News
News
వీడియోలు ఆటలు
X

Kerala Crime: వైద్యం చేస్తున్న డాక్టర్‌పైనే దాడి, కత్తెరతో పొడిచి హత్య - కేరళలో దారుణం

Kerala Lady Doctor Murder: కేరళలో వైద్యం చేస్తుండగానే ఓ వ్యక్తి లేడీ డాక్టర్‌ని కత్తెరతో పొడిచి చంపాడు.

FOLLOW US: 
Share:

Kerala Lady Doctor Murder: 

చికిత్స చేస్తుండగా కత్తెరతో దాడి 

చికిత్స అందిస్తున్న డాక్టర్‌నే ఓ వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. కేరళలోని కొట్టరక్కర్ ప్రాంతంలోని ఓ హాస్పిటల్‌లో ఈ దారుణం జరిగింది. అంతకు ముందు కుటుంబ సభ్యులతో గొడవ పడిన ఆ నిందుతుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వల్ప గాయాలైన కారణంగా ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకొచ్చారు. కాలి గాయం కాగా..దానికి మందు వేస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా లేచి పక్కనే ఉన్న కత్తెరతో విచక్షణా రహితం చుట్టూ ఉన్న వారిపై దాడి చేశాడు. ఈ దాడిలో 22 ఏళ్ల లేడీ డాక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఓ పోలీస్ కూడా గాయపడ్డాడు. ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఆ నిందితుడు కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. ఆ సమయంలోనే ఎమర్జెన్సీకి కాల్ చేసిన తనను కాపాడాలని పోలీసులను వేడుకున్నాడు. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చారు. అప్పటికే గొడవ కారణంగా ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని తాలూకాలోని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స చేస్తుండగానే దాడి చేసి లేడీ డాక్టర్‌ని హత్య చేశాడు. 

"మేం అక్కడికి వెళ్లే సరికే ఫుల్‌గా మందు కొట్టి ఉన్నాడు. హాస్పిటల్‌కి వచ్చే సమయానికే పిచ్చిగా ఊగిపోతున్నాడు. చికిత్స చేస్తున్నప్పుడు ఆ లేడీ డాక్టర్, నిందితుడు తప్ప ఎవరూ లేరు. గాయానికి డ్రెసింగ్ చేస్తున్నారని మేం దూరంగా నిలబడ్డాం. మాకు ఉన్నట్టుండి అరుపులు వినిపించాయి. లేడీ డాక్టర్ కాపాడండి అంటూ బయటకు వచ్చేశారు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మేం గదిలోకి వెళ్లి చూస్తే ఆ వ్యక్తి చేతులో కత్తెర ఉంది. చంపేస్తానంటూ బెదిరించాడు. అసలు ఆ డాక్టర్‌పై ఎందుకు దాడి చేశాడన్నది తెలీడం లేదు. మేం అతడిని ఆపేందుకు ప్రయత్నించాం. ఈ క్రమంలో నలుగురు పోలీస్‌లు గాయపడ్డారు. ఎలాగోలా కష్టపడి అతడిని పట్టుకున్నాం"

- పోలీసులు 

ఈ ఘటనపై Indian Medical Association (IMA) అధికారి స్పందించారు. ఇది చాలా దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళలో పలు చోట్ల వైద్యులు ఈ దాడిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

"ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకూడదు. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మేం పని చేయలేం. ప్రాణాలు కాపాడే మా ప్రాణాలే ప్రమాదంలో ఉంటే ఎలా..? మాపైన ఈ మధ్య కాలంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. కానీ ఏమీ జరగడం లేదు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కోపంతో పాటు బాధ కూడా కలుగుతోంది. ఈ ఘటన జరిగిన ఏరియాలో వైద్యులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ప్రాణాల మీదకు వచ్చిన తరవాత ఎవరు మాత్రం మమ్మల్ని కాపాడతారు. చాలా మంది ఇలానే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తోంది"

- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధికారి 

Also Read: Karnataka Assembly Election 2023: ముసలివాళ్లమైనా ఉదయమే వచ్చి ఓటు వేశాం, చూసి నేర్చుకోండి - సుధామూర్తి

Published at : 10 May 2023 01:23 PM (IST) Tags: Kerala Crime Kerala Lady Doctor Kerala Doctor Doctor Stabbed

సంబంధిత కథనాలు

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

France stabbing: ప్రీస్కూల్‌లోని చిన్నారులపై కత్తితో దాడి చేసిన సైకో, 9 మందికి తీవ్ర గాయాలు

France stabbing: ప్రీస్కూల్‌లోని చిన్నారులపై కత్తితో దాడి చేసిన సైకో, 9 మందికి తీవ్ర గాయాలు

Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!

Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

Maharashtra Crime: క్రికెట్‌ ఆడే విషయంలో గొడవ, 12 ఏళ్ల బాలుడిని బ్యాట్‌తో కొట్టి చంపిన మరో బాలుడు

Maharashtra Crime: క్రికెట్‌ ఆడే విషయంలో గొడవ, 12 ఏళ్ల బాలుడిని బ్యాట్‌తో కొట్టి చంపిన మరో బాలుడు

టాప్ స్టోరీస్

Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?

Janasena News : జనసేనలోకి ఆమంచి  కృష్ణమోహన్ సోదరుడు -  చీరాలపై గురి పెట్టారా ?

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ

చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వివాహం

చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వివాహం

RBI Governor Shaktikanta Das : లక్షా 80వేల కోట్ల రూపాయల విలువైన 2వేలనోట్లు ఉహసంహరణ | ABP Desam

RBI Governor Shaktikanta Das : లక్షా 80వేల కోట్ల రూపాయల విలువైన 2వేలనోట్లు ఉహసంహరణ | ABP Desam