Kurnool: ఇంట్లో ఒంటరిగా డిప్యూటీ తహసీల్దార్.. సాయంత్రం భార్య వచ్చి చూసి షాక్, కన్నీరుమున్నీరు
తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ వచ్చిన సురేంద్ర.. తన జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు, తన చావుకు ఎవరూ కారణం కాదని తెల్ల కాగితంపై సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.
కర్నూలు జిల్లాలో ఓ డిప్యూటీ తహసీల్దార్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలోని రాంభూపాల్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న డిప్యూటీ తహసీల్దార్ సురేంద్ర తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అదే జిల్లా డోన్ పట్టణానికి చెందిన సురేంద్ర వృత్తి రీత్యా నంద్యాల ఆర్డీఓ ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. బనగానపల్లెలో నివాసం ఉంటూ ప్రతిరోజూ నంద్యాల ఆర్డీఓ ఆఫీస్‌కు వెళ్ళి విధులు నిర్వహించి తిరిగి వచ్చేవాడు. సురేంద్ర భార్య జగదీశ్వరి కోవెలకుంట్లలోని సబ్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. వీరికి ఓ కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు.
గత కొంత తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ వచ్చిన సురేంద్ర.. తన జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు, తన చావుకు ఎవరూ కారణం కాదని తెల్ల కాగితంపై సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేంద్ర రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని ఆదివారం ఇంటికి వచ్చారు. ఉదయం భార్య డ్యూటీకి వెళ్లగా తనకు ఒంట్లో నలతగా ఉందని ఇంట్లోనే ఉండిపోయారు. కార్తీక సోమవారం కావడంతో పిల్లలిద్దరినీ వారి తాతయ్య రవ్వల కొండకు తీసుకెళ్లాడు. ఒంటరిగా ఉన్న సురేంద్ర ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చిన భార్య తలుపులు తీయగా భర్త ఫ్యాన్‌కు వేలాడుతుండటం చూసి షాక్‌కు గురైంది.
Also Read: పసిడి ప్రియులకు ఊరట.. దిగొచ్చిన బంగారం ధర, వెండి రూ.700 తగ్గుదల
తన కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్‌గా విధులు నిర్వహించే సురేంద్ర ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలుసుకున్న నంద్యాల ఆర్డీఓ చాహత్ వాజ్‌పేయీ, బనగానపల్లెకి చేరుకొని మృతుడి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆత్మహత్యకు పాల్పడిన ఘటనకు సంబంధించి కుటుంబీకులతో సమాచారం అడిగి తెలుసుకున్నారు.
డిప్యూటీ తహసీల్దారు ఆత్మహత్య ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు బనగానపల్లె ఎస్సై కృష్ణమూర్తి తెలియజేశారు.
Also Read: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అశ్లీల నృత్యాలు... ఇవేం పనులంటూ స్థానికుల మండిపాటు
Also Read: Vishaka: మీ కరివేపాకు ఐడియాలకు దణ్ణంరా బాబు.. అమెజాన్ లో విశాఖ టూ మధ్యప్రదేశ్ కు గంజాయి సరఫరా
Also Read: Honda New SUV: హోండా కొత్త ఎస్‌యూవీలు త్వరలో.. ఈ విభాగంలో బెస్ట్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి