Hyderabad News: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం దారుణం - భర్త, అత్తలపై దాడి చేయించిన కోడలు, ఎక్కడంటే?
Telangana News: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ కోడలు.. అత్తను చంపేందుకు ప్లాన్ చేసింది. తన తరఫు బంధువులతో దాడి చేయించింది. బేగంబజార్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Daughter In Law Planned For Mother In Law Murder In Hyderabad: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ కోడలు.. భర్త, అత్తపైనే హత్యాయత్నానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన బేగంబజార్ (Begumbazar) లో కలకలం రేపింది. బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెల మండి సమీపంలో ఓ కోడలు తన బంధువులతో.. భర్త, అత్తపై దాడి చేయించింది. ఇంట్లోకి చొరబడిన దుండగులు విచక్షణా రహితంగా వారిపై దాడికి పాల్పడ్డారు. అత్తను చంపేస్తే బీమా సొమ్ము వస్తుందని కోడలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు చూస్తుండగానే దుండగులు.. భర్త, అత్తలపై కత్తులు, కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. డయల్ 100కు ఫోన్ చేసినా స్పందన లేదని బాధితులు పేర్కొంటున్నారు. స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఈ దాడి దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. తమకు పోలీసులు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
అయితే, భార్యాభర్తల మధ్య గత 5 ఏళ్లుగా గొడవ జరుగుతుందని.. దీనిపై భార్య అన్నదమ్ములకు విషయం చెప్పగా వారు వచ్చి దాడి చేసినట్లు మరో వాదన కూడా వినిపిస్తోంది. కాగా, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్యాయత్నం చేశారా.?. లేదా గొడవలతో దాడి జరిగిందా.? అనే దానిపై స్ఫష్టత లేదు. దీనిపై నిజానిజాలు తెలియాల్సి ఉంది.
Also Read: Telangana News: ఆస్తి పంపకాల తర్వాతనే 'అమ్మ' అంత్యక్రియలు - రెండు రోజులుగా ఇంట్లోనే భౌతిక కాయం, అమానవీయ ఘటన!