అన్వేషించండి

GST scam busted: ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?

GST scam: రూ. 217 కోట్ల భారీ జీఎస్టీ కుంభకోణాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు బట్టబయలు చేశారు. కాగితాలపై రూ. 1,472 కోట్ల లావాదేవీలతో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందారు.

Police arrest gang involved in GST scam worth hundreds of crores:  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న  రూ. 217 కోట్ల భారీ జీఎస్టీ (GST) కుంభకోణాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు బట్టబయలు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవస్థీకృత నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎటువంటి వస్తువులు , సేవల సరఫరా లేకుండానే కేవలం కాగితాలపై  రూ. 1,472 కోట్ల విలువైన భారీ లావాదేవీలను సృష్టించి, తప్పుడు పద్ధతిలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
 
72 షెల్ కంపెనీల మాయాజాలం 

ఈ భారీ స్కామ్ కోసం నిందితులు ఏకంగా  72 నకిలీ షెల్ కంపెనీలను సృష్టించారు. సాధారణ వ్యక్తుల ఆధార్, పాన్ కార్డులను సేకరించి, వారికి తెలియకుండానే వారి పేరు మీద ఈ సంస్థలను రిజిస్టర్ చేశారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించని చిన్న గదులు, మూసివేసిన షాపులను అద్దెకు తీసుకుని, నకిలీ అద్దె ఒప్పందాలు, యుటిలిటీ బిల్లులతో జీఎస్టీ రిజిస్ట్రేషన్లు పొందారు. ఈ సంస్థల మధ్యే పరస్పరం తప్పుడు ఇన్వాయిస్‌లను మార్పిడి చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు.

 నిందితుల అరెస్ట్ - కీలక సూత్రధారి పరారీ 

ఈ కేసులో ప్రధానంగా  సిద్ధగోని ప్రభాకర్ , రామావత్ నాగరాజు నాయక్ అనే ఇద్దరు వ్యక్తులను డీజీజీఐ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరిలో నాగరాజు నాయక్ నకిలీ పత్రాలు సృష్టించడం, డమ్మీ యజమానులను ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించగా, ప్రభాకర్ రిజిస్ట్రేషన్లు , బయోమెట్రిక్ ప్రక్రియలను సమన్వయం చేసేవాడు. అయితే, ఈ మొత్తం వ్యవహారానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న  ధంట్ల ఆదిరెడ్డి అలియాస్ అంజిరెడ్డి  ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అధికారులు అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

 డేటా అనలిటిక్స్‌తో గుట్టు రట్టు                                           

అడ్వాన్స్‌డ్ డేటా అనలిటిక్స్ ,రిస్క్ ప్రొఫైలింగ్ ద్వారా ఈ భారీ నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించారు. కొన్ని సంస్థల జీఎస్టీ ఫైలింగ్‌లో అసాధారణ మార్పులు గమనించిన విశాఖపట్నం డీజీజీఐ జోనల్ యూనిట్, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించింది. విచారణలో ఆ సంస్థల పేరిట జరుగుతున్న వ్యాపారానికి, వాస్తవానికి ఎక్కడా పొంతన లేకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

 కఠిన చర్యలు తీసుకుంటున్న అధికారులు                       

నిందితులపై సెంట్రల్ జీఎస్టీ చట్టం కింద నాన్-బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణం ద్వారా లబ్ధి పొందిన ఇతర కంపెనీలు, వ్యక్తుల ఆర్థిక లావాదేవీలపై అధికారులు ప్రస్తుతం దృష్టి సారించారు. బ్యాంకు ఖాతాల సీజింగ్ , తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఇలాంటి ఫేక్ ఐటీసీ రాకెట్లపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు హెచ్చరించారు. 


 

టాప్ హెడ్ లైన్స్

Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget