అన్వేషించండి

Hyderabad News: పారిశుద్ధ్య కార్మికురాలిపై ఫీల్డ్ అసిస్టెంట్ లైంగిక వేధింపులు - చర్యలకు జీహెచ్ఎంసీ సిఫారసు

GHMC: పారిశుద్ధ్య కార్మికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఫీల్డ్ ఆఫీసర్‌ పై జీహెచ్ఎంసీ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని జోనల్ కమిషనర్‌ను మేయర్ ఆదేశించారు.

GHMC Action Against SFA Who Harrassed Woman Worker: హైదరాబాద్ జీహెచ్ఎంసీలో (GHMC) దారుణం వెలుగుచూసింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజులరామారం 25 సర్కిల్ పరిధిలో గాజులరామారం జీహెచ్ఎంసీ సర్కిల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ (SFA) కిషన్.. పారిశుద్ధ్య కార్మికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన కింద పని చేసే మహిళా కార్మికురాలిని ఫీల్డ్ ఆఫీసర్ లైంగికంగా వేధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఉద్యోగిని బెదిరించి లైంగికంగా వేధిస్తూ.. తన మొబైల్‌లో వీడియోలు, ఫోటోలు తీశాడు. తాను చెప్పినట్లు వినకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తానని కిషన్ బెదిరించినట్లు బాధితురాలు తెలిపారు. రోజూ పనికి వచ్చిన ఆమెను లైంగికంగా వేధించిన అతను ఈ తతంగమంతా ఫోన్‌లో రికార్డు చేశాడు. ఈ వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవి ఉన్నతాధికారులు సహా తోటి కార్మికుల చేతుల్లోకి సైతం వెళ్లాయి. వీటిని చూసిన తోటి కార్మికులు ఎస్ఎఫ్ఏ కిషన్ ను నిలదీయగా.. వారికి కిషన్ డబ్బు ఆశ చూపించిననట్లు తెలుస్తోంది. దాదాపు 14 మంది తలా రూ.10 వేలు ముట్టచెప్పినట్లు సమాచారం. 

సస్పెన్షన్ వేటు!

మరోవైపు, దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు కిషన్ పై చర్యలు చేపట్టారు. అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అటు, మేయర్ గద్వాల విజయలక్ష్మి సైతం ఈ ఘటనపై స్పందించారు. మహిళా కార్మికురాలిని వేధించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. దీనిపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ కు ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఆ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

Also Read: Hyderabad News : రోడ్డుపై గుంతలో కూర్చుని మహిళ పోరాటం - దెబ్బకు దిగొచ్చిన అధికారగణం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Honeytrap: హైదరాబాద్‌లో భారీ హనీట్రాప్ గుట్టు రట్టు.. ఫేక్ ఖాతాలతో యువకులకు గాలం.. బాధితుల్లో పోలీస్ అధికారి కూడా!
హైదరాబాద్‌లో భారీ హనీట్రాప్ గుట్టు రట్టు.. ఫేక్ ఖాతాలతో యువకులకు గాలం.. బాధితుల్లో పోలీస్ అధికారి కూడా!
Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Vijayawada Crime News: కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
Tiger Shroff : బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు - షాకింగ్ వీడియో... హీరో ఎలా ఉన్నారంటే?
బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు - షాకింగ్ వీడియో... హీరో ఎలా ఉన్నారంటే?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Graduate MLC Election: తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
VC Sajjanar: పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
Vizag Araku Trains: దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
YS Jagan In Pulivendula: ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
Nagole Road Accident: నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్
నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్
Andhra Pradesh Rains: ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
KTR New Look : క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
Samson Super Fandom: రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
Embed widget