News
News
X

Gannavaram Gold Case : గన్నవరం గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఐడీ ఎంట్రీ, వాట్సాప్ లో వార్త ఫార్వర్డ్ చేసినందుకు జర్నలిస్ట్ అరెస్టు!

Gannavaram Gold Case : గన్నవరం ఎయిర్ పోర్టులో బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన మహిళ ఓ ఐఏఎస్ అధికారి భార్య అని ప్రచారం జరిగింది. ఈ వార్తను వాట్సాప్ ఫార్వర్డ్ చేశారన్న కారణంతో సీనియర్ జర్నలిస్ట్ ను సీఐడీ అరెస్టు చేసింది.

FOLLOW US: 

Gannavaram Gold Case : ఏపీలోని గ‌న్నవ‌రం ఎయిర్ పోర్ట్ లో ఒక మ‌హిళ వ‌ద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకున్న కేసులో సీఐడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. సాధార‌ణంగా ఎయిర్ పోర్ట్ లో బంగారం, ఇత‌ర వ్యవ‌హరాల‌కు సంబంధించిన కేసుల‌ను క‌స్టమ్స్ అధికారులు ప‌రిశీలిస్తుంటారు. కానీ ఈ కేసులో మాత్రం సీఐడీ ఎంటరైంది. బంగారం కేసును క‌స్టమ్స్ అదికారులు ద‌ర్యాప్తు చేస్తుంటే, అస‌లు ఆ విష‌యం ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చింది, వాట్సాప్ లో ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అందించిన ఒక సీనియ‌ర్ జ‌ర్నలిస్ట్ పై సీఐడీ కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేయ‌టం ఇప్పుడు ఏపీలో క‌ల‌కలం రేపుతోంది. సీఐడీ అధికారులు విజ‌య‌వాడ‌కు చెందిన‌ సీనియర్ జర్నలిస్టు అంకబాబుపై 120బి, 153, 550 ఐపీసీ సెక్షన్ల కింద కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం జీజీహెచ్‍కు తరలించిన సీఐడీ అధికారులు కోర్టులో హాజ‌రుప‌రిచారు.

ఈనెల 9న గ‌న్నవ‌రం ఎయిర్ పోర్ట్ లో 

ఈనెల 9వ తేదీన గ‌న్నవ‌రం ఎయిర్ పోర్ట్ లో ఒక మ‌హిళ వ‌ద్ద ఎయిర్ పోర్ట్ లోని క‌స్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ త‌ర‌హా నేరాలు అడ‌పా ద‌డ‌పా దేశంలోని అనేక ఎయిర్ పోర్ట్ ల‌లో వెలుగులోకి వ‌స్తూనే ఉంటాయి. కానీ బంగారాన్ని అక్రమంగా తీసుకు వ‌చ్చిన స‌ద‌రు మ‌హిళ ఓ ఐఎఎస్ భార్య అని విస్తృతంగా ప్రచారం జ‌రిగింది. బంగారం అక్రమ ర‌వాణా చేయ‌టం ఒక ఎత్తయితే, స‌ద‌రు మ‌హిళ ఐఏఎస్ భార్య అని ప్రచారం జ‌ర‌గ‌టంతో సంచ‌ల‌నంగా మారింది. దీంతో ఈ వ్యవ‌హారం నేష‌ల్ మీడియాలో కూడా హైలైట్ అయ్యింది. దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగింది. స్థానిక పోలీసులు మెుద‌లుకొని దేశ వ్యాప్తంగా ఉన్న నిఘా వ‌ర్గాలు సైతం ఈ వ్యవ‌హారంపై ఆరా తీశాయి. అంతే కాదు ఒకానొక సంద‌ర్భంలో సీఎంవో కార్యాల‌యంలో ప‌ని చేసిన కీల‌క అధికారి భార్య అని కూడా ప్రచారంలోకి వ‌చ్చింది. ఈ ప్రచారం అంతా వాట్సాప్ లోనే సాగ‌టం విశేషం. 

ఐఏఎస్ భార్య ఉన్నారని ప్రచారం 

 ఎయిర్ పోర్ట్ లో బంగారంతో వ‌చ్చిన మహిళ‌ను క‌స్టమ్స్ అధికారులు అరెస్ట్ చేసి విచారించి కేసు నమోదు చేసిన‌ప్పటికీ, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వడంతో అధికారులు ఆరా తీశారు. బంగారంతో మ‌హిళ‌ను అరెస్ట్ చేసిన విష‌యం వాస్తవ‌మే కానీ, ఐఏఎస్ భార్య ఉన్నారంటూ జ‌రిగిన ప్రచారాన్ని ఖండించారు.  దీంతో ఈ వ్యవ‌హారంపై సీఐడీ పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. ఇందులో భాగంగా వాట్సాప్ గ్రూప్ లో వార్తను ప్రచారం చేసిన జ‌ర్నలిస్ట్  అంక‌బాబును అరెస్ట్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. విజ‌య‌వాడకు చెందిన అంక‌బాబు వివిధ ప‌త్రిక‌లు,ఛాన‌ళ్ళలో ప‌నిచేశారు. గుంటూరు సీఐడీ అధికారులు రాత్రికి రాత్రి అంక‌బాబును విజ‌య‌వాడ‌లో అరెస్ట్ చేసి గుంటూరుకు తీసుకు వెళ్లటం అక్కడ విచార‌ణ చేపట్టిన అనంత‌రం కేసును న‌మోదు చేసి, కోర్టులో హాజ‌రు ప‌రిచారు.

సీఐడీపై చంద్రబాబు ఆగ్రహం 

సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. వాట్స్ యాప్ లో ఒక వార్తను ఫార్వర్డ్ చేసిన కారణంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అక్రమ కేసులు, అరెస్ట్ లతో సీఐడీ చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతుందని చంద్రబాబు అన్నారు. 73 ఏళ్ల వయసున్న ఒక జర్నలిస్ట్ ను అరెస్ట్ చెయ్యడం జగన్ ఫాసిస్ట్ మనస్తత్వాన్ని చాటుతుందని చంద్రబాబు అన్నారు. విజయవాడ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుబడిన విషయం వాస్తవం కాదా? ఆ వార్తను ఫార్వర్డ్ చేస్తే తప్పు ఏంటి అని చంద్రబాబు ప్రశ్నించారు. వెంటనే అంకబాబును విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఈ వ్యవ‌హారంపై జోక్యం చేసుకోవాల‌ని చంద్రబాబు డీజీపీకి లేఖ కూడా రాశారు.

అంకబాబుకు బెయిల్ మంజూరు 

గన్నవరం విమానాశ్రయంలో బంగారం పట్టివేతపై సామాజిక మాధ్యమాల్లో పోస్టు ఫార్వర్డ్‌  చేశారని ఆరోపిస్తూ సీఐడీ పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేసిన 73 ఏళ్ల సీనియర్‌ జర్నలిస్టు కొల్లు అంకబాబుకు కోర్టు బెయిల్‌ మంజూరైంది. శుక్రవారం ఆయన్ను సీఐడీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అంకబాబును రిమాండ్‌కు తరలించాలని సీఐడీ తరఫు న్యాయవాదులు కోర్టును కోరగా  సీఐడీ రిమాండ్‌ నివేదికను కొట్టివేసిన న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. 

Published at : 23 Sep 2022 12:48 PM (IST) Tags: AP CID Gold Smuggling Gannavaram News Whats app forward journalist ankababu

సంబంధిత కథనాలు

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

Vizag News: తల్లికి నవ్వుతూ బై చెప్పి గదిలోకెళ్లిన కొడుకు, నిమిషాల్లోనే ఊహించని ఘటన

Vizag News: తల్లికి నవ్వుతూ బై చెప్పి గదిలోకెళ్లిన కొడుకు, నిమిషాల్లోనే ఊహించని ఘటన

చైనా, పాకిస్థాన్ నుంచి నడిపిస్తున్న వ్యాపారం- లోన్‌ యాప్‌ కేసుల్లో కొత్త కోణం

చైనా, పాకిస్థాన్ నుంచి నడిపిస్తున్న వ్యాపారం- లోన్‌ యాప్‌ కేసుల్లో కొత్త కోణం

పుట్టిన రోజునాడు ప్రాణం తీసిన ఈత సరదా, ముగ్గురు విద్యార్థులు మృతి

పుట్టిన రోజునాడు ప్రాణం తీసిన ఈత సరదా, ముగ్గురు విద్యార్థులు మృతి

Nandyal News: వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లి విద్యార్థి మృతి, కాలుజారడం వల్లే!

Nandyal News: వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లి విద్యార్థి మృతి, కాలుజారడం వల్లే!

టాప్ స్టోరీస్

RRR JAPAN : తారక్, చరణ్ తో కలిసి జపాన్ కు వెళ్తున్న రాజమౌళి | ABP Desam

RRR JAPAN : తారక్, చరణ్ తో కలిసి జపాన్ కు వెళ్తున్న రాజమౌళి | ABP Desam

Prabhas in Mogalturu : పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ | DNN | ABP Desam

Prabhas in Mogalturu : పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ | DNN | ABP Desam

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు

Lottery : లక్కీ బర్త్ డే, పుట్టిన రోజు డేట్‌తో 200 లాటరీ టికెట్లు కొన్నాడు, ఏకంగా జాక్‌పాట్ కొట్టేశాడు!

Lottery : లక్కీ బర్త్ డే, పుట్టిన రోజు డేట్‌తో 200 లాటరీ టికెట్లు కొన్నాడు, ఏకంగా జాక్‌పాట్ కొట్టేశాడు!