America News: తెలుగు విద్యార్థి ప్లాట్లో అమెరికన్ యువతి దొంగతనం-రోడ్డున పడ్డానంటూ యువకుడి ఆవేదన
Telugu News: అమెరికాలో తన ఫ్లాట్‌లో జరిగిన దొంగతనం గురించి మహేశ్ సాగర్ అనే తెలుగు విద్యార్థి ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో పోస్ట్ చేశాడు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజ్‌ను చూపించాడు.
Crime News: అమెరికాలోని పెన్సిల్వేనియోలోని తన ఫ్లాట్‌లో దొంగతనం జరిగిందని ఓ తెలుగు విద్యార్థి వాపోతున్నాడు. తన డబ్బులు, ల్యాప్‌టాప్, విలువైన వస్తువులు, ఇతర డాక్యమెంట్లను పోగొట్టుకున్నానని చెబుతూ తినడానికి కూడా తిండిలేని దారుణమైన పరిస్థితుల్లో ఉన్నానని ఆవేదన చెందాడు. ఇందుకు సంబందించి ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి పేరు మహేశ్ సాగర్ అని తెలుస్తోంది. కానీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కత్తితో బెదిరించి చోరీ
తన పరిస్థితిని రెండు వీడియోల ద్వారా వివరించాడు. ఒక అమెరికన్ యువతి తన ఫ్లాట్‌లో జొరబడి ఇంట్లో ఉన్న వస్తువులను దోచుకుని పోయిందని చెప్పాడు. ఇదంతా ఫ్లాట్ సీసీ కెమెరాల్లో కూడా రికార్డయిందని చెప్పాడు. (ఆ ఫుటేజ్‌ను కూడా పోస్ట్ చేశాడు). బ్యాగ్‌ను కత్తితో కోసి అందులో ఉండాల్సిన డబ్బు, ల్యాప్ టాప్, ఇతర విలువైన పేపర్లు తీసుకెళ్లిందని చెప్పాడు. దొంగతనం జరిగిన సమయంలో తాను తన ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ కోసం వెళ్లానని చెప్పాడు. పోలీసులకు పిర్యాదు చేసినా మొక్కుబడిగా వచ్చి విచారించి పోయారని వాపోయాడు. అమెరికాలో పోలీసింగ్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని ఆశిస్తే ఇంత హీనంగా ఉందేంటా అని తాను అవాక్కయానని వీడియోలో చెప్పుకొచ్చాడు. జీవితంలో తొలిసారి ఇంతటి దుర్భరమైన పరిస్థితులన ఎదుర్కొంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఇంత జరిగినా ఒక విషయంలో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. దొంగతనం జరిగిన తర్వాత తనకి తెలియని నంబర్ నుంచి ఒక కాల్ వచ్చిందన్నాడు. తన ఫ్లాట్‌లో దొంగతనం చేసిన అమ్మాయి తన బంధువుగా చెప్పాడని వివరించాడు. తనకు ఇండియా కరెన్సీ దొరికిందని, కొన్ని పేపర్లలో దొరికిన ఫోన్ నెంబర్ ఆధారంగా మీకు కాల్ చేస్తున్నట్టు ఆయన చెప్పాడన్నారు. మీ ఫ్లాట్ దొంగతనం చేసిన అమ్మాయి డ్రగ్‌కి బానిసై ఇలాంటి పనులు చేస్తుంటుందని, కానీ ఏం కంగారు అవసరం లేదని మీ వస్తువులను సేకరించి తిరిగి ఇస్తానని చెప్పడంతో పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయిందని మహేశ్ సాగర్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
Also Read: బెట్టింగ్ వ్యససానికి బానిసైన కొడుకు- అప్పులు తీర్చలేక తల్లిదండ్రుల బలవన్మరణం