China Crime: వాట్సాప్ గ్రూపుల్లో స్టాక్ మార్కెట్ స్కాములు - చైనీయుడి అరెస్ట్ - ఈ నెట్‌వర్క్‌లో మీరు కూడా చిక్కుకుని ఉండొచ్చు !
Stock Trading Scams: స్టాక్ మార్కెట్ పేరుతో చేసే స్కామ్స్ పెరిగిపోయాయి. ఇందులోనూ చైనీయులే కనిపిస్తున్నాయి. తాజాగా వంద కోట్ల మేర దోచేసిన ఓ చైనీయుడని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Chinese Man Linked To Rs 100 Crore Stock Trading Scams Arrested In Delhi: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం అంటే ఇప్పుడు ఆన్ లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నంత ఈజీ అయిపోయింది. రూపాయి పెట్టుబడి పెట్టి వంద రూపాయలు సంపాదించేద్దామని కనీస అవగాహన లేకుండా మార్కెట్లోకి వచ్చే కొత్త వారిని మోసం చేయడానికి మసగాళ్లు కూడా పొంచి ఉన్నారు. అలా ఓ మోసగాడు ఏకంగా ఒత్సాహిక ఇన్వెస్టర్లను ఏకంగా రు. వంద కోట్లను కొట్టేశాడు. ఇతను మన దేశపు వాడు కూడా కాదు. చైనా వాడు.
చైనాకు చెందిన చెన్‌జిన్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు ఆన్ సైన్ సైబర్ క్రైమ్ చేసినందుకు అరెస్టు చేశారు. ఇతను ఆన్ లైన్ ట్రేడింగ్ అంటూ వాట్సాప్ గ్రూపుల్ని ఏర్పాటు చేసి ఆ గ్రూపుల్లో ఉన్న వారిని మోసం చేయడం ప్రారంభించాడు. ఇలా మోసపోయిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత చెన్ జిన్ గురించి ఆరా తీయడంతో ఇంకా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంద్రప్రదేశ్‌తో పాటు యూపీల్లోనూ పదిహేడు మందిని మోసం చేసినట్లుగా గుర్తించారు. మొత్తంగా చెన్ జిన్‌పై పదిహేడు క్రిమినల్ కంప్లైంట్స్ నమోదయ్యాయి. బాధితులు సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల్లో ఉన్న అమౌంట్ ను లెక్క వేస్తే చెన్ జీన్ దాదాపుగా వంద కోట్లను అమాయక ఇన్వెస్టర్ల నుంచి కొల్లగొట్టారని స్పష్టమవుతోంది.
Also Read: 'తల్లిదండ్రులు లేని పిల్ల బాబూ' - జరిగే పెళ్లి నిజం కానీ వధువు మాయం, కట్ చేస్తే!
చెన్‌జీన్ మోసం చేసే విధానంగా భిన్నంగా ఉంటుంది. ముందుగా డేటా చోరీ చేసిన వాళ్ల దగ్గర నుంచి ఫోన్ నెంబర్లు సేకరిస్తాడు. మొత్తంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తాడు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ మెంట్ కు ఉచిత సలహాలు అని ప్రారంభిస్తాడు. మెల్లగా నమ్మిన వాళ్లను నట్టేట ముంచుతాడు. ఇందు కోసం ప్రత్యేకంగా చాట్ సెషన్స కూడా నిర్వహిస్తాడు. తన ఖాతాలో వేస్తే తానే పెట్టుబడి పెడతానని .. పెద్ద ఎత్తున రిటర్నులు వచ్చేలా చేస్తానని నమ్మిస్తాడు. నమ్మిన వాళ్లు డబ్బులిస్తే పత్తా ఉండడు. చెన్‌జిన్ను అరెస్టు చేసిన పోలీసులు అతని ఖాతాల్ని వెరిఫై చేస్తున్నారు. దోచుకున్న డబ్బు అంతా ఎప్పటికప్పుడు చైనాకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ఇటీవల మోసాలు పెరిగిపోతున్నాయి. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయడం.. భారీగా రిటర్నులు ఇచ్చే స్టాక్స్ గురించి సలహాలు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేయడం కామన్ గా మారిపోయింది. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి పోగొట్టుకునేవారు కొంత మంది ఉంటే... ఇలా అసలు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల వరకూ వెల్లకుండానే మోసగాళ్ల చేతిలో డబ్బులు పోగొట్టుకుంటున్నవారు కొందరు ఉన్నారు. అందుకే స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని. తెలియని వాట్సాప్ గ్రూపుల్లో చేరవద్దని పోలీసులు సలహాలు ఇస్తున్నారు.