అన్వేషించండి

Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది

కర్ణాటకలోని బంట్లా బస్ స్టాండ్‌లో లావణ్య అనే యువతిపై ఆమె దూరపు బంధువు చేతన్ కొడవలితో దాడి చేసి దారుణంగా నరికి చంపాడు. ఏకపక్ష ప్రేమే ఈ దారుణానికి కారణమని పోలీసులు తెలిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కర్ణాటకలో పట్టపగలే యువతి లావణ్య దారుణ హత్య.
  • దూరపు బంధువైన చేతన్ ప్రేమ పేరుతో వేధించాడు.
  • బస్టాండ్ వద్ద కొడవలితో దాడి చేసి పారిపోయాడు.
  • పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

బెంగళూరు: పట్టపగలే అందరూ చూస్తుండగా కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో యువతి దారుణ హత్య కలకలం రేపింది. బాంట్లా తాలూకా బి.సి. రోడ్డు కేఎస్‌ఆర్‌టీసీ బస్ స్టాండ్‌లో గురువారం సాయంత్రం ఓ యువకుడు కొడవలితో విచక్షణారహితంగా దాడి చేసి యువతిని హత్య చేశాడు.  

ప్రేమ పేరుతో వేధించి, ప్రాణాలు తీశాడు
కల్లాడ్కలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో లావణ్య (21) అనే యువతి పనిచేస్తోంది. ఎప్పలిలాగే డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరుగుప్రయాణమైన సమయంలో బస్టాండ్ కు చేరుకున్న యువతిపై  నిందితుడు చేతన్ కొడవలితో విచక్షణారహితంగా దాడి చేసి నరికి చంపాడు. మృతురాలు కక్కెపడవు గ్రామానికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు.

యువతికి దూరపు బంధువే నిందితుడు

నిందితుడిని బెల్తంగడి తాలూకా ఓడిల్నాలకు చెందిన చేతన్ (22)గా పోలీసులు గుర్తించారు. అతడు మృతురాలికి దూరపు బంధువు కాగా, ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్నాడు. కొంతకాలం నుంచి అతడి వేధింపులు పెరిగిపోయాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం లావణ్య కక్కెపడవు వెళ్లే బస్సు ఎక్కగా, నిందితుడు కూడా ఆమెను ఫాలో అయ్యాడు. తర్వాత ఆమె బస్సు దిగగానే, వెంట తెచ్చుకున్న కొడవలితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆయుధాన్ని అక్కడే పడేసి నిందితుడు చేతన్ పారిపోయాడు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

స్థానికులు వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడిన లావణ్యను బాంట్లా తాలూకా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. సమాచారం అందుకున్న దక్షిణ కన్నడ ఎస్పీ కె. అరుణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడు చేతన్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై బాంట్లా టౌన్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Frequently Asked Questions

కర్ణాటకలో జరిగిన దారుణం ఏమిటి?

దక్షిణ కన్నడ జిల్లాలో పట్టపగలే 21 ఏళ్ల యువతి లావణ్యను బస్టాండ్‌లో ఓ యువకుడు కొడవలితో దాడి చేసి హత్య చేశాడు. ప్రేమ పేరుతో వేధించి, ఈ దారుణానికి పాల్పడ్డాడు.

హత్యకు గురైన యువతి ఎవరు, ఘటన ఎక్కడ జరిగింది?

మృతురాలు 21 ఏళ్ల లావణ్య. ఆమె కల్లాడ్కలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసేది. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లాలోని బి.సి. రోడ్డు కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్‌లో జరిగింది.

నిందితుడు ఎవరు, అతనికి యువతికి ఉన్న సంబంధం ఏమిటి?

నిందితుడు 22 ఏళ్ల చేతన్. ఇతను మృతురాలికి దూరపు బంధువు. గతంలో వారి బంధం ముగిసినా, ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు.

ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

దక్షిణ కన్నడ ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడు చేతన్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. బాంట్లా టౌన్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Wife Kills Husband: భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget