అన్వేషించండి

Chittor Crime: కడుపు నొప్పి అని బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి, గర్భం దాల్చినట్లు వైద్యులు చెప్పడంతో షాక్!

స్కూల్‌కు వెళ్తున్న మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి ఓ యువకుడు కొన్ని నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. గర్భవతి కావడంతో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

చిత్తూరు జిల్లాలో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్కూల్‌కు వెళ్తున్న మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి ఓ యువకుడు కొన్ని నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. చివరికి మైనర్ బాలిక ఆరు నెలల గర్భవతి కావడంతో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక కడుపు నొప్పి అని తల్లికి చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్ళింది. మైనర్ బాలికను పరీక్షించిన వైద్యులు ఆ తల్లికి షాక్‌కు గురి చేసే విషయాన్ని తెలిపారు. ఆ బాలిక గర్భం దాల్చిందని, ఇప్పుడు ఆరు నెలల గర్భం అంటూ వైద్యులు నిర్ధారించడంతో బాలిక తల్లి న్యాయం కోసం పొలీసులను ఆశ్రయించారు.. ఆ వివరాలిలా ఉన్నాయి.

పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా, సోమల మండలం, నంజంపేట గ్రామానికి చెందిన 13 సంవత్సరాల మైనర్ బాలిక రోజూ‌ యథావిధిగా ప్రక్క గ్రామం అయిన పొదరుగుట్ట పల్లెకు ఒంటరిగా స్కూల్ కి వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో పొదరుగుట్ట పల్లె గ్రామానికి చేందిన రాజేష్ (22) అనే యువకుడు మైనర్ బాలికను ఫాలో కావడం మొదలుపెట్టాడు. మైనర్ పై కన్నేసిన రాజేష్ మైనర్ బాలిక స్కూల్ కి వెళ్తూ, తిరిగి ఇంటికి వెళ్తున్న సమయాల్లో కలిసి ఏవో మాయ మాటలు చెప్పేవాడు. బాలిక తనను నమ్మేందుకు చాక్లెట్స్, బిస్కట్స్ ఇచ్చి మచ్చిక చేసుకున్నాడు. తనను పూర్తిగా నమ్ముతుందని భావించిన తరువాత బాలికపై అఘాయిత్యం చేయాలని ప్లాన్ చేశాడు.

రోజూలాగే స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో ఎవరూ చూడని సమయంలో మార్గం మధ్యలో మైనర్ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడుతూ ఉండేవాడు. ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పవద్దని బెదిరించడంతో బాలికకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఓవైపు తనపై అఘాయిత్యం చేయడం, మరోవైపు తనకు ఏం జరుగుతుదో తెలియక ఆందోళనకు గురైనా రాజేష్ బెదిరింపులకు భయపడి విషయం ఇంట్లో చెప్పలేదు. ఈ క్రమంలో మైనర్ బాలిక మంగళవారం కడుపు నొప్పి అనడంతో బాలిక తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు చేయించారు.
షాకింగ్ న్యూస్ చెప్పిన వైద్యులు
మైనర్ బాలికను పరిక్షించిన వైద్యులు బాలిక ఆరు నెలల కడుపుతో ఉందని నిర్ధారించారు. దీంతో దిక్కు తోచని స్ధితిలో పడిన మైనర్ బాలిక తల్లితండ్రులు, గర్భం దాల్చడానికి కారకుడైన యువకుడి వివరాలు తెలుసుకుని  సోమల పోలీసులకు ఆశ్రయించారు. మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సోమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే విషయం తెలుసుకున్న నిందితుడు రాజేష్ పరారీలో ఉన్నాడు. సోమల పోలీసులు నిందుతుడు రాజేష్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.


మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget