అన్వేషించండి

Fertility Scam Case: వేరే వ్యక్తి వీర్యంతో ఐవీఎఫ్​.. ఫెర్టిలిటీ సెంటర్​ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత అరెస్ట్​

భర్తకి బదులు వేరే వ్యక్తి వీర్యంతో ఐవీఎఫ్​ చేసిన సికింద్రాబాద్ ​లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను పోలీసులు అరెస్ట్​ చేశారు

సికింద్రాబాద్: భర్త వీర్యానికి బదులు వేరే వ్యక్తి వీర్యంతో ఐవీఎఫ్​ చేసిన సికింద్రాబాద్ రెజిమెంటల్​బజార్​లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను పోలీసులు అరెస్ట్​ చేశారు. అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్నట్టు దర్యాప్తులో తేల్చారు. ఐవీఎఫ్​ ద్వారా పుట్టిన బిడ్డకు డీఎన్ఏ పరీక్షలు చేయించడంతో తమ బిడ్డ కాదని తేలగా రాజస్థాన్​కు చెందిన భార్యాభర్తలు శనివారం పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఇండియన్ స్పెర్టెక్ సంస్థ రీజినల్ మేనేజర్ అరెస్ట్​..
దంపతుల ఫిర్యాదు మేరకు ఐవీఎఫ్​ సెంటర్​పై కేసు నమోదు చేసిన పోలీసులు.. వైద్యాధికారులతో కలిసి శనివారం అర్ధరాత్రి 2 గంటల వరకు సిబ్బందిని ప్రశ్నించారు. వైద్యాధికారులు పలు కీలక డాక్యుమెంట్స్​తోపాటు వీర్య కణాల శాంపిల్స్ తీసుకెళ్లారు. అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్నారని.. వీర్యకణాలు, అండాలను గుజరాత్, మధ్యప్రదేశ్ తరలిస్తున్నట్టు గుర్తించారు. అనుమతులు లేకుండానే రెజిమెంటల్ బజార్​లో ఇండియన్ స్పెర్టెక్ సంస్థను నిర్వహిస్తున్నట్టు విచారణలో తేల్చారు. దీంతో ఆ సంస్థ రీజినల్ మేనేజర్ పంకజ్ సోనీని నిందితుడిగా చేర్చారు. పంకజ్​తోపాటు సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరో అనే వ్యక్తులను అరెస్టు చేశారు.

రూ.30 లక్షలతో ఐవీఎఫ్​
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్​కు చెందిన దంపతులు నాలుగేళ్లుగా సికింద్రాబాద్​లో ఉంటున్నారు. వివాహం జరిగి ఏడేళ్లు వుతున్నా సంతానం లేకపోవడంతో మూడేళ్ల క్రితం సికింద్రాబాద్ రెజిమెంటల్​ బజార్​లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారు. సరోగసీ ద్వారా పిల్లలకు అవకాశం ఉందని నిర్వాహకురాలైన డాక్టర్ నమ్రత వారికి తెలియజేశారు. ఈ ప్రక్రియ మొత్తానికి రూ.30 లక్షలు అవుతుందని చెప్పడంతో ఆ దంపతులు అంగీకరించారు. గతేడాది ఆగస్టులో మొత్తం డబ్బు కూడా చెల్లించారు.

డీఎన్ఏ టెస్ట్​ చేయించడంతో విషయం వెలుగులోకి..
అయితే ఈ ప్రక్రియపై పూర్తి నమ్మకం లేని సదరు దంపుతులు బిడ్డ జన్మించిన తర్వాత తమతో పాటు సరోగసీకి అంగీకరించిన మహిళ డీఎన్ఏ నమూనాలు సేకరించి.. పోల్చాలని షరతు విధించారు. ఈ ఏడాది బిడ్డ జన్మించింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం డీఎన్ఏ పరీక్షలు చేయించాలని డాక్టర్​ నమ్రతను కోరారు. అయితే ఆమె తరచూ వాయిదాలు వేస్తూ వస్తున్నారు. అనుమానం వచ్చిన దంపతులు బాలుడికి దిల్లీలో డీఎన్ఏ పరీక్షలు చేయించారు. కానీ తల్లిదండ్రుల డీఎన్ఏతో బిడ్డ డీఎన్ఏ సరిపోలేదు. 

