Rakul Preet Brother Arrest: డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్ అరెస్ట్, డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్
Rakul Preet Singhs Brother Amanpreet Singh Arrested | హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ కేసు వెలుగుచూసింది. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Cyberabad Police press meet on Drugs Case | హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఆపరేషన్‌లో ఐదుగుర్ని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి డ్రగ్స్ సీజ్ చేయడం తెలిసిందే. డ్రగ్స్ తీసుకున్న వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని టెస్టులు జరిపారు. వీరిలో అమన్ ప్రీత్ సింగ్ సహా ఐదుగురికి పాజిటివ్ గా తేలింది. అమన్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సోదరుడు అని ఈ డ్రగ్స్ కేసు తెలంగాణలో సంచలనం రేపుతోంది. టాలీవుడ్ కు లింక్స్ ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రగ్స్ గురించి తెలిసినా, ఏమైనా అనుమానం వచ్చినా 8712671111 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. బాధ్యత గల పౌరులుగా వ్యవహరించి, డ్రగ్స్ లేని సమాజం కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు.
ఈ కేసు వివరాలను రాజేంద్రనగర్ డీసీసీ సీహెచ్ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. రాజేంద్రనగర్ డీసీసీ మాట్లాడుతూ.. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సైబరాబాద్ ఎస్వోటీ, రాజేంద్రనగర్ పరిధిలోని నార్సింగి పోలీసులు ఓ ఫ్లాట్‌పై రైడ్ చేశారు. డ్రగ్స్ కు సంబంధించి మొత్తం ఐదుగుర్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టైన వారిలో ఇద్దరు నైజీరియన్లు, ఇద్దరు ఇక్కడి వారు ఉన్నారని చెప్పారు. నిందితుల వద్ద నుంచి 199 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు తెలిపారు. నైజీరియా వాళ్ల పాస్ పోర్ట్ లతో పాటు వారి వద్ద నుంచి రెండు టూవీలర్లు, మొబైల్స్ సీజ్ చేశారు.
డ్రగ్స్ రాకెట్ నడిపింది డివైన్ అబుకా సుజి అనే నైజీరియాకు చెందిన వ్యక్తి. ప్రస్తుతం ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి అనుచరులు ఓనౌహ బ్లెస్సింగ్ అలియాస్ జోనా గోమ్స్ అనే మహిళను అరెస్ట్ చేశారు. దూల్ పేటలో డ్రగ్స్ కేసులోనూ అరెస్టై బెయిల్ మీద విడుదలైనట్లు తెలిపారు. ఫేక్ పాస్ పోర్ట్ తయారు చేసి డ్రగ్స్ తీసుకొచ్చింది ఈమెనె అని పోలీసులు స్పష్టం చేశారు.
డ్రగ్ పెడ్లర్స్, ఇతర సమాచారం సేకరించి డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడు డివైన్ అబుకా సుజి కూడా నైజీరియాకు చెందిన వ్యక్తి అని తేల్చారు. పరారీలో ఉన్న నిందితుల్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. ఓ నిందితుడు డ్రైవర్ కాగా, మరో నిందితుడు కొరియోగ్రాఫర్ అని గుర్తించారు. డ్రగ్స్ తీసుకెళ్లి విక్రయించాల్సిన సమయంలో నార్కోటిక్స్ బ్యూరో, సైబరాబాద్ ఎస్వోటీ, నార్సింగి పోలీసులు ఆకస్మిక దాడులు చేసి ఐదుగుర్ని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి దాదాపు 200 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు వెల్లడించారు.
డ్రగ్స్ తీసుకున్న ఐదుగురి అరెస్ట్
డ్రగ్స్ వినియోగిస్తున్న వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని మెడికల్ టెస్టులు చేపించారు. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ సైతం డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే రకుల్ ప్రీత్‌కు డ్రగ్స్ కేసుతో సంబంధం లేదని పోలీసులు తెలిపారు. అతడితో మొత్తం 13 మంది డ్రగ్స్ తీసుకున్నవారిలో 1) అమన్ ప్రీత్ సింగ్, 2) కిషన్ రాఠి, 3) అనికేత్, 4) యశ్వంత్, 5) రోహిత్, 6) శ్రీ చరణ్, 7) ప్రసాద్, 8) హేమంత్, 9) నిఖిల్, 10) మధు, 11) రఘు, 12) కృష్ణం రాజు 13) వెంకట్ ఉన్నారు. శాంపిల్స్ ల్యాబ్ కు తరలించి టెస్టులు చేపించగా ఐదుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలినట్లు డీసీసీ వెల్లడించారు. మొత్తం 13 మందికి టెస్టులు నిర్వహించగా వీరిలో అమన్ ప్రీత్ సింగ్, మధుసూదన్, అనికేత్ రెడ్డి, ప్రసాద్, నిఖిల్‌లు కొకైన్ తీసుకున్నారని వీరికి పాజిటివ్ అని రిపోర్టులో వచ్చింది. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అమన్ ప్రీత్ సింగ్ లోటస్ పాండ్‌లో ఉంటారని తెలిపారు.