Gujarat Crime News: వీడియో కాల్ ద్వారా వ్యాపారి నగ్న దృశ్యాలు రికార్డు - ఆపై బెదిరిస్తూ రూ.2.96 కోట్లు వసూలు
Gujarat Crime News: వీడియో కాల్ ద్వారా ఓ వ్యాపారి నగ్న దృశ్యాలు రికార్డు చేశారు. ఆపై బెదిరింపులకు పాల్పడుతూ... ఏకంగా రూ.2.69 కోట్ల రూపాయలు వసూలు చేశారు.
Gujarat Crime News: ముందుగా ఓ మహిళ.. వ్యాపారికి వీడియో కాల్ చేసింది. నగ్నంగా కనిపిస్తూ.. కవ్వించేలా మాడ్లాడింది. దీంతో టెంప్ట్ అయిన సదరు వ్యాపారి కూడా నగ్నంగా ఆమెతో ఫోన్ మాట్లాడాడు. ఇదే అతని పాలిట శాపంగా మారింది. 2.69 కోట్ల రూపాయలు కోల్పేయేలా చేయడంతో పాటు విపరీతమైన ఆందోళనకు గురయ్యేలా చేసింది.
అసలేం జరిగిందంటే..?
గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారికి గతేడాది ఆగస్టు 8వ తేదీన.. మోర్బికి చెందిన రియా శర్మ పేరిట ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది చూసిన వ్యాపారి కూడా ఆమెతో మాట్లాడాడు. ఈ క్రమంలోనే సదరు యువతి నగ్నంగా ఉండి వీడియో కాల్ చేసింది. కవ్వించేలా మాట్లాడుతూ.. అతడికి మత్తెక్కించింది. అలా తీవ్ర కామోద్రేకానికి గురైన అతడు కూడా... బట్టలన్నీ విప్పేసి నగ్నంగా ఆమెతో ఫోన్ మాట్లాడాడు. అప్పడే ఆ యువతి.. అతడు నగ్నంగా ఉన్న వీడియోను రికార్డు చేసింది. ఆపై డబ్బులు పంపించకుంటే ఆ వీడియోను బయట పెడతానంటూ బెదిరింపులకు పాల్పడింది. వీడియో బయటకు వస్తే తన పరువు పోతుందని భావించిన అతడు.. సదరు యువతికి రూ.50 వేలు పంపించాడు.
రియా శర్మ ఆత్మహత్యకు యత్నించిందంటూ... 80.97 లక్షలు
ఆ తర్వాత మరికొన్ని రోజులకే మరో యువకుడు ఫోన్ చేశాడు. తనను తాను దిల్లీకి చెందిన ఇన్ స్పెక్టర్ శర్మగా పరిచయం చేసుకున్నాడు. వీడియో క్లిప్ తన వద్ద ఉందని చెప్పి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని.. లేని పక్షంలో కేసు బుక్ చేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయపడిపోయిన వ్యాపారి అతడికి 3 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆగస్టు 14వ తేదీన మరో వ్యక్తి పోన్ చేసి.. దిల్లీ పోలీస్ సైబర్ సెల్ సిబ్బందిని అని చెప్తూ... రియా శర్మ ఆత్మహత్యకు యత్నించిందని, ఆ వీడియో కాల్ యే అందుకు కారణం అని చెప్పాడు. ఆ విషయం బయటకు రాకుండా ఉండాలంటే డబ్బులు కావాలని పలు దపాలుగా రూ.80.97 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత కొంత కాలానికి సీబీఐ అధికారిని అంటూ మరో వ్యక్తి ఫోన్ చేశాడు.
కేసు మూసివేసినట్లు దిల్లీ హైకోర్టు పేరిట నకిలీ ఉత్తర్వులు
ఈ వ్యవహారంపై రియా శర్మ తల్లి సీబీఐని ఆశ్రయించిందని నమ్మబలికాడు. కేసు సెటిల్ మెంట్ కు రూ.8.5 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు నగదు చెల్లిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే డిసెంబర్ 15వ తేదీన కేసు మూసివేసినట్లు దిల్లీ హైకోర్టు పేరిట నకిలీ ఉత్తర్వులు అందాయి. ఆ పత్రాలపై అనుమానం రావడంతో జనవరి 10వ తేదీన సదరు వ్యాపారి సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు. రూ. 2.69 కోట్లు కాజేశారంటూ మొత్తం 11 మందిపై ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే నిందిలపై పోలీసులు ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని.. విచారణ జరుగుతోందని చెప్పారు.