Srikalahasti Temple Fire Accident: శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. ప్రసాదాల తయారీ కేంద్రంలో చెలరేగిన మంటలు
Srikalahasti Temple Fire Accident: శ్రీకాళహస్తి ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. వంటనూనె డబ్బాలకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగింది.

Srikalahasti Temple Fire Accident: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం భక్తుల్లో తీవ్ర కలకలం రేపింది. ఆలయ నాలుగో గోపురం సమీపంలో ఉన్న ప్రసాదాల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వంటగదిలో గ్యాస్ లీక్ కావడం, అక్కడే ఉన్న వంటనూనె డబ్బాలకు నిప్పు అంటుకోవడంతో అగ్నికీలలు వేగంగా ఎగసిపడ్డాయి. క్షణాల్లోనే దట్టమైన పొగ ఆలయ పరిసరాలను కమ్మేయడంతో దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.
అధికారుల అప్రమత్తతో తప్పిన ప్రాణ నష్టం
అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఆలయ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఆలయ సిబ్బంది వెంటనే అప్రమత్తమై, ప్రసాద తయారీ కేంద్రానికి సమీపంలో ఉన్న భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో ప్రసాదాల వంటగదిలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మంటలు అదుపులోకి రావడంతో ఆలయ అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై ఆలయ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు.
Also Read: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















