అన్వేషించండి

West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం

బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితుడు ప్రభాస్ మండల్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. క్రైమ్ సీన్ రీక్రియేషన్ సమయంలో వెపన్ లాక్కొని కాల్పులు జరపడంతో కాల్పులు జరిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పశ్చిమ బెంగాల్‌లో బాలిక హత్య, అత్యాచారం తీవ్ర కలకలం సృష్టించింది.
  • ప్రధాన నిందితుడు ప్రభాస్ మండల్ నేరస్థలానికి తీసుకెళ్లారు.
  • మండల్ తుపాకీ లాగి కాల్పులు జరపగా, పోలీసులు ఎదురు కాల్చారు.
  • ఎదురుకాల్పుల్లో తీవ్ర గాయాలై, ప్రభాస్ మండల్ మృతిచెందాడు.

Baruipur Rape Murder Case |  కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో సంచలనం రేపిన బాలిక హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు ప్రభాస్ మండల్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. బరుయిపూర్‌లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు ప్రభాస్ మండల్ ను క్రైమ్ సీన్ రీక్రియేషన్ (నేర స్థలాన్ని పరిశీలించే)కు తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితుడు పోలీసుల నుంచి వెపన్ లాక్కొని కాల్పులు జరపడంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మండల్ మరణించాడు.

జూలై 5న దక్షిణ 24 పరగణాల జిల్లా బరుయిపూర్‌లో ఒక చెరువులో ఈ బాలిక మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘోర ఘటనపై విచారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. జూలై 4 సాయంత్రం 6 గంటల సమయంలో నివాసం నుంచి కనిపించకుండా పోయిన బాలిక ఆ మరుసటి మరుసటి రోజు శవమై తేలింది.

బరుయిపూర్ ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పన్నెండేళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన ప్రభాస్ మండల్‌ను దర్యాప్తులో భాగంగా జూలై 7 అర్ధరాత్రి తర్వాత సుమారు 12:45 గంటలకు పోలీసులు సూర్యాపూర్‌లోని నేర స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ క్రైమ్ సీన్ రీక్రియేషన్ ప్రక్రియ ప్రారంభించడానికి ముందే, నిందితుడు ప్రభాస్ ఒక్కసారిగా ఒక పోలీసు అధికారి వద్ద ఉన్న తుపాకీని లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా పోలీసులపై ఒక రౌండ్ కాల్పులు జరిపి, వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.

Also Read: Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్

నిందితుడు జరిపిన కాల్పులకు వెంటనే స్పందించిన పోలీసులు కూడా ఆత్మరక్షణ కోసం నిందితుడిపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ప్రభాస్ మండల్‌ను పోలీసులు తక్షణమే బరుయిపూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడ్ని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతడు మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ కేసు దర్యాప్తుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేశారు.  బాధిత బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెపై అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులకు కొన్ని కీలక డిజిటల్ ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనను నిందితులు ముందస్తు ప్రణాళిక ప్రకారమే చేసినట్లు ఆధారాలు సూచిస్తున్నాయి. బరుయిపూర్ జిల్లా పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్లు జూలై 4వ తేదీ సాయంత్రం 4:30 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య ఒకే ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. నేరం జరిగినట్లు భావిస్తున్న టైంతో వీరు ఉన్న ఏరియా మ్యాచ్ అయింది.

Frequently Asked Questions

బరుయిపూర్ అత్యాచారం మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎవరు?

బరుయిపూర్‌లో 12 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రభాస్ మండల్. అతడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

ప్రభాస్ మండల్ ఎలా మరణించాడు?

క్రైమ్ సీన్ రీక్రియేషన్ సమయంలో నిందితుడు పోలీసుల నుండి ఆయుధాన్ని లాక్కొని కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ప్రభాస్ మండల్ మరణించాడు.

ఈ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం ఏమి ఏర్పాటు చేసింది?

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘోర ఘటనపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.

కేసులో ఏమైనా ముఖ్యమైన ఆధారాలు లభ్యమయ్యాయా?

సిట్ అధికారులకు కొన్ని కీలక డిజిటల్ ఆధారాలు లభ్యమయ్యాయి, ఇది ముందస్తు ప్రణాళికను సూచిస్తుంది. నిందితుల మొబైల్ టవర్ లొకేషన్లు కూడా నేరం జరిగిన సమయానికి సరిపోయాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
Parliament Monsoon Session 2026: పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget