Crime News: ఈ గోపాల్ దృశ్యం సినిమాలో హీరో - కూతుర్ని వేధిస్తున్న వ్యక్తిని చంపేశాడు - శవం కూడా దొరకనీయలేదు !
Narayana Khed: కూతుర్ని వేధిస్తున్నాడని ఓ వ్యక్తిని తండ్రి చంపేసిన ఘటన నారాయణ ఖేడ్‌లో జరిగింది. ఆ వ్యక్తి మృతదేహాన్ని కూడా కనిపించనీయలేదు.

Narayana Khed Crime News: తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడ్నిచంపేస్తాడు తండ్రి. ఆ యువకుడి శవం కూడా కనిపించనీయడు. అతనిపై పోలీసులకు అనుమానం ఉన్నా సరే ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆ యువకుడు హత్యకు గురయ్యాడన్నదానికి కూడా ఆధారాలు ఉండవు. అచ్చంగా ఇలాగే కాకపోయినా చిన్న మార్పుతో ఇదే ప్లాన్ అమలు చేశాడో తండ్రి.
నారాయణఖేడ్ జిల్లాలోని మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న బాలిక ను దశరథ్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అతనికి పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్నారు. ఆ బాలిక తనను దశరథ్ వేధిస్తున్నాడని తండ్రికి చెప్పింది.. ఒకటికి రెండు సార్లు.. దశరథ్ ను తండ్రి హెచ్చరించాడు. తన కుమార్తె జోలికి రావొద్దని చెప్పాడు. అయితే దశరథ్ మాత్రం.. తన వేధింపులు ఆపలేరు. తన కుమార్తె ఇక భయపడకుండా ఉండాలంటే.. దశరథ్ ను పైకి పంపడమే మార్గం అని బాలిక తండ్రి గోపాల్ నిర్ణయించుకున్నాడు. అనుకున్న ప్రకారం స్కెచ్ వేశాడు.
ఓ రోజు దశరథ్ కు మంచి మాటలు చెప్పిన గోపాల్.. తనో పాటు నిజాంపేట మండల శివారు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ దశరథ్ ను సైలెంట్ గా చంపేశాడు. అడవి లోపలకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అయితే తన కుమార్తె కోసం.. చేసిన హత్య విషయంలో సైలెంట్ గా ఉండలేకపోయాడు. దృశ్యం సినిమా హీరోలాగా ఓ వ్యక్తిని చంపిన వేదన మనసులో ఉండటం.. ఎప్పటికైనా దొరికిపోతానన్న భయంతో ఆయన నారాయణ ఖేడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి .. పోలీసులకు జరిగినదంతా చెప్పారు.
Also Read: Viral News: బాయ్‌ఫ్రెండ్ అలా చేశాడని డయల్ 100కు కాల్ చేసిన యువతి, సీరియస్‌గా తీసుకున్న పోలీసులు!
అప్పటికే పోలీసులకు దశరథ్ అదృశ్యంపై ఫిర్యాదు వచ్చింది. అతని కుటుంబసభ్యులు దశరథ్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గోపాల్ ను తీసుకుని తీసుకుని అటవీ ప్రాంతానికి వెళ్లారు. కానీ ఎక్కడ తగులబెట్టాడో గోపాల్ కూడా మర్చిపోయాడు. పోలీసులు దశరథ్ హత్యకు గురైన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పారు. దాంతో వారు బోరున రోదించారు. దశరథ్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కనీసం మృతదేహం అయినా చూపించాలని వారు పోీలసుల్ని వేడుకున్నారు.
గోపాల్ .. దశరథ్ ను చంపి ఎక్కడ కాల్చాడో కనుక్కుని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు. తన కుమార్తెను వేధిస్తున్నందుకే చంపానని గోపాల్ చెబుతున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతనిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.
Also Read: "పైలట్ రామ్"- 'యశస్' యుద్ధ విమానం నడిపిన కేంద్రమంత్రి





















