అన్వేషించండి

Hyderabad News : రోడ్డుపై గుంతలో కూర్చుని మహిళ పోరాటం - దెబ్బకు దిగొచ్చిన అధికారగణం

Telangana News : రోడ్డుపై గుంతలు పూడ్చాలని ఓ మహిళ నిరసన చేపట్టారు. తమ పిల్లలు ఆ రోడ్ మీదుగా వెళ్తూ గాయపడుతున్నారని తక్షణం రిపేర్ చేయాల్సిదేనని డిమాండ్ చేశారు.

woman protested to fill potholes on the road : హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి క్రమంగా దిగజారుతోంది. చాలా చోట్ల రోడ్లపై గుంతలు పడినా పట్టించుకోవడం లేదు. దాంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. చాలా మంది ఈ గుంతల గురించి ఆలోచించే తీరిక లేక సర్దుకుని పోతున్నారు. ఓ కానీ ఆ గుంతల్లో పడి గాయపడుతున్న పిల్లలను చూసి తట్టుకోలేకపోయిన ఓ అమ్మ రంగంలోకి దిగడంతో మొత్తం సీన్ మారిపోయింది. అధికారులు హుటాహుటిన వచ్చి రిపేర్లు చేస్తామని బతిమాలుకోవాల్సి వచ్చింది.
Hyderabad News : రోడ్డుపై గుంతలో కూర్చుని మహిళ పోరాటం - దెబ్బకు దిగొచ్చిన అధికారగణం

 హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని నాగోల్- ఆనంద్ నగర్ రోడ్డు ఎప్పుడూ బిజీగా ఉంటుంది. కానీ ఆ రోడ్డు నిర్వహణను పట్టించుకోకపోవడంతో గుంతలమయంగా మారింది. ఇటీవల వర్షం పడటంతో ఆ గుంతల్లో నీరు నిలిచిపోయింది. రోడ్డు రాను రాను ప్రమాదకరంగా మారింది.    కుంట్లూర్ కు చెందిన నిహారిక నాగోల్ నుండి కుంట్లూర్ కు రోజు వచ్చి పోతూంటారు.  వాళ్ల పిల్లలు కూడా ఇదే  దారిలో రోజు స్కూల్ కు వెళ్తుంటారు.  గతంలో ఈమె పిల్లలు ఈ రోడ్డు నుండి వెళ్తు కింద పడ్డారు. ఆ రోడ్డు మీదుగా వెళ్తున్న సమయంలో గుంతల్లో నీళ్లు ఉండటం.. తన పిల్లలు గాయపడిన విషయం గుర్తు రావడంతో వెంటనే ఆందోళనకు దిగారు.
Hyderabad News : రోడ్డుపై గుంతలో కూర్చుని మహిళ పోరాటం - దెబ్బకు దిగొచ్చిన అధికారగణం

ఆ రోడ్డులో ఉన్న గుంతల్లో కూర్చున్నారు. గతంలో  అధికారులకు ఆమె ఫిర్యాదు  చేసినా  పట్టించుకోలేని ఇక లాభం లేదని ఆమె   ఆనంద్ నగర్ చౌరస్తాలోని గుంతలో కూర్చున్నారు. ఆమె  గుంతలు పూడ్చాలని నిరసన తెలుపుతున్నారని సమాచారం రావడంతో అధికారులు వచ్చారు. మీడియా కూడా పెద్ద ఎత్తున రావడంతో అధఇికారులు హైరానా పడ్డారు.   జీహెచ్ఎంసీ డిప్యూటీ కమీషనర్ తో ఫోన్ లో మాట్లాడించారు. రేపోమాపో గుంతలు పూడుస్తామని ఆందోళన విరమించాలని కోరడంతో నిహారిక శాంతించారు.                                                              

 రోడ్డు మొత్తం గుంతల మయంగా మారి వర్షం నీరు  చేరి  అవస్థలు పడుతున్నామన నిహారిక ఆవేదన వ్యక్తం చేశారు. గుంతల్లో పడి వాహనదారులు  ప్రమాదాల బారిన పడుతున్నారని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్  పరిధిలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందని.. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ యంత్రాంగం స్పందించి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.  తాము ట్యాక్స్ లు  కడుతున్నాం.. మాకు సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సమస్యను త్వరలో పరిష్కరించకపోతే ఇదే గుంతలో పెద్ద ఎత్తున నిరసనకు దిగుతామని  హెచ్చరించారు.                             

మహిళ పోరాటానికి చాలా మంది మద్దతు తెలిపారు. పౌరులు ఈ మాత్రం నిరసన తెలిపితే తప్ప.. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం లేదన్న అసంతృప్తిని ప్రజలు వ్యక్తం చేశారు.                             

