అన్వేషించండి

Hyderabad Crime News : హైదరాబాద్ నుంచి అమెరికన్లను దోపిడీ చేసిన గ్యాంగ్ - సైబర్ నేరాల్లో ఇదో స్టైల్ !

హైదరాబాద్ లో కాల్ సెంటర్ పెట్టి అమెరికన్లను మోసం చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు.


Hyderabad Crime News :  అమెరికా వాళ్లను మోసం చేయాలంటే అమెరికా దాకా పోవాల్సిన పని లేదు. హైదరాబాద్‌లోనే  ఓ కాల్ సెంటర్ పెట్టి అమెరికా వాళ్లను బురిడికొట్టేయవచ్చు. వాళ్ల డబ్బులు దోచేయవచ్చు. సాఫ్ట్ వేర్ కంపెనీని నడుపుతున్నట్లుగా బిల్డప్ ఇస్తూ.. అమెరికాలో సైబర్ నేరాలకు పాల్పడి డబ్బులు దోచుకుంటున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. 

హైదరాబాద్ కాల్ సెంటర్ నుంచి అమెరికా  వాళ్లకు బురిడీ

హైదరాబాద్‌ మాదాపూర్లో  ARG సొల్యూషన్ పేరుతో అన్సారీ అనే వ్యక్తి కాల్ సెంటర్ నడుపుతున్నాడు.  ..దాని పక్కనే AG సొల్యూషన్ పేరుతో మరో కాల్ సెంటర్ నడుపుతున్నారు.  ఈ రెండు కంపెనీలు గుజరాత్ లో రిజిస్టర్ అయ్యాయి. యూఎస్, కెనడా సిటిజన్స్ డేటా సంపాదించి కాల్స్ చేసి వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. మొదట ఓ వ్యక్తికి కాల్ చేసి.. మెక్సికో నుంచి మీకు పార్సెల్ వచ్చింది.. అందులో డ్రగ్స్ ఉన్నాయి. ఈ రకంగా  భయపెట్టి బాధితుల  బ్యాంకు డీటెయిల్స్, ఇతర వివరాలు సేకరిస్తున్నారు.  ఇంట్లో లేనపుడు ఇంటిపై కూడా రైడ్ చేశామని.. డ్రగ్స్ సంబంధించిన ఆధారాలు దొరికాయని భయపెడుతున్నారు.  యూఎస్ పోలీసులు మీపై రెండు కేసులు పెడుతున్నారని బ్లాక్ మెయిల్ చేస్తారు.  నిర్దోషులుగా ప్రూవ్ చేసుకోవాలంటే యూఎస్ మార్షల్ తో మాట్లాడమని చెప్తున్నారు. 

కొట్టేసిన సొమ్మంతా బిట్ కాయిన్ల రూపంలో ఇండియాకు!                        

ఆ తర్వాత యూఎస్ మార్షల్ గా మాట్లాడి బాధితుల నుంచి 5 నుంచి 6 వేల యూఎస్ డాలర్స్ కట్టించుకుంటున్నారు.  ఆ డబ్బంతా బిట్ కాయిన్ రూపంలో ఇండియాకు తీసుకువస్తున్నారు. ఈ ముఠాలో నిందితులు గుజరాత్‌కు చెందిన వారే.  నిందితులను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.  

మరో కాల్ సెంటర్ నిర్వాకం కూడా బట్టబయలు                          
 
మరో కేసులో వెర్టెజ్ సొల్యూషన్ పేరుతో ఫేక్ అమెజాన్ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 120 మందిని అదుపులోకి తీసుకున్నారు.  నిందితులు తెలివిగా కస్టమర్లకు కాల్ చేసి బురిడీ కొట్టిస్తున్నారని పోలీసులు తెలిపారు.  మీ పేరుపై అమెజాన్ డెలివరీ వచ్చింది. కస్టమర్ ఆర్డర్ చేయలేదని చెబితే చెక్ చేసినట్టు నటించి.. మీరే చేసారని మళ్ళీ చెబుతారు. ఆ తర్వాత ఆర్డర్ కాన్సల్ చేయాలంటే మీ బ్యాంకు నుంచి పేమెంట్ అవ్వాలని చెబుతారు.  బ్యాంకు వాళ్లలా మాట్లాడి పేమెంట్ ఆపాలంటే కొంత ఫైన్ పడుతుంది.. గిఫ్ట్ కార్డు కొనాలంటూ పేమెంట్ వసూలు చేస్తారని పోలీసులు తెలిపారు. ఆ డబ్బుని బిట్ కాయిన్ రూపంలో మార్చి ఇండియాకి తీసుకొస్తున్నారని పోలీసులు చెప్పారు. ఈ ఫేక్ కాల్ సెంటర్లో పనిచేసే వాళ్లకు అందరికి  ఫేక్ కాల్ సెంటర్ అని కూడా తెలుసని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరించారు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Embed widget