అన్వేషించండి

Kishtwar Police: అడవిలో విగతజీవులుగా ఇద్దరు పోలీసు ఆఫీసర్లు.. సర్వీస్ రివాల్వర్లు మాయం.. ఉగ్రకోణంపై దర్యాప్తు!

Kishtwar Police: జమ్మూ కశ్మీర్ లో ఇద్దరు పోలీసుల మిస్సింగ్ కలకలం రేపింది. అడవిలో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారి సర్వీస్ తుపాకులు మాయం అయ్యాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కిష్త్వార్‌లో అదృశ్యమైన ఇద్దరు పోలీసుల మృతదేహాలు అటవీ ప్రాంతంలో లభ్యం.
  • బుల్లెట్ గాయాలతోపాటు వారి సర్వీసు తుపాకులు సంఘటన స్థలంలో కనిపించలేదు.
  • ఉగ్రవాదులే కాల్చిచంపి ఆయుధాలు ఎత్తుకెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
  • కుల్గామ్ దాడితో సంబంధంపై పోలీసులు ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Kishtwar Police: జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉండి, అదృశ్యమైన ఇద్దరు స్పెషల్ పోలీసు ఆఫీసర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం భద్రతా వర్గాల్లో కలకలం రేపింది. గురువారం ఉదయం అటవీ ప్రాంతంలో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల శరీరంపై బుల్లెట్ గాయాలు ఉండటం, వారి సర్వీసు తుపాకులు మాయమవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అసలేం జరిగింది?

స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ కు చెందిన బాబీ చాంద్ (57), రశ్‌పాల్ కుమార్ (45) బుధవారం మధ్యాహ్నం తమ క్యాంప్ నుంచి ధర్నా-మర్వా ప్రాంతంలోని ఆర్మీ పోస్ట్‌కు బయల్దేరారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మార్గమధ్యంలోని దచన్ అటవీ ప్రాంతం నుంచి అనుమానాస్పద శబ్దాలు వినిపించడంతో, తనిఖీ చేసేందుకు వీరిద్దరూ అడవిలోకి వెళ్లారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ సేవలు కూడా నిలిచిపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.

ముమ్మర గాలింపు.. మృతదేహాల లభ్యం

పోలీసు ఆఫీసర్లు అదృశ్యమైనట్లు నిర్ధారించుకున్న ఆర్మీ, భద్రతా బలగాలు దచన్ అటవీ ప్రాంతంలో రాత్రంతా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం అడవిలో బాబీ చాంద్, రశ్‌పాల్ కుమార్ విగతజీవులుగా పడి ఉండటాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు.

Also Read: కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు- ఆ ఏరియాను జల్లెడ పడుతున్న బలగాలు

ఉగ్రవాదుల పనేనా?

ఘటనాస్థలంలో మృతి చెందిన పోలీసుల వద్ద ఉండాల్సిన సర్వీసు తుపాకులు కనిపించకపోవడం గమనార్హం. ఉగ్రవాదులే వీరిని కిడ్నాప్ చేసి, కాల్చి చంపి ఆయుధాలను ఎత్తుకెళ్లి ఉండొచ్చని ఉన్నతాధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా భద్రతా బలగాలు దిగ్బంధించి, ఉగ్రవాదుల కోసం నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

కుల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉందా?

మరోవైపు, బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలోనే జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉన్న సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రదాడి జరిగింది. బైకులపై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు చెక్‌పోస్ట్ వద్ద ఉన్న జవాన్లపై కాల్పులు జరిపి పరారయ్యారు. దాదాపు ఒకే సమయంలో కుల్గామ్ దాడి, కిశ్త్‌వాడ్‌లో పోలీసుల మిస్సింగ్ హత్య జరగడంతో ఈ రెండు ఘటనల వెనుక ఒకే ఉగ్రముఠా హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు

Frequently Asked Questions

కిశ్త్‌వాడ్ జిల్లాలో ఏం జరిగింది?

కిశ్త్‌వాడ్ జిల్లాలో విధుల్లో ఉన్న ఇద్దరు స్పెషల్ పోలీసు ఆఫీసర్లు అదృశ్యమై, అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారి మృతదేహాలపై బుల్లెట్ గాయాలు, సర్వీసు తుపాకులు మాయమయ్యాయి.

మరణించిన పోలీసు అధికారులు ఎవరు?

మరణించిన వారు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ కు చెందిన బాబీ చాంద్ (57) మరియు రశ్‌పాల్ కుమార్ (45). వారు బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయారు.

వారి మృతికి గల కారణాలపై ఎలాంటి అనుమానాలున్నాయి?

ఉగ్రవాదులు వారిని కిడ్నాప్ చేసి, కాల్చి చంపి ఆయుధాలను ఎత్తుకెళ్లి ఉండొచ్చని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో వారి సర్వీసు తుపాకులు లభ్యం కాలేదు.

ఈ ఘటనకు ఇతర ఉగ్రదాడులతో సంబంధం ఉందా?

బుధవారం కుల్గామ్ జిల్లాలో జరిగిన సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడితో ఈ ఘటనకు సంబంధం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకే ఉగ్రముఠా హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Webland Records Tampering: వెబ్‌ల్యాండ్‌ రికార్డుల తారుమారు.. ఎన్‌ఐసీ లాగిన్ కొట్టేసి రూ.కోట్ల భూముల అక్రమార్జన.. నలుగురి అరెస్ట్!
వెబ్‌ల్యాండ్‌ రికార్డుల తారుమారు.. ఎన్‌ఐసీ లాగిన్ కొట్టేసి రూ.కోట్ల భూముల అక్రమార్జన.. నలుగురి అరెస్ట్!
Kolkata Sairang Express Derail: పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
Hyderabad Crime: వనస్థలిపురంలో విషాదం.. ప్రేమ నిరాకరించిందని, యువతి ఇంట్లోనే బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య!
వనస్థలిపురంలో విషాదం.. ప్రేమ నిరాకరించిందని, యువతి ఇంట్లోనే బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య!
ACB Raids: రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్సై
రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్సై
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonia Gandhi Autobiography: సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
Bharat Summit Congress vs BJP: భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
Jailer 2 OTT : ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
Anirudh Ravichander Kavya Maran Wedding : అనిరుధ్ కావ్యల పెళ్లిలో రజనీ కాంత్ డ్యాన్స్ - గ్రేస్ వేరే లెవల్... వీడియోస్ వైరల్
అనిరుధ్ కావ్యల పెళ్లిలో రజనీ కాంత్ డ్యాన్స్ - గ్రేస్ వేరే లెవల్... వీడియోస్ వైరల్
Parivarthana Rajaneethi Party Launch: పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
Pushpaka Vimanam Series OTT : ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget