Ganza Siezed: ట్రావెల్స్ బస్సుల్లో గంజాయి తరలింపు - 30 కిలోలు స్వాధీనం, 10 మంది అరెస్ట్
Hyderabad News: ఏజెన్సీ ప్రాంతాల నుంచి ట్రావెల్స్ బస్సుల్లో గంజాయి తరలిస్తోన్న 10 మంది నిందితులను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద 30 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
Ganza Siezed in Travels Buses: ట్రావెల్స్ బస్సుల్లో గంజాయి తరలిస్తోన్న 10 మంది నిందితులను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి (RangaReddy) జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ (Abdullapurmet) వద్ద అధికారులు తనిఖీలు చేపట్టారు. 6 బస్సుల్లో అక్రమంగా తరలిస్తోన్న 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. పాడేరు, నర్సీపట్నం, విశాఖ నుంచి గంజాయిని హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
చాక్లెట్లలో మత్తు పదార్థాలు.?
మరోవైపు, ఇదే రంగారెడ్డి జిల్లాలో చాక్లెట్లు తిన్న విద్యార్థులు వింతగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. ముందుగా ఫ్రీగా ఇచ్చిన దుకాణందారులు తర్వాత ధర పెంచుతూ వెళ్లారు. వీటిని తిని క్లాస్‌లకు వచ్చిన విద్యార్థులు చాలా విచిత్రంగా ప్రవరిస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సంచలనం సృష్టించే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో విద్యార్థులు వితంగా ప్రవర్తిస్తుండటంతో ఉపాధ్యాయులు కంగారు పడ్డారు. ముందుగా ఒకరిద్దరు చిన్నారులు వింతగా ప్రవర్తించగా.. ఆ తర్వాత ఆ సంఖ్య పెరుగుతూ రావడంతో అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆరా తీయగా, స్కూల్ కు సమీపంలోని ఓ దుకాణంలో చాక్లెట్లే దీనికి కారణమని గుర్తించారు. విద్యార్థులను నిలదీయడంతో వారు అసలు విషయం చెప్పారు. పదే పదే ఆ చాక్లెట్లు తినాలనిపిస్తోందని చెప్పడంతో ఉపాధ్యాయులు కంగు తిన్నారు. ఏదో జరుగుతుందని గ్రహించిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మున్సిపల్ అధికారులకు పోలీసులకు సమాచారం అందించారు.
తొలుత ఫ్రీ
సదరు దుకాణదారులు మొదట్లో చాక్లెట్లను ఫ్రీగా ఇచ్చి విద్యార్థులకు అలవాటు చేశారు. ఆ తర్వాత వాటికి ధర ఫిక్స్ చేశారు. అనంతరం మరికొద్ది రోజులకు ఆ ధర పెంచుతూ పోయారు. ఇలా ప్రస్తుతం ఒక్కో చాక్లెట్ ధర రూ.20కు అమ్ముతున్నారు. ఇది తెలుసుకున్న ఉపాధ్యాయులు షాక్ తిని.. పాన్ షాపులపై దాడులు చేశారు. ఆ చాక్లెట్లలో మత్తు పదార్థాలు కలిపారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాటిని తిన్న తర్వాతనే విద్యార్థులు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పోలీసులు డబ్బాలను తనిఖీ చేసి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీక్షలకు పంపామని.. నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయని చెబుతున్నారు.
Also Read: Congress MLA: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాచ్ ఖరీదు రూ.3 కోట్లా? వైరల్ అవుతన్న వీడియో