News
News
X

Fire Accident: బైక్ షోరూంలో అగ్ని ప్రమాదం, 36 ద్విచక్ర వాహనాలు దగ్ధం

Fire Accident: పాలకొండలోని ఓ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూములో అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు రూ. 50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని  షోరూం యజమాని తెలిపారు. 

FOLLOW US: 
 
Fire Accident: ఎలక్ట్రిక్ వెహికల్ షోరూములో అగ్ని ప్రమాదాలు నిత్య కృత్యం అవుతున్నాయి. ఏదో ఒక చోట ఈవీ షోరూముల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో లక్షల కొద్దీ రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తోంది. వివిధ కారణా వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా.. ఎలక్ట్రిక్ వెహికల్ షోరూముల్లో అగ్ని ప్రమాద ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయాయి. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలోని ఓ బైక్ షోరూములో మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. విద్యుత్ వాహనాలు(ఎలక్ట్రిక్ వెహికల్స్) విక్రయించే షోరూములో ఈ ప్రమాదం జరిగింది. 

ఈ ప్రమాదంలో దాదాపు 36 వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. పూర్తిగా కాలి పోయి బూడిద అయ్యాయి. టైర్లు, సీట్లు, ఫైబర్, ఇతర ప్లాస్టిక్ తో తయారు చేసినవి మొత్తం కాలిపోయాయి. కేవలం ఐరన్ తో చేసిన ఫ్రేములు మాత్రమే మిగిలాయి. మంటలతో వచ్చిన పొగలు చూసిన స్థానికులు, వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. చుట్టు పక్కల వారు ఇచ్చిన సమాచారంతో అగ్ని ప్రమాదం జరిగిన షోరూముకు చేరుకును అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఈ ప్రమాదంలో షోరూములో ఉన్న మొత్తం 25 వాహనాలు కాలి బూడిద అయినట్లు అధికారులు తెలిపారు. బ్యాటరీలు కూడా మంటలకు కాలిపోయాయని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు ఎగిసి పడి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణం పూర్తి స్థాయి విచారణలో తెలుస్తుందని వెల్లడించారు. సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు షోరూము యజమానులు తెలిపారు. 

షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు!

దీపావళి దమాకా స్ఫెషల్ ఆఫర్ నిర్వహించినట్లు షోరూమ్ యజమాని రమేష్ బాబు తెలిపారు. ఈ దీపావళికి ద్విచక్ర వాహనాలు ఎక్కువగా అమ్మకాలు జరుగతాయని భావించి వాహనాలను ఎక్కువగా షోరూమ్ కు తెప్పించామని యజమాని చెబుతున్నారు. అయితే అర్దరాత్రి ఒంటి గంట సమయంలో షార్ట్ షర్క్యూట్ తో మంటలు చెలరేగినట్లు యజమాని చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే లోపే వాహనాలు పూర్తిగా మంటలలో దగ్దం అయ్యాయి. 25 కొత్త ఎలక్ట్రికల్ వాహనాలతో పాటు సర్వీసింగ్ కు వచ్చిన వాహనాలతో కలసి 36 వాహనాలు పూర్తిగా మంటలలో కాలిపోయాయి. షోరూమ్ లో ఉన్న వాహనాలతో పాటు షోరూమ్ లో ఉన్న ఇంటీరియల్ మొత్తం కాలి బూడిద అయింది. సుమారు 50 లక్షల రూపాయిలు వరకూ ఆస్థి నష్టం వాటిల్లిందని షోరూమ్ యజమాని రమేష్ తెలిపారు. 

News Reels

గతనెల సికింద్రాబాద్ లోని షోరూంలో ప్రమాదం

గత నెల సికింద్రాబాద్ లోని ఓ ఎలక్ట్రిక్ బైక్ షోరూములో అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణంలోని బైకులకు మొదట మంటలు వ్యాపించాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కావడంతో మంటలు బ్యాటరీకి అంటుకుని అవి కూడా పూర్తిగా కాలిపోయాయి. అనంతరం మంటలు షోరూం పైన ఉన్న లాడ్జికి వ్యాపించాయి. దీంతో లాడ్జీలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. లాడ్జీలో ఉన్న వారికి ఊపిరాడక కిటికీల నుండి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు చనిపోయారు.

Published at : 24 Oct 2022 02:49 PM (IST) Tags: AP News AP Crime news Fire Accident Parvathipuram Manyam Fire Accident in Bikes Show Room

సంబంధిత కథనాలు

Nuzvid Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళలు దాడి, భారీగా పోలీసుల మోహరింపు!

Nuzvid Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళలు దాడి, భారీగా పోలీసుల మోహరింపు!

Ludo Game Woman Bets Self : లూడో గేమ్ లో తనను తాను పందెంగా కాసిన మహిళ, ఓడిపోయి ఓనర్ కు వశమైంది!

Ludo Game Woman Bets Self : లూడో గేమ్ లో తనను తాను పందెంగా కాసిన మహిళ, ఓడిపోయి ఓనర్ కు వశమైంది!

Men Suicide Cases: పెళ్లి కావడం లేదని యువకుల ఆత్మహత్యలు! తెలుగు రాష్ట్రాల్లోనే సూసైడ్‌లు ఎక్కువ, కానీ ఎందుకిలా?

Men Suicide Cases: పెళ్లి కావడం లేదని యువకుల ఆత్మహత్యలు! తెలుగు రాష్ట్రాల్లోనే సూసైడ్‌లు ఎక్కువ, కానీ ఎందుకిలా?

Kamareddy News: కామారెడ్డి జిల్లాలో దారుణం - సెల్ టవర్ ఎక్కి మరీ రైతు ఆత్మహత్య

Kamareddy News: కామారెడ్డి జిల్లాలో దారుణం - సెల్ టవర్ ఎక్కి మరీ రైతు ఆత్మహత్య

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

టాప్ స్టోరీస్

10 రోజులు టైమ్ ఇస్తున్నా, దమ్ముంటే అవినీతి నిరూపించు: బండి సంజయ్‌కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

10 రోజులు టైమ్ ఇస్తున్నా, దమ్ముంటే అవినీతి నిరూపించు: బండి సంజయ్‌కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం  - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?