అన్వేషించండి

Cockfight Kills 2 People: విషాదం నింపిన కోడిపందేలు, ఇద్దరి ప్రాణాలు తీసిన కోడికత్తి - పందెం రాయుళ్లు ఏం పూస్తున్నారు !

కోళ్ల కాళ్లకు కట్టే కత్తులు గుచ్చుకుని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు, కాకినాడ జిల్లాలో మరో వ్యక్తి కోడి కత్తి గుచ్చుకోవడంతో చనిపోయారు.

- ఇద్దరి ప్రాణాలు తీసిన కోడికత్తి.!  
- తూర్పులో విషాదం నింపిన కోడిపందేలు   
- పాదరసం వల్లనేనా ప్రాణాలు కోల్పోయారా..?

సాంప్రదాయం ముసుగులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో కోడి పందేలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి.. కోడిపందేలాడితే తాట తీస్తామని హెచ్చరించిన ఖాకీలు ఖద్దరు పైరవీలకు తలగొగ్గి పందేలకు గేట్లు ఎత్తారు. దీంతో కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో సందుగొందులో కోడిపందేల బరులు వందల సంఖ్యలో వెలిసిపోయి కాయ్‌ రాజా కాయ్‌ చందంగా హద్దులు మీరాయి.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోనూ పలు చోట్ల కోడిపందేలు జరుగుతున్నాయి. విచ్చలవిడిగా ఇచ్చిన అనుమతుల పందేరమే ఇద్దరు ప్రాణాలు బలిగొంది. కోళ్ల కాళ్లకు కట్టే కత్తులు గుచ్చుకుని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండల పరిధిలోని అనంతపల్లికి చెందిన పద్మరావు అనే యువకుడు కోడికత్తి తగిలి మృత్యువాత పడగా కాకినాడ జిల్లా పరిధిలోని జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో గండే ప్రకాష్‌(45) కోడికత్తి తగిలిన గాయంతో మృతిచెందాడు. పాదరసం పూసిన కత్తి గాయం కావడంతోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తూర్పు గోదావరి జిల్లా అనంతపల్లికి చెందిన పద్మారావు ఊళ్లో జరుగుతున్న కోడి పందాల దగ్గరకు వెళ్లాడు. ఈ క్రమంలో బరిలో కత్తులు కట్టిన కోళ్లు పొట్లాడుకుంటూ పద్మారావు వైపు దూసుకొచ్చాయి. ఈ తరుణంలో ఒక కోడికి కట్టిన కత్తి పద్మారావు కుడి కాలు మోకాలు వెనుక భాగంలో గుచ్చుకుంది. కత్తి మొకాలు మొత్తం భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో నరాలు తెగిపోయి బరి మొత్తం రక్తమోడింది. బాగా రక్తం పోయి పద్మారావు అక్కడికక్కడే కుప్పకూలాడు.

ఇది చూసిన వెంటనే పద్మారావు స్నేహితులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే పద్మారావు చనిపోయాడని అతడి స్నేహితులు పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు సీఐ లక్ష్మారెడ్డి వెల్లడించారు. పద్మారావు మృతితో అనంతపల్లి విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ వార్త తెలుసుకుని పద్మారావు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

కోడి కత్తులకు పాదరసం పూస్తారా.. !
రెండు కోళ్లు కొట్లాడుకుంటూ వాటి కాళ్లకు కట్టిన కత్తి బలంగా గాయం అయిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందిన క్రమంలో తీవ్ర విషాదాన్ని రేపింది. అయితే గాయమైన కొంత సేపట్లోనే యువకుడు మృతి చెందడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే కోళ్ల కాళ్లకు కట్టే కత్తులకు పాదరసం పూస్తారని చెబుతుంటారు.. ఇది కోళ్లకు కత్తులు కట్టే వారిని ఎవరిని అడిగినా ఇదే మాట చెబుతారు.  తాజాగా జరిగిన సంఘటనలో పాదరసం పూసిన కత్తి గాయం చేయడం వల్లనే గాయపడిన యువకుడు వేగంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందా అన్నది పోస్ట్ మార్టం నివేదికలో తేడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ  కోడిపందాలు బరుల్లో రెండు కోళ్లు కొట్లాట జరుగుతున్నప్పుడు అత్యంత సమీపంగా ఉండటం తాజా సంఘటనలతో ప్రమాదమే అని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

కోడిపందేలు ఆడుతుండగా మరో వ్యక్తి... 
కాకినాడ జిల్లా పరిధిలోని జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం వేలంకలో పలు చోట్ల పందేల బరులు ఏర్పాటు చేసి జోరుగా కోడిపందేలు ఆడుతున్నారు. ఈ క్రమంలోనే కోళ్లకు కత్తులు కట్టి పందేలు ఆడుతుండగా ఇదే ప్రాంతానికి చెందిన గండే ప్రకాష్‌ అనే వ్యక్తి కోడికత్తి తెగి గాయపడి మృతిచెందాడు. కత్తులు కట్టిన కోళ్లు కోట్లాడుతుండగా దగ్గరకెళ్లి చూస్తుండగా ఎగిరిన క్రమంలో కోడికాలుకు ఉన్న కత్తె ప్రకాష్‌ కాలుకు తగె గాయం అవ్వడంతో రక్తమోడుతూ మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు వివాహితుడు కాగా పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget