అన్వేషించండి

వాషింగ్ మెషిన్‌లో నోట్ల కట్టలు, రూ.2.5 కోట్లు చూసి ఈడీ అధికారులు షాక్

Money in Washing Machine: ఈడీ అధికారులు మంగళవారం నిర్వహించిన సోదాల్లో ఓ చోట వాషింగ్ మెషిన్‌లో రూ.2.5 కోట్ల నగదును లభ్యమైంది.

ED raid Capricornian shipping: ఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు  లాజిస్టిక్స్ కంపెనీలో సోదాలు నిర్వహించగా భారీగా నగదు పట్టుబడింది. ఈడీ అధికారులు లాజిస్టిక్స్ కంపెనీకి సంబంధించి ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కురుక్షేత్ర, కోల్‌కతా ప్రాంతాల్లో  మంగళవారం దాడులు నిర్వహించగా.. ఓ చోట వాషింగ్ మెషిన్‌లో నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ఏకంగా రూ.2.54 కోట్ల నగదు లభ్యం కావడంతో ఈడీ అధికారులు ఆశ్చర్యపోయారు.  లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. 47 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు ఈడీ రాసుకొచ్చింది.

వాషింగ్ మెషిన్‌లో నోట్ల కట్టలు, రూ.2.5 కోట్లు చూసి ఈడీ అధికారులు షాక్

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం లాజిస్టిక్స్ కంపెనీపై దాడులు నిర్వహించింది. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో సోదాలు చేయగా రూ. 2.54 కోట్లు గుర్తించినట్లు తెలిపింది. ఫేమా (FEMA) 1999 నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. కాప్రికార్నియన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామి, దాని అనుబంధ సంస్థలైన లక్ష్మీటన్ మారిటైమ్, హిందూస్తాన్ ఇంటర్నేషనల్, రాజ్ నందిని మెటల్స్ లిమిటెడ్, స్టేవార్ట్ అల్లాయ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ లిమిటెడ్, వినాయక్ స్టీల్స్ లిమిటెడ్, వశిష్ట కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల డైరెక్టర్లు, భాగస్వాములైన సందీప్ గార్గ్, వినోద్ కేడియా, మరికొందరి నివాసాలలో ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కురుక్షేత్ర, కోల్‌కతా నగరాలలో ఆకస్మిక సోదాలు చేపట్టింది ఈడీ. 

భారతదేశం నుంచి విదేశీ మారక ద్రవ్యాన్ని బదిలీ చేస్తున్నారని ఈడీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో  సింగపూర్‌లోని గెలాక్సీ షిప్పింగ్ & లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సింగపూర్‌లోని హారిజన్ షిప్పింగ్ & లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 1,800 కోట్ల చెల్లింపులు జరిగాయని ఈడీ గుర్తించింది. ఆంథోనీ డి సిల్వా అనే వ్యక్తికి దీనితో సంబంధాలు ఉన్నాయని అభియోగాలున్నాయి. షెల్ కంపెనీలు నేహా మెటల్స్, అమిత్ స్టీల్స ట్రేడర్స్, ట్రిపుల్ ఎం మెడల్, హెచ్ఎంఎస్ మెటల్స్ తదితర కంపెనీల పేరిట నగదు లావాదేవీలు జరగడంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఓ చోట కోట్ల రూపాయల నగదు ఇంట్లో వాషింగ్ మెషిన్ లో గుర్తించినట్లు పేర్కొన్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
US Iran War: ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
IND vs ENG 4th T20I: భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌లోకి నిస్సాన్ టెక్టాన్ ఎంట్రీ - 6 వేరియంట్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్లు & ప్రీమియం ఫీచర్లతో లాంచ్‌
కేవలం రూ.10.49 లక్షలకే కొత్త నిస్సాన్ టెక్టాన్ - క్రెటా, సెల్టోస్‌కు కొత్త సవాల్
Breaking News:నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
Lenin Live Updates: లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
Benefits Of Matcha Tea: గ్రీన్ టీ యుగం ముగిసింది! బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ మాచా టీ తాగుతున్న సెలబ్రిటీలు!
గ్రీన్ టీ యుగం ముగిసింది! బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ మాచా టీ తాగుతున్న సెలబ్రిటీలు!
Prashna Ravan: రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
Embed widget