Drugs Party: రాజ్ పాకాల జన్వాడ ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీ, టెస్టులు చేపించగా పాజిటివ్
RAVE PARTY In Hyderabad | తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల జన్వాడ ఫాం హౌస్ లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. విదేశీ మద్యం, డ్రగ్స్ సీజ్ చేశారు.
Drugs party in Janwada farm house | హైదరాబాద్: నగరంలోని ఓ ఫాం హౌస్ లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని నార్సింగి పోలీసులు, ఎక్సైజ్ శాఖ, Cyberabad SOT పోలీసులు భగ్నం చేశారు. అయితే ఫాం హౌస్ కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాలది కావడంతో హాట్ టాపిక్ గా మారింది. జన్వాడ రిజర్వ్ కాలనిలో ఉన్న రాజ్ పాకాల ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందించింది. రాజ్ పాకాల ఫాం హౌస్ లో సైబరాబాద్ ఎస్వోటీ, నార్సింగి పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు గుర్తించి, పార్టీలో పాల్గొన్న వాళ్ళ కి డ్రగ్స్ టెస్ట్ చేపించగా అసలు వ్యవహారం బయటపడింది.
డ్రగ్స్ పార్టీ లో పాల్గొన్న ఒక వ్యక్తికి కొకైన్ డ్రగ్ పాజిటివ్ గా తేలినట్లు సమచారం. డ్రగ్స్ తీసుకున్నట్లు మరికొందరికీ సైతం టెస్టుల్లో పాజిటివ్ గా రావడం కలకలం రేపుతోంది. పార్టీలో పాల్గొన్న వారు కొకైన్ తీసుకున్నట్లు డ్రగ్ టెస్ట్ లో తేలడంతో Ndps యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రాజ్ పాకాల ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీపై Ndps యాక్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ పార్టీలో డ్రగ్స్, విదేశీ మద్యం వినియోగించినట్లు గుర్తించారు. దొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. Section 34, Excise Act కింద మరో కేసు సైతం నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
RAID ON FARMHOUSE IN JANWADA
— Congress for Telangana (@Congress4TS) October 27, 2024
జన్వాడలోని ఫామ్‌హౌస్‌పై పోలీసుల రైడ్
-- వెరిఫికేషన్‌లో ఫామ్‌హౌస్ యజమాని రాజ్ పాకాల (కేటీఆర్ బావమరిది) అని తేలింది.
On the intervening night of 26/27th Oct, on information of a RAVE PARTY, a raid was organized by Narsingi Police, SOT and Excise… pic.twitter.com/RWaNdif6mF
జన్వాడ ఫాం హౌస్ లో భారీ శబ్దం చేస్తూ పార్టీ నిర్వహిస్తున్నారని పోలీసులు సమాచారం అందింది. డయల్ 100కు ఫోన్ చేసి డ్రగ్స్ పార్టీపై సమాచారం రావడంతో పోలీసులు, సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రగ్స్ పార్టీని అడ్డుకున్నారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 21 మంది పురుషులు, 14 మంది యువతులు, ఆడవారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జన్వాడ ఫాం హౌస్ లో లిక్కర్ కు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని అధికారులు తెలిపారు.
భారీ డీజే సౌండ్స్ తో అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీ
అర్థరాత్రి భారీ డీజే సౌండ్స్ తో డ్రగ్స్ పార్టీ నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు. విజయ్ మద్దూరికి డ్రగ్ టెస్టులో పాజిటివ్ గా తేలింది. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చుతామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడంలో భాగంగా యాంటీ నార్కోటిక్స్ కు సంబంధించి ఓ విభాగం ఏర్పాటు చేసి చీఫ్ ను నియమించారు. సీఎం రేవంత్ ఎప్పటికప్పుడూ డ్రగ్స్ నియంత్రణపై ఎక్సైజ్ శాఖ, యాంటీ నార్కోటిక్స్, సంబంధిత విభాగాల అధికారులతో సమావేశమై అప్ డేట్స్ తెలుసుకుంటున్నారు. డ్రగ్స్ అరికట్టేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకోవాలని, లేకపోతే యువత చెడ్డదారిని ఎంచుకుని జీవితాలు నాశనం చేసుకునే అవకాశం ఉందని పలుమార్లు ప్రస్తావించారు. గతంలో సన్ బర్న్ పేరుతో డ్రగ్స్ పార్టీలు నిర్వహించారు.