అన్వేషించండి

ఢిల్లీలో స్విట్జర్లాండ్ మహిళ దారుణ హత్య, రోడ్డు పక్కన చెత్త కవర్‌లో డెడ్‌బాడీ

Delhi Crime: ఢిల్లీలో స్విట్జర్లాండ్‌ మహిళ దారుణ హత్యకు గురైంది.

Delhi Crime: 

ఢిల్లీలో దారుణ హత్య..

స్విట్జర్లాండ్‌కి చెందిన మహిళ ఢిల్లీలో దారుణ హత్యకు గురైంది. వెస్ట్ ఢిల్లీలోని తిలక్‌నగర్‌లో ఆమె డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. మృతురాలి పేరు లీనా బెర్గర్‌గా గుర్తించారు. ఓ గవర్నమెంట్ స్కూల్‌ సమీపంలో మృతదేహం లభ్యమైంది. చెత్త వేసే బ్లాక్‌ కవర్‌లో ఆమె బాడీని కుక్కి పెట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...నిందితుడికి, ఆ మహిళకు స్విట్జర్లాండ్‌లో పరిచమయైంది. అక్కడే ఇద్దరూ స్నేహితులయ్యారు. నిందితుడు గుర్‌ప్రీత్‌ తరచూ స్విట్జర్లాండ్‌కి వెళ్లి లీనాని కలిసేవాడు. అయితే...ఆ మహిళ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్టు అనుమానించాడు. ఈ కోపంతోనే ఆమెను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. ఇండియాకి రావాలని కాల్ చేశాడు. అక్టోబర్ 11న ఆమె ఇండియాకి వచ్చింది. ఐదు రోజుల తరవాత లీనాని రూమ్‌కి తీసుకెళ్లాడు. ఆ గదిలోనే ఆమెను బంధించాడు. చేతులు, కాళ్లు కట్టేసి హత్య చేశాడు. ఆమె డెడ్‌బాడీని కార్‌లో దాచాడు. కాసేపటి తరవాత కార్‌లో నుంచి దుర్గంధం వచ్చింది. దొరికిపోతానేమో అన్న భయంతో కార్‌లో తిలక్‌నగర్ వరకూ వెళ్లి రోడ్‌ సైడ్‌లో బాడీని పారేసి అక్కడి నుంచి పారిపోయాడు. కార్ రిజిస్ట్రేషన్ నంబర్‌ ద్వారా నిందితుడిని గుర్తించారు. CC కెమెరాల ఫుటేజ్‌నీ గమనించారు. వెంటనే కార్‌ని సీజ్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఇంట్లో రూ.2.5 కోట్ల నగదుని సీజ్ చేశారు. 

ఢిల్లీలో ఇటీవలే ఓ దారుణ హత్య జరిగింది. ఓ 42 ఏళ్ల వ్యక్తిని యువకుడు హత్య చేసి ఇంట్లోనే పాతి పెట్టాడు. ఆ తరవాత దానిపై సిమెంట్‌ పోసి ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. చివరకు...పోలీసుల విచారణలో దొరికిపోయాడు. సెప్టెంబర్ 2వ తేదీన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..సర్వే ఆఫ్ ఇండియా డిఫెన్స్ ఆఫీసర్ మహేశ్ కుమార్ ఆగస్టు 29 నుంచి కనిపించకుండా పోయాడు. అదే ఆఫీస్‌లో క్లర్క్‌గా పని చేస్తున్న అనీస్‌ ఆయనను హత్య చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా ఉంటున్నాడని, ఆ కోపంతోనే చంపేశానని పోలీసుల ముందు నేరం అంగీకరించాడు. అంతే కాదు. మహేశ్ కుమార్ తన వద్ద రూ.9 లక్షల అప్పు తీసుకున్నాడని, ఇప్పటి వరకూ తీర్చలేదని చెప్పాడు. డబ్బులు ఇవ్వకపోగా తన గర్ల్‌ఫ్రెండ్‌కి దగ్గరయ్యేందుకు చూశాడన్న కోపంతో ఐరన్ పైప్‌తో కొట్టి చంపాడు. పక్కా ప్లాన్ ప్రకారం ఈ హత్య చేశాడు నిందితుడు అనీస్. పైప్‌ రెంచ్‌తో తలపై గట్టిగా కొట్టాడు. ఆ ధాటికి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు మహేశ్. హత్య చేసిన వెంటనే అక్కడి నుంచి సోనిపట్‌కి బైక్‌పై వెళ్లాడు. మొబైల్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఆగస్టు 29న మళ్లీ ఇంటికి వచ్చి వెనకాల ఓ గొయ్యి తవ్వాడు. రాత్రి పూట ఎవరూ చూడని సమయంలో డెడ్‌బాడీని అందులో వేసి సిమెంట్‌తో కప్పేశాడు. 

Also Read: భారత్‌ మరో అడుగు ముందుకు వేసింది, గగన్‌యాన్ సక్సెస్‌పై ప్రధాని మోదీ ట్వీట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget