Car Driver Beaten: నడిరోడ్డుపై కార్ ఆపి దాడి చేసిన యువకులు, ఒక్క ట్వీట్‌తో అరెస్ట్
Car Driver Beaten: ఢిల్లీలో కార్ డ్రైవర్‌ని ఆపి దాడి చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Car Driver Beaten in Delhi:
ఢిల్లీలో ఘటన..
ఢిల్లీలో నలుగురు యువకులు కార్ డ్రైవర్‌పై దాడి చేశారు. నడిరోడ్డుపై కార్ ఆపేసి..డ్రైవర్‌పై దాడికి దిగిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు ప్రవీణ్ జంగ్రా ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేశాక..ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కార్ డ్యాష్‌బోర్డ్‌లోని కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. నంగోలి మెట్రో స్టేషన్ వద్ద కార్‌ను నలుగురు యువకులు అడ్డగించారు. డిప్పర్ లైట్స్ విషయంలో వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ నలుగురు యువకులు కార్ ఆపి డ్రైవర్‌పై దాడి చేశారు. ఆ తరవాత బూతులు తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు బాధితుడు ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేశాడు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ ట్యాగ్ చేశాడు.
"కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపై నా కార్ ఆపేశారు. నాపై దాడి చేశారు. నంగోలి మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఢిల్లీలో ఈ తరహా గూండాగిరి చాలా మామూలైపోయింది. ఢిల్లీ పోలీసులు దీనిపై దృష్టి సారించాలి. కచ్చితంగా చర్యలు తీసుకోవాలి"
- బాధితుడు
Some miscreants stopped me in the middle of the road and beat me up. All this happened at Nangloi Railway Station Metro. This type of hooliganism has become common in the capital of the country. @DelhiPolice should look into the matter and take strict action against these goons. pic.twitter.com/rBCJqctIQ8
— Praveen jangra (@ParveenHere) May 8, 2023
ఢిల్లీ డిప్యుటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హరేంద్ర కే సింగ్...ఈ ఘటనపై విచారణ జరిపారు. నలుగురునీ అరెస్ట్ చేసినట్టు ట్వీట్ చేశారు. "వాళ్లు దాడి చేశారు. మేం అరెస్ట్ చేశాం" అని పోస్ట్ చేశారు.
They did this, we did this. pic.twitter.com/tGISHjTsmw
— HARENDRA K SINGH, IPS (@HarendraKS_IPS) May 10, 2023
దారివ్వలేదని హత్య..
కార్కి దారివ్వలేదన్న కోపంతో డెలివరీ బాయ్‌ని దారుణంగా కొట్టి చంపారు. నిందితులిద్దరూ 20 ఏళ్ల లోపు వాళ్లే. ఢిల్లీలోని రంజీత్ నగర్లో ఈ ఘోరం వెలుగు చూసింది. మనీశ్ కుమార్, లాల్‌చంద్ అనే ఇద్దరు యువకులు డెలివరీ బాయ్‌ని కొట్టి చంపినట్టు పోలీసులు వెల్లడించారు. గత నెల 23న రాత్రి పూట ఈ గొడవ జరిగినట్టు వివరించారు. రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని, స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారని చెప్పారు. అయితే...అప్పటికే ఆ వ్యక్తి చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించారు. మృతుడు పంకజ్ ఠాకూర్ శరీరంపై గాయాలున్నట్టు గుర్తించారు. మృతుడి వద్ద ఉన్న డాక్యుమెంట్ల ఆధారంగా ఐడెంటిటీని కనుగొన్నారు. ఓ షాప్‌లో హెల్పర్‌గా పని చేస్తున్నాడని, సరుకులను డెలివరీ చేసే క్రమంలోనే ఈ గొడవ జరిగిందని పోలీసులు చెప్పారు.
Also Read: Kerala Crime: వైద్యం చేస్తున్న డాక్టర్‌పైనే దాడి, కత్తెరతో పొడిచి హత్య - కేరళలో దారుణం