అన్వేషించండి

Gold Seized in Vijayawada: విజయవాడలో రూ.7.48 కోట్ల బంగారం పట్టివేత - బస్సులో, రైళ్లో తరలిస్తుండగా నిందితుల అరెస్ట్!

Gold Seized in Vijayawada: విజయవాడలో అక్రమంగా తరలిస్తున్న 7.48 కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. 

Gold Seized in Vijayawada: విజయవాడ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టుబడింది. 7.48 కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. అయితే విజయవాడ రైల్వే స్టేషన్ లో బంగారం తరలిస్తుండగా.. విషయం గమనించిన కస్టమ్స్ అధికారులు ముగ్గురిని చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి బంగారం స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. అలాగే ఆంధ్రా - తమిళనాడు సరిహద్దులో బస్సుల్లో బంగారం తరలిస్తున్న మరో వ్యక్తిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇతడి వద్ద నుంచి కూడా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో మొత్తం రాష్ట్రంలోని వివిధ కస్టమ్ ఫార్మేషన్‌లకు చెందిన 30 మంది అధికారులు పాల్గొనన్నారు. అలాగే రెండు చోట్ల కలిసి మొత్తం నలుగురు నిందితులు అరెస్టయ్యారు. 

ఇటీవల శ్రీకాకుళంలో 7.396 కిలోల బంగారం పట్టివేత

శ్రీకాకుళం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టుబడింది. 4.21 కోట్లు విలువ చేసే 7.396 కిలోల బంగారం పట్టుబడింది. అయితే చెన్నయ్ మెయిల్ రైళ్లో కోల్ కతా నుంచి ట్రాలీ బ్యాగ్ తో ఓ వ్యక్తి వచ్చాడు. ఈ క్రమంలోనే అతడు మరో వ్యక్తికి తన బ్యాగ్ ను అందజేస్తుండగా.. డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట చేశారు. అనంతరం ట్రాలీ బ్యాగును తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే 4.21 కోట్ల రూపాయల విలువ చేసే 7.396 కిలోల బంగారపు కడ్డిలను గుర్తించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బంగారాన్ని బంగ్లాదేశ్ నుంచి స్మగ్లింగ్ చేసి కోల్ కతా లో కడ్డీలుగా మార్చి ఏపీకి తీసుకొచ్చినట్డు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులను  విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.  

ఐదు రోజుల కిందట విశాఖకు తరలింపు

బంగ్లాదేశ్ నుంచి విశాఖకు అక్రమంగా తరలిస్తున్న 1.86 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ సుమారు రూ.1.07 కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. బంగారం స్మగ్లింగ్ పై సమాచారంతో  డీఆర్ఎస్ అధికారులు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో కోల్‌కతా నుంచి షాలిమార్-సికింద్రాబాద్ AC సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం.12773)లో వచ్చిన స్మగ్లర్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున స్మగ్లింగ్ చేస్తున్న బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. నిందితుల నుంచి రూ.1.07 కోట్ల విలువైన 1860.5 గ్రాముల బంగారాన్ని (కడ్డీలు, ముక్కల రూపంలో) స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి నుంచి రాబట్టిన సమాచారంతో సోదాలు చేశారు.  ఈ స్మగ్లింగ్ బంగారాన్ని బంగ్లాదేశ్ నుంచి తరలించినట్లు డీఆర్ఐ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు స్మగ్లింగ్ చేసి అక్కడ బంగారం కరిగించి, వివిధ ఆకారాలు, పరిమాణాల్లో బంగారు కడ్డీలు/ముక్కలుగా మార్చారు. కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులను  విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Rapido Data Leak: యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Embed widget