Crime News: చిన్నప్పుడే తల్లిదండ్రులు మందలించింటే ఇలా అయ్యేవాడు కాదు.. వృద్ధ దంపతుల హత్య కేసు ఛేదించిన పోలీసులు
Medchal Crime news | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మే3న జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును అల్వాల్ పోలీసులు ఛేదించారు. నిందితుడు పాత నేరస్తుడని మీడియాకు తెలిపారు.

మేడ్చల్ జిల్లా: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి సూర్య నగర్ లో మే నెల 3వ తేదీన జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బుల కోసం పలు నేరాలు (రేప్, మర్డర్ లు )చేస్తూ గతంలో జైలు శిక్ష అనుభవించి ఇటీవల బైటికి వచ్చిన నిందితుడు జంట హత్యలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. వృద్ధ దంపతులను హత్య చేసిన చింతకింది అనిల్ (36) అనే పాత నేరస్థుడిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నెల 3 వ తేదీ రాత్రి నిద్రిస్తున్న కనకయ్య(70), రాజమ్మ (65)లను పక్కనే ఉన్న సెంట్రింగ్ కర్రతో తలలు పగలకొట్టి హత్య చేసిన నిందితుడు వారి వద్ద ఉన్న నగలు, డబ్బులను ఎత్తుకెళ్లాడని పోలీసులు తెలిపారు. మే 4న ఫిర్యాదు అందుకున్న అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని మీడియాకు తెలిపారు. నిందితుడు అనిల్ వద్ద నుంచి దంపతుల వద్ద దొంగిలించిన 2సెల్ ఫోన్లు, బంగారు తాళి, 150 గ్రాముల వెండి, 20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
మేడ్చల్ జోన్ డిసిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి కేసు వివరాలు వివరించారు. ఆకుకూరలు దొంగలించినప్పుడే తల్లిదండ్రులు మందలించి ఉంటే ఈ రోజు అత్యాచారం, హత్యలు చేసే దొంగగా మారి జైలు ఊచలు లెక్కపెట్టేవాడు కాదు. చింతకింది అనీల్ (37) చిన్నప్పటి నుంచే దొంగతనాలకు పాల్పడుతూ దాదాపు 29 కేసులలో నిందితుడిగా ఉన్నాడు. నాలుగు రోజుల క్రితం ఆల్వాల్ లో జరిగిన వృద్ధ దంపతులను హత్య చేసింది అనిల్. పక్కా ఆధారాలతో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వృద్ధ దంపతుల దారుణహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో బొల్లారానికి చెందిన అనిల్ ను అరెస్ట్ చేశారు. విచారణలో పలు విషయాలు వెలుగుచూశాయి. నిందితుడు పాత నేరస్తుడు గా గుర్తించారు.

చిన్నప్పటి నుంచే దొంగతనాలు చేస్తూ నేరస్తుడిగా మారాడు. పలు కేసుల్లో జైలుకు వెళ్లి వఛ్చినా నేర ప్రవృత్తి మార్చుకోలేదు. మరోవైపు అతడు తప్పులు చేస్తున్నా, అతనిని కుటుంబం కూడా పట్టించుకోలేదు. దాంతో రేప్‌లు, మర్డర్లు సహా 29 కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో ఇటీవల జైలు నుంచి విడుదలైన అనిల్ డబ్బులు, నగల కోసం మేడ్చల్ జిల్లా ఆల్వాల్ లో ఇద్దరు వృద్ధ దంపతులను హత్య చేశాడు. వారి ఒంటిపై ఉన్న బంగారం, వారి వద్ద ఉన్న నగదును దోచుకెళ్లాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి.. అనిల్ ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చేస్తామన్న డీసీపీ కోటిరెడ్డి అనంతరం అతడ్ని రిమాండ్ కు తరలించారు.






















