అన్వేషించండి

Jammu Kashmir Encounter: జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు

Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు జరిగిన కాల్పుల్లో లష్కరే తయ్యిబా కమాండర్ యాసిర్ హతమయ్యాడు. ఆపరేషన్ అష్దర్‌లో భాగంగా భద్రతా బలగాల గాలింపులో ఉగ్రవాదిని మట్టుబెట్టారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జమ్మూకశ్మీర్‌లో లష్కరే ఉగ్రవాది యాసిర్‌ను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.
  • యాసిర్ కదలికలపై నిఘా ఉంచి, యూస్‌మార్గ్‌లో గుర్తించి కాల్పులు జరిపారు.
  • 2024 దాడులు, పహల్గాం ఉగ్రవాదులతో అతనికి సంబంధాలు గుర్తించారు.
  • ఇతర ఉగ్రవాదుల కోసం ‘ఆపరేషన్ అష్దర్’ కొనసాగుతోంది.

Jammu Kashmir Encounter: పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబా కమాండర్‌‌ యాసిర్ జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు శుక్రవారం మట్టుబెట్టాయి. కొంతకాలంగా ఉగ్రవాది యాసిర్‌ కదలికలపై నిఘా పెట్టిన భద్రతా బలగాలు యూస్‌మార్గ్ లో అతడిని గుర్తించి కాల్పులు జరిపాయి.  ఇరువర్గాల కాల్పుల్లో యాసిర్‌ హతమైనట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోలీసులు చేపట్టిన 'ఆపరేషన్ అష్దర్' కొనసాగుతోంది.  లష్కరే తయ్యిబాకు చెందిన యాసిర్ అనే పాకిస్తానీ ఉగ్రవాది హతమయ్యాడు.  
 
యూస్‌మార్గ్‌లోని పర్వత ప్రాంతాల్లో గాలింపులో భద్రతా బలగాలపై ఓ ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపగా.. ఉగ్రవాది హతమయ్యాడు. మరణించిన ఉగ్రవాదిని యాసిర్‌గా గుర్తించినట్లు శనివారం కశ్మీర్‌ పోలీసులు తెలిపారు. యాసిర్ గతంలో లష్కరే తయ్యిబాకు చెందిన ఓ ఉగ్రముఠాలో సభ్యుడిగా ఉన్నాడు. ఏడాది క్రితం ఆ బృందం నుండి బయటకు వచ్చి స్వతంత్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు లష్కరే ఉగ్రవాదులతో అతడికి సంబంధాలు ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఉగ్రవాదుల ఫొటోలో యాసిర్‌ ఫొటో కూడా ఉంది. దీంతో గత కొంత కాలంగా యాసిర్ కదలికలపై భద్రతా బలగాలు నిఘా పెట్టారు. 

Also Read: ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు.. ఏఏ పార్టీల ఎంపీలు ఉన్నారంటే?

2024 వరుస దాడులు

2024లో పూంఛ్‌ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్‌పై దాడి, అదే సంవత్సరం అక్టోబర్‌లో సోనామార్గ్ సమీపంలో కార్మికులపై దాడి, బోటా పత్రిలో ఆర్మీపై దాడి ఘటనల్లో యాసిర్ ప్రమేయం ఉందని భద్రతా బలగాలు గుర్తించాయి. పూంఛ్‌ నుంచి యూస్‌మార్గ్ మీదుగా పుల్వామాలోని పఖేర్‌పోరా వైపు ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఉగ్రవాదుల కోసం వారం రోజులుగా నిఘా పెట్టిన ఆర్మీ... గాలింపు చేపట్టింది. యాసిర్‌తో పాటు మరికొందరు ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి. 

Also Read: ఫ్యామిలీతో ట్రిప్​కు ప్లాన్ చేస్తున్నారా? తక్కువ బడ్జెట్​లో ఇండియాలో వెళ్లేందుకు బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే

జమ్మూ కశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగా ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. యాసిర్ ఎన్‌కౌంటర్ అనంతరం, భద్రతా దళాలు అతని సహచరులపై కూడా దర్యాప్తు చేస్తున్నాయి. యాసిర్ ఏవైనా ప్రధాన కార్యకలాపాలు లేదా కుట్రలలో పాలుపంచుకున్నాడా? అనే విషయంపై విచారణ జరుపుతున్నారు.

Also Read: నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన

Frequently Asked Questions

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాల చేతిలో హతమైన ఉగ్రవాది ఎవరు?

భద్రతా బలగాల కాల్పుల్లో లష్కరే తయ్యిబా కమాండర్ యాసిర్ హతమయ్యాడు. ఇతడు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ సభ్యుడు.

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జమ్మూకశ్మీర్‌లో చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి?

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోలీసులు చేపట్టిన ఆపరేషన్ పేరు 'ఆపరేషన్ అష్దర్'. దీనిలో భాగంగానే యాసిర్ హతమయ్యాడు.

యాసిర్ ఎక్కడ హతమయ్యాడు?

జమ్మూకశ్మీర్‌లోని యూస్‌మార్గ్ పర్వత ప్రాంతాల్లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో యాసిర్ హతమయ్యాడు. కొంతకాలంగా అతడి కదలికలపై నిఘా పెట్టారు.

యాసిర్ ఏ ఉగ్రవాద దాడులలో ప్రమేయం కలిగి ఉన్నాడు?

2024లో పూంఛ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్‌పై దాడి, సోనామార్గ్ సమీపంలో కార్మికులపై దాడి, బోటా పత్రిలో ఆర్మీపై దాడి ఘటనలలో యాసిర్ ప్రమేయం ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Railway Travel Insurance: 45 పైసలకే రూ.10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎలా సాధ్యం?.. రైల్వే, బీమా కంపెనీలకు నష్టం రాదా?
45 పైసలకే రూ.10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎలా సాధ్యం?.. రైల్వే, బీమా కంపెనీలకు నష్టం రాదా?
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
రాహుల్ గాంధీకి నవంబర్ 2026 కీలకం: జ్యోతిష్య అంచనాలు, రాజకీయ మలుపులు!
రాహుల్ గాంధీకి నవంబర్ 2026 కీలకం: జ్యోతిష్య అంచనాలు, రాజకీయ మలుపులు!
AIADMK MLAs Case: ఎమ్మెల్యేల రాజీనామాలు, పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం రాజకీయ ప్రక్రియే!
ఎమ్మెల్యేల రాజీనామాలు, పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం రాజకీయ ప్రక్రియే!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Embed widget