బీటెక్ చదువుతున్నప్పుడే ప్రేమ అన్నాడు- తర్వాతే సినిమా చూపించాడు
కాలేజీలో చదువుకునేటప్పుడు ప్రేమించాడు. కోరికలు తీర్చుకోవడానికి ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్లు సీక్రెట్ కాపురం చేశాడు.
ప్రేమించిన వాడు మోసగించడంతో పోలీసులను ఆశ్రయించింది ఓ యువతి. ప్రేమిస్తున్నాని వెంట పడి పెళ్ళి చేసుకుని మూడు సంవత్సరాలు సీక్రెట్‌గా కాపురం చేశాడు. కోరికలు తీర్చుకున్నాడు. గర్భవతి అయ్యేసరికి తన కుటుంబ సభ్యులకు నచ్చలేదంటూ అబార్షన్ చేయించాడు. అతన్ని అమాయకంగా నమ్మిన ఆ యువతి చెప్పిందల్లా చేసింది.
మోజు తీరిన తర్వాత కలుసుకోవడం క్రమంగా తగ్గించాడు. కొన్నిరోజుల తర్వాత పూర్తిగా మొహం చాటేశాడు. చివరకు ఆరా తీస్తే అసలు సంగతి బయటపడింది. తనను కాదని వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైనట్టు గుర్తించిందా యువతి. అంతే పోలీసులను ఆశ్రయించింది. న్యాయం చేయాలంటూ వేడుకుంది.
ఈ ఇష్యూలో యువకుడి ఉండేది చిత్తూరు జిల్లా అయింతే అమ్మాయిది కడప జిల్లా. కడప జిల్లా పులివెందుల గ్రామానికి చెందిన యువతిని చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం ఈదువారి పల్లి గ్రామానికి చెందిన నిరంజన్ కుమార్‌ను ప్రేమించింది. ఇద్దరూ సీక్రెట్‌గా పెళ్ళి చేసుకున్నారు. వీళ్లిద్దరూ విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలో బిటెక్ చదివే సమయంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. నిరంజన్ కుమార్ బిటెక్ మొదటి సంవత్సరంలోనే ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడ్డాడు. ముందుగా ప్రేమకు నిరాకరించిన ఆమె... తర్వాత అతని వలలో పడిపోయింది.
బీటెక్ చదువుతుండగానే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో చదువుకుంటూ చిత్రం సినిమా చూపించారు. మూడు సంవత్సరాల పాటు ఆమెతో కాపురం చేశాడు. 2021వ సంవత్సరంలో ఆమెకు 22 సంవత్సరాల వయసులనే గర్భవతిని కూడా చేశాడు.
దాన్ని కూడా తనకు అవకాశంగా మలుచుకున్నాడు నిరంజన్. గర్భవతి అని తెలిసి కూడా తన తల్లిదండ్రుల వద్దకు ఆమెను తీసుకుని తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్నట్లు తెలియజేశాడు. నిరంజన్ తల్లిదండ్రులు ఆమెను తమ కోడలిగా ఒప్పుకోలేదు. దీంతో గర్భవతైన వ్యక్తితో పెళ్లి జరిపేందుకు పేరెంట్స్ ఒప్పుకోవడం లేదని కలరిచ్చాడు. అబార్షన్ చేయించుకుంటే ఒప్పిస్తానంటూ మరో కహానీ చెప్పాడు. నమ్మేసిన ఆ యువతి నిరంజన్ చెప్పినట్టు చేసింది.
నిరంజన్ మాయమాటలు నమ్మిన ఆమె తన సంతూరు వెళ్లిపోయింది. అంతే ఆమెతో మాటలు తగ్గించేశాడు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం మానేశాడు. దూరంగా ఉండేవాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె నిరంజన్‌ను నిలదీసింది. అప్పుడు గానీ అసలు సంగతి తెలియలేదు ఆమెకు.
నిరంజన్ మరొక పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించినట్టు గుర్తించింది బాధితురాలు. తన తల్లిదండ్రులకు నచ్చలేదని చెప్పి మరొక పెళ్ళికి సిద్దం అయ్యాడు. విషయం తెలుసుకున్న ఆమె నిరంజన్ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులతో తనకు అన్యాయం చేయద్దని వేడుకుంది. కానీ వాళ్లు పట్టించుకోక పోవడంతో కార్వేటినగరం పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. ఇరు కుటుంబాలను పోలీసులు పిలిచి చర్చించినట్టు తెలుస్తోంది. రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్.