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New Cabinet: మంత్రి పదవులు ఎక్కువ మందికి ఎందుకివ్వరు? ఏపీలో 26 మందికే ఎందుకు?
మంత్రి పదవులు ఎక్కువ మందికి ఎందుకివ్వరు? ఏపీలో 26 మందికే ఎందుకు?
NEET: 'నీట్'గా అమ్మేశారు! ఒక్కో అభ్యర్థి నుంచి 30 లక్షలు వసూలు? జాతీయ మీడియాలో జోరుగా కథనాలు
'నీట్'గా అమ్మేశారు! ఒక్కో అభ్యర్థి నుంచి 30 లక్షలు వసూలు? జాతీయ మీడియాలో జోరుగా కథనాలు
Elon Musk: EVMలను ఏ మాత్రం నమ్మలేం, హ్యాక్‌ అయ్యే ప్రమాదముంది - మస్క్ సంచలన వ్యాఖ్యలు, సమర్థించిన రాహుల్
EVMలను ఏ మాత్రం నమ్మలేం, హ్యాక్‌ అయ్యే ప్రమాదముంది - మస్క్ సంచలన వ్యాఖ్యలు, సమర్థించిన రాహుల్
KCR News: కేసీఆర్ 'కనబడుట లేడు' - గజ్వేల్‌ అంతటా పోస్టర్లు, ర్యాలీలు!
కేసీఆర్ 'కనబడుట లేడు' - గజ్వేల్‌ అంతటా పోస్టర్లు, ర్యాలీలు!
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

Sreesanth About Sanju Samson Shivam Dube | సంజు శామ్సన్ జట్టులో ఉండాలన్న శ్రీశాంత్ | ABP DesamSunil Gawaskar Furious About Florida | ఫ్లోరిడా స్టేడియంపై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP DesamTeam India Sentiment in T20 Worldcup 2024 | టీ20 కప్ టీమిండియాదే అంటున్న ఫ్యాన్స్ | ABP DesamChiranjeevi Wife Surekha Gift to Pawan kalyan | పవన్ కు ఇచ్చిన పెన్ను ధర లక్షల్లో ఉంటుందా..? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New Cabinet: మంత్రి పదవులు ఎక్కువ మందికి ఎందుకివ్వరు? ఏపీలో 26 మందికే ఎందుకు?
మంత్రి పదవులు ఎక్కువ మందికి ఎందుకివ్వరు? ఏపీలో 26 మందికే ఎందుకు?
NEET: 'నీట్'గా అమ్మేశారు! ఒక్కో అభ్యర్థి నుంచి 30 లక్షలు వసూలు? జాతీయ మీడియాలో జోరుగా కథనాలు
'నీట్'గా అమ్మేశారు! ఒక్కో అభ్యర్థి నుంచి 30 లక్షలు వసూలు? జాతీయ మీడియాలో జోరుగా కథనాలు
Elon Musk: EVMలను ఏ మాత్రం నమ్మలేం, హ్యాక్‌ అయ్యే ప్రమాదముంది - మస్క్ సంచలన వ్యాఖ్యలు, సమర్థించిన రాహుల్
EVMలను ఏ మాత్రం నమ్మలేం, హ్యాక్‌ అయ్యే ప్రమాదముంది - మస్క్ సంచలన వ్యాఖ్యలు, సమర్థించిన రాహుల్
KCR News: కేసీఆర్ 'కనబడుట లేడు' - గజ్వేల్‌ అంతటా పోస్టర్లు, ర్యాలీలు!
కేసీఆర్ 'కనబడుట లేడు' - గజ్వేల్‌ అంతటా పోస్టర్లు, ర్యాలీలు!
Sreeleela: చీరలో శ్రీలీల సోకులు- క్యూట్ బ్యూటీ అందానికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!
చీరలో శ్రీలీల సోకులు- క్యూట్ బ్యూటీ అందానికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!
BRS Internal Politics :  బీఆర్ఎస్ అధ్యక్షుడిగా హరీష్ లేదా ప్రవీణ్ - కేసీఆర్ కీలక నిర్ణయం తీసేసుకున్నారా ?
బీఆర్ఎస్ అధ్యక్షుడిగా హరీష్ లేదా ప్రవీణ్ - కేసీఆర్ కీలక నిర్ణయం తీసేసుకున్నారా ?
Actor Nanda Kishore: వెంక‌టేశ్ గారి స్థాయికి నాతో మాట్లాడాకూడ‌దు.. అలాంటిది చాలాసార్లు సాయం చేశారు, యాక్ట‌ర్ నంద కిశోర్
వెంక‌టేశ్ గారి స్థాయికి నాతో మాట్లాడాకూడ‌దు.. అలాంటిది చాలాసార్లు సాయం చేశారు, యాక్ట‌ర్ నంద కిశోర్
AUS vs SCO, T20 World Cup 2024: ఆస్ట్రేలియా గెలిచింది, ఇంగ్లాండ్‌ సూపర్‌ 8లో నిలిచింది
ఆస్ట్రేలియా గెలిచింది, ఇంగ్లాండ్‌ సూపర్‌ 8లో నిలిచింది
Embed widget