తప్పును అంగీకరించిన డాక్టర్​ నమ్రత
ఈ జూన్ రెండోవారంలో డాక్టర్​ నమ్రతను దంపతులు మళ్లీ సంప్రదించారు. బిడ్డ తమకు జన్మించలేదని.. బాలుడి తల్లిదండ్రులకు ఇవ్వాలని ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో తప్పును అంగీకరించిన డాక్టర్​.. సమస్యను పరిష్కరించేందుకు టైమ్​ ఇవ్వాలని అడిగారు. కానీ తర్వాత నుంచి వారికి అందుబాటులో లేకుండా పోయారు. మోసపోయామని భావించి దంపతులు గోపాలపురం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. శనివారం యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్​లో తనిఖీలు చేసి నమ్రతతోపాటు మరికొందరిని అరెస్ట్​ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
HYD Lover Death: ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
Year Ender 2025: 2025 సంవత్సరంలో 161 సార్లు రాశిని మార్చిన చంద్రుడు, డిసెంబర్ 31న చివరి గోచారం!
2025 సంవత్సరంలో 161 సార్లు రాశిని మార్చిన చంద్రుడు, డిసెంబర్ 31న చివరి గోచారం!
Hair Fall Remedies : జుట్టు ఎక్కువగా రాలుతోందా? చలికాలంలో ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి, హెయిర్ బాగా పెరుగుతుంది
జుట్టు ఎక్కువగా రాలుతోందా? చలికాలంలో ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి, హెయిర్ బాగా పెరుగుతుంది

వీడియోలు

North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
India vs South Africa T20 Records | మొదటి టీ20లో ఐదు పెద్ద రికార్డులు బ్రేక్‌!
Hardik Record Sixes Against South Africa | హార్దిక్ పాండ్యా సిక్సర్‌ల రికార్డు
Sanju Samson Snubbed For Jitesh Sharma | ఓపెనింగ్ పెయిర్ విషయంలో గంభీర్‌పై విమర్శలు
Shubman Gill Continuous Failures | వరుసగా విఫలమవుతున్న శుబ్మన్ గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
HYD Lover Death: ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
Year Ender 2025: 2025 సంవత్సరంలో 161 సార్లు రాశిని మార్చిన చంద్రుడు, డిసెంబర్ 31న చివరి గోచారం!
2025 సంవత్సరంలో 161 సార్లు రాశిని మార్చిన చంద్రుడు, డిసెంబర్ 31న చివరి గోచారం!
Hair Fall Remedies : జుట్టు ఎక్కువగా రాలుతోందా? చలికాలంలో ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి, హెయిర్ బాగా పెరుగుతుంది
జుట్టు ఎక్కువగా రాలుతోందా? చలికాలంలో ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి, హెయిర్ బాగా పెరుగుతుంది
Aadhaar card Update: ఇంటి వద్దే డాక్యుమెంట్స్‌ అవసరం లేకుండా ఆధార్‌లో ఈ అప్‌డేట్స్‌ చేసుకోవచ్చు!
ఇంటి వద్దే డాక్యుమెంట్స్‌ అవసరం లేకుండా ఆధార్‌లో ఈ అప్‌డేట్స్‌ చేసుకోవచ్చు!
EPFO Update: మీ PF ఖాతాలో వడ్డీ డబ్బులు జమ అయ్యాయా? ఇంట్లో కూర్చుని ఇలా చెక్ చేసుకోండి!
మీ PF ఖాతాలో వడ్డీ డబ్బులు జమ అయ్యాయా? ఇంట్లో కూర్చుని ఇలా చెక్ చేసుకోండి!
IND Vs SA T20: నేటి రెండో టీ20 మ్యాచ్‌లో గిల్ విజృంభిస్తాడా? సంజూకు అవకాశం ఉంటుందా?
నేటి రెండో టీ20 మ్యాచ్‌లో గిల్ విజృంభిస్తాడా? సంజూకు అవకాశం ఉంటుందా?
Insomnia Astrology Telugu: రెగ్యులర్ గా నిద్రపట్టడం లేదంటే జాతకంలో ఎలాంటి దోషం ఉన్నట్టు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కారణాలు & పరిష్కారాలు!
రెగ్యులర్ గా నిద్రపట్టడం లేదంటే జాతకంలో ఎలాంటి దోషం ఉన్నట్టు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కారణాలు & పరిష్కారాలు!
Embed widget