అన్వేషించండి

Crime News : రంగారెడ్డి జిల్లాలో దారుణం - ఇంజినీరింగ్ స్టూడెంట్ పై డ్రైవర్ అఘాయిత్యం

Crime News : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఓ ప్రైవేట్ హాస్టల్ యజమాని డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Crime News : దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న దారుణాలకు అడ్డే లేకుండా పోయింది. మహిళలు ఒంటరిగా ఎక్కడ కనిపించినా కామాంధులు కాటేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. తాజాగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ స్టూడెంట్ పై ఓ ప్రైవేట్ హాస్టల్ యజమాని డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అందిన సమాచారం ప్రకారం, 18ఏళ్ల విద్యార్థిని మంగళ పల్లి గేటు వద్ద ఉన్న ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ.. ఇబ్రహీంపట్నంలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ తరుణంలోనే జనవరి 16, 2025 తెల్లవారుజామున విద్యార్థినిపై డ్రైవర్ అఘాయిత్యం చేశాడు. అనంతరం ఆ యువతి పోలీసులను ఆశ్రయించి, ఘటనపై ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన ఇబ్రహీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దళిత బాలికపై అఘాయిత్యం

ఇటీవలే కేరళలోని పతనం తిట్టలో ఒక దళిత బాలికను దాదాపు 60 మంది పైగా దుండగులు అఘాయిత్యాలకు పాల్పడ్డారు. నిందితులంతా సమీప బంధువులు, తండ్రి స్నేహితులు, ఆమె సహచరులే కావడంతో ఆమె మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఇలాంటి నిస్సాయక మహిళల కోసం స్వయం సహాయక సంఘాల వేదిక (కుడుంబశ్రీ) నిర్వహించే ‘స్నేహిత’ కౌన్సిలింగ్‌ ద్వారా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసును రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతోంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం డీఐజీ నేతృత్వంలో 25 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం ఆ బాలిక ‘స్నేహిత’ కౌన్సిలింగ్‌లో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను వెల్లడించింది. 13ఏళ్ల వయసు నుంచి తాను ఈ వేధింపులు ఎదుర్కొంటున్నానని, 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు బైక్‌పై తీసుకెళ్లి ఇంటికి సమీపంలోని అచ్చంకోటుమల సమీపంలోని రబ్బరు తోటలో మొదట సహవిద్యార్థి సుబిన్‌, అతని మిత్రులు అత్యాచారం చేశారని తెలిపింది. ఈ దారుణం గురించి తెలిసిన ఆమె తండ్రి స్నేహితులు కూడా బాలికను బెదిరింపులకు గురి చేసి పలు ప్రాంతాలకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడడం మరింత ఆందోళన కలిగించే విషయం.

హైకోర్టు కీలక తీర్పు

మహిళలను అనుచిత వ్యాఖ్యలతోనే కాదు వారి శరీరాకృతిపై కామెంట్స్ చేసినా లైంగిక వేధింపుల కిందకే వస్తుందంటూ కేరళ హైకోర్టు ఇటీవలే తేల్చి చెప్పింది. ఇది వారి గౌరవానికి ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించడమేనని, ముఖ్యంగా మహిళల శరీరాకృతి, రంగుపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వాటిని లైంగిక వేధింపుల నేరంగానే పరిగణించాలని సూచించింది.  

Also Read : Kerala Athlete: కేరళలో అథ్లెట్‌పై లైంగిక వేధింపుల కేసు - 44 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget