అన్వేషించండి

Shocking News: నన్నే కరుస్తావా అంటూ పామును కొరికేసిన బాలుడు - పాము మృతి, బాబు సేఫ్!

Chhattisgarh News: పాము తనను కాటేసిందనే కోపంతో ఓ బాలుడు ఆ పామునే కొరికి చంపాడు. అయితే ఈ ఘటనలో పాము చనిపోగా.. బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

Chhattisgarh News: ఓ బాలుడు ఆడుకుంటుండగా ఓ పాము అతడిని కాటేసింది. తీవ్ర కోపోద్రిక్తుడైన బాలుడు నన్నే కాటేస్తావా అంటూ పాము వెంట పరిగెత్తాడు. పొదల్లోకి వెళ్లినా అందులోకి దూరి మరీ పామును పట్టుకున్నాడు. నన్నే కాటేస్తావా అంటూ ఆవేశంతో దాన్ని కొరికేశాడు. ఈ ఘటనలో పాము అక్కడికక్కడే చనిపోయింది. అయితే బాలుడు మాత్రం అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. 

ఛత్తీస్ గఢ్ లోని జశ్ పుర్ జిల్లా పంద్రపుత్ గ్రామంలో పహాఢీ కోర్వా గిరిజన తెగకు చెందిన 12 ఏళ్ల దీపక్ రామ్ తన సోదరితో కలిసి ఆడుకుంటున్నాడు. అయితే ఇంటి పక్కనే ఆడుకుంటున్న వీరి వద్దకు అనుకోకుండా ఓ పాము వచ్చింది. ఒక్కసారిగా అతని చేతిపై కాటు వేసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన దీపక్.. పారిపోతున్న పాము వెంట పడ్డాడు. అది పొదల్లోకి వెళ్లినా వదలకుండా అందులోకి దూరి మరీ పట్టుకున్నాడు. నన్నే కరుస్తావా అంటూ వెంటనే దాన్ని గట్టిగా కొరికేశాడు. దీంతో ఆ పాము అక్కడికక్కడే మృతి చెందింది. అయితే విషయం గుర్తించిన దీపక్ సోదరి.. అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స చేసిన వైద్యులు బాలుడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. 

టర్కీలో కూడా ఇలాంటి ఘటనే - కాటేసిందని పామును కొరికేసిన రెండేళ్ల బాలిక

ఏడాది వయసు వరకు ఏడుపు, అలగడం, నవ్వడం వంటి రియాక్షన్లు మాత్రమే పిల్లల్లో కలుగుతాయి. పదిహేను నెలలు వచ్చే సరికి కోపం కూడా ప్రదర్శిస్తారు. ఇక రెండేళ్ల వయసుకు వారిలో చాలా ఎమోషన్స్ కలుగుతాయి. అంటే వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లలకు శరీరంలోని హార్లోన్లు ఒక్కో రియాక్షన్‌ను పరిచయం చేస్తుంటాయి. అంతెందుకు రెండేళ్ల పిల్లలను ఎవరైనా సరదాగా కొట్టి చూడండి, చాలా మంది తిరిగి కొడతారు. అంతేకాదు రెండు మూడు సార్లు వారిపై విసుక్కుంటే మీ దగ్గరకు వచ్చేందుకు కూడా ఇష్టపడరు. పిల్లల్లోనూ ఎమోషన్స్ అధికమే. అలాగే కోపం కూడా. టర్కీలోని రెండేళ్ల పిల్ల తనను కాటేసినందుకు ఆ పాము పని పట్టేసింది. అసలేమైందంటే...

పాప పేరు సే. అసలు పేరేంటో తెలియదు కానీ, అందరూ ముద్దుగా సే అని పిలుచుకుంటారు. టర్కీలోని ఓ గ్రామంలో తల్లిదండ్రలతో కలిసి నివసిస్తోంది. ఇంటి వెనుక పెరడులో ఆడుకుంటోంది. ఈ లోపు ఏడుపు వినిపించాయి. పక్కింటి వారు వెంటనే తమ ఇంటి పెరడు నుంచి చూసే సరికి రెండేళ్లే సే పామును కొరికేసి ఏడుస్తోంది. వెంటనే తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాప నోట్లోంచి పామును తీసేశారు. ఆమె పెదవులపై పాము కాటేసిన గుర్తులు ఉన్నాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తే ప్రాణాపాయం తప్పింది. పాప ఆడుకుంటున్న చోటకి ఓ పాము వచ్చింది. పాప దాన్ని బొమ్మ అనుకుని చేత్తో పట్టుకుంది. అది కాస్త పెదాలపై కాటేయగానే చిట్టి పాపకు చాలా కోపం వచ్చేసింది. వెంటనే దాన్ని కొరికి చంపేసింది. కానీ అది విషపు పాము. వెంటనే చికిత్స అందడంతో పాప దక్కింది. 

తనను కాటేసిన వెంటనే పాప పామును చంపేసింది. సే చాలా చురుకుగా ఉంటుందని, ఎవరైనా తనను తిట్టినా, కొట్టినా ఊరుకోదని చెబుతోంది వాళ్లమ్మ. కానీ ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యమైతే మాత్రం చిట్టితల్లి ప్రాణాలకు ప్రమాదం అయ్యేది. పామును చూసి ఆమె భయపడకపోవడం మాత్రం చాలా ఆశ్చర్యమేస్తోంది జనాలకి. ‘నా కూతురిని ఆ దేవుడే కాపాడాడు’ అంటున్నాడు చిన్నారి తండ్రి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa Actor Shritej: మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో
మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో "పుష్ప" నటుడు శ్రీతేజ్ మీద బాంబు పేల్చిన భార్య
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa Actor Shritej: మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో
మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో "పుష్ప" నటుడు శ్రీతేజ్ మీద బాంబు పేల్చిన భార్య
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
Physical Intimacy Health : లైంగిక ఆరోగ్యంపై చలికాలం ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
లైంగిక ఆరోగ్యంపై చలికాలం ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Jio Best Prepaid Plan: జియో బెస్ట్ 84 రోజుల ప్లాన్ ఇదే - ఫ్రీగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా!
జియో బెస్ట్ 84 రోజుల ప్లాన్ ఇదే - ఫ్రీగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా!
Embed widget