Crime News: గర్ల్‌ఫ్రెండ్ చెప్పిందని భార్యను హత్య చేసిన బీజేపీ లీడర్.. ఆపై దోపిడీ నాటకం
గర్ల్‌ఫ్రెండ్ కోరిక మేరకు ఓ బీజేపీ లీడర్ తన భార్యను దారుణంగా హతమార్చాడు. ఆపై దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం చేసి దొరికిపోయాడు. పోలీసులు ఇరువురిని అరెస్ట్ చేశారు.

గర్ల్‌ఫ్రెండ్ కోరిక మేరకు ఓ బీజేపీ లీడర్ తన భార్యను దారుణంగా హతమార్చాడు. ఆపై దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు అతడితోపాటు గర్ల్‌ఫ్రెండ్‌ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగింది. 24 గంటల్లోనే కేసును ఛేదించినట్లు అడిషనల్ ఎస్పీ దీపక్ కుమార్ తెలిపారు.
దొంగలు హత్య చేసి పారిపోయారని నాటకం
అడిషనల్ ఎస్పీ దీపక్ కుమార్ వివరాల ప్రకారం.. అజ్మీర్‌కు చెందిన బీజేపీ లీడర్ రోహిత్ సైని ఇంట్లో ఆగస్టు 10న ఆయన సంజు అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గుర్తుతెలియని దొంగలు ఆమెను హత్య చేసి విలువైన వస్తువులతో పారిపోయారని రోహిత్ సైని మొదట్లో పోలీసులకు తెలిపారు. అయితే, దర్యాప్తులో రోహిత్ అనుమానాస్పదంగా కనిపించడం, పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో తానే హత్యకు పాల్పడినట్లు రోహిత్ ఒప్పుకున్నాడు.
గర్ల్‌ఫ్రెండ్ ఒత్తిడితోనే దారుణం
తన గర్ల్‌ఫ్రెండ్ రీతు సైని ఒత్తిడితోనే తన భార్యను చంపినట్లు అంగీకరించాడు. రీతూతో చాలాకాలంగా రోహిత్‌కు సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. తమ ఇద్దరి సంబంధానికి సంజు అడ్డంకిగా ఉందని, ఆమెను చంపాలని రీతూ చెప్పడంతో రోహిత్ తన భార్యను ఇంట్లో బలమైన ఆయుధంతో కొట్టి చంపాడు. ఆ తర్వాత దోపిడీ నాటకం ఆడినట్లు పోలీసులు తెలిపారు. దోపిడీ జరిగినట్లు ఇంట్లో వాతావరణాన్ని సృష్టించాడని పోలీసులు పేర్కొన్నారు.
మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాం: అడిషనల్ ఎస్పీ
రోహిత్ సైనీతోపాటు హత్యకు ప్రోత్సహించిన గర్ల్ ఫ్రెండ్ రీతును అదుపులోకి తీసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ దీపక్ కుమార్ తెలిపారు. కేసు గురించి మరిన్ని వివరాలు వెలికితీసేందుకు తదుపరి విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. 24 గంటల్లో కేసును ఛేదించామని చెప్పారు. ‘పోలీసులు రోహిత్ సైని, స్నేహితురాలు రీతు సైనిని కూడా అరెస్టు చేశారు’ అని వెల్లడించారు.





















