంటి ముందు నిరసన చేపట్టింది. మహిళల రక్షణకు అనేక చట్టాలు వచ్చినప్పటికీ న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
పసిపిల్లలతో నడిరోడ్డుపై
తన బంగారం తీసుకుని, తన పేరుపై లోన్లు పెట్టి మోసం చేశాడంటూ ఎర్రబాలెంలోని భర్త ఇంటి ముందు అనూష ధర్నాకు దిగింది. మంగళగిరి రూరల్ పోలీసులు తనకు న్యాయం చేయలేదని మహిళ ఆవేదన చెందుతుంది. తన భర్త ఎర్రబాలెంలోని వారి బంధువుల ఇంట్లో ఉన్నారని తెలిసినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆరోపిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకుని ఏడు సంవత్సరాలు కాపురం చేశాడని ఆరోపించారు. ఇద్దరు పిల్లలు పుట్టాక ఇప్పుడు తన భర్తకు మాయమాటలు చెప్పి మరో వివాహం చేస్తున్నారని ఆవేదన చెందుతుంది. తనను రోడ్డు మీద పడేసి తన భర్తను ఇంట్లో దాచి పెట్టారని ఆరోపిస్తుంది. భర్తను తనతో రాకుండా కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నారని అనూష అంటున్నారు.
Also Read : Cars Thief: పట్టుకోండి చూద్దామన్న దొంగకు పోలీసులు షాక్ - ఏకంగా 10 రాష్ట్రాల్లో కేసులు
పోలీసులకు ఫిర్యాదు చేసినా
"నా భర్త కారు కూడా ఇక్కడే ఉంది. నా భర్తను విడదీయడానికి ప్రయత్నిస్తున్నారు. నా భర్త ఫోన్ కూడా ఇక్కడే ఉంది. అయినా లేడని చెప్తున్నారు. మూడేళ్లు ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. తర్వాత పెళ్లి చేసుకుని ఏడేళ్లు కాపురం చేశాడు. ఇప్పుడు పిల్లలు పట్టాక వదిలేసివెళ్లిపోయాడు. నా భర్త నన్ను వేధిస్తున్నాడు. రోజూ కొడుతున్నాడు. నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా భర్తను చూపించకుండా నాపైనే కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మేమిద్దరం ఐటీ ఉద్యోగులు. అతని పేరు శ్రీమాన్ దర్బా, హైదరాబాద్ కాగ్నిజెంట్ లో పనిచేస్తున్నాడు." అని బాధితురాలు అనూష అన్నారు.
ఈ ఘటనపై అనూష అత్తింటి వారు ఇంకా స్పందించలేదు. శ్రీమాన్ అందుబాటులో లేడని తెలుస్తోంది.
Also Read : Palnadu District: అందరూ చూస్తుండగా పట్టపగలే కిడ్నాప్, మరుసటిరోజు ఉదయం శవమై కనిపించిన ఎగ్జిక్యూటివ్ !
Bear Attack in Vizag: ఎలుగు దాడిలో కేర్ టేకర్ మృతి - విశాఖ జూపార్కులో విషాదం
Delhi News: ఇళ్లు శుభ్రం చేయమన్నందుకు భర్త చెవి కొరికిన భార్య - ఢిల్లీలో దారుణ ఘటన
Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
Andhra News: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ - అవమాన భారంతో ఆత్మహత్య
Kochi Stampede: కొచ్చి వర్సిటీలో టెక్ ఫెస్ట్ లో తొక్కిసలాట- నలుగురు విద్యార్థులు మృతి, శశిథరూర్ దిగ్భ్రాంతి
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి
/body>