రైల్వే స్టేషన్‌లో మహిళకు కరెంట్ షాక్, ట్రీట్‌మెంట్ చేస్తుండగా మృతి
Delhi Railway Station: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ కరెంట్ పోల్‌ని పట్టుకోవడం వల్ల షాక్ తగిలి మృతి చెందింది.
Delhi Railway Station:
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఘటన..
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ కరెంట్ షాక్‌తో చనిపోయింది. మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. గత రాత్రి నుంచి ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైల్వే స్టేషన్‌లో పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోయాయి. ఈస్ట్ ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో ఉంటున్న బాధితురాలు సాక్షి అహుజా...ఉదయం 5.30 నిముషాలకు ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులతో కలిసి రైల్వే స్టేషన్‌కి వచ్చింది. ఓ చోట నీళ్లు ఎక్కువగా ఉండటం వల్ల పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ పోల్‌ని పట్టుకుని పక్క నుంచి దాటాలని ప్రయత్నించింది. ఎప్పుడైతే ఆ పోల్‌ని పట్టుకుందో హైవోల్టేజ్ శరీరంలోకి పాస్ అయింది. ఈ దెబ్బకు ఆమె పడిపోయింది. స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు వెంటనే గమనించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ట్రీట్‌మెంట్ చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. ఆ పోల్ కింద కొన్ని ఎలక్ట్రిక్ వైర్‌లకు ఎలాంటి ప్రొటెక్షన్ వేయకుండా వదిలేశారు. అవి తగిలే ఆమె మృతి చెందినట్టు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ప్రస్తుతం ఈ ఘటనపై అటు రైల్వేతో పాటు పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
A woman died due to electrocution on New Delhi railway station premises. FSL team is present on the spot. The body of the woman has been sent to Lady Hardinge Hospital for postmortem. Probe underway: Delhi Police pic.twitter.com/p4c6oqH0vh
— ANI (@ANI) June 25, 2023
The deceased woman has been identified as Sakshi Ahuja, a resident of Preet Vihar, Delhi who got electrocuted after grabbing an electric pole outside the New Delhi Railway Station where she came to catch the Bhopal Shatabdi train. There was waterlogging outside the Railway… pic.twitter.com/M4NwA3Rwij
— ANI (@ANI) June 25, 2023
భారీ వర్షాలు, వరదలతో జనజీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా వరదల్లో చిక్కుకున్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో వరదల ప్రభావం అధికంగా ఉంది. సుమారు 5 లక్షల మందిపై ఈ వరదలు పెను ప్రభావాన్ని చూపాయి. బజలి జిల్లాలోనే దాదాపు 2.67 లక్షల మంది ప్రభావితమయ్యారు. ఆ తర్వాత నల్బరిలో 80,061 మంది, బార్ పేటలో 73,233 మంది, లఖింపూర్ లో 22,577 మంది, దర్రాంగ్ లో 14,583 మంది, తాముల్ పూర్లో 7,280 మంది ప్రభావితమైనట్లు అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) ప్రకటించింది. గొల్ పరా జిల్లాలో వరదల కారణంగా 10,782.80 హెక్టార్లలో పంట నీటమునిగి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Woman Skeleton: మూడేళ్ల క్రితం మిస్ అయిన మహిళ, సెప్టిక్ ట్యాంక్‌లో అస్తిపంజరం