Bihar Crime: భర్తను వదిలి మేనల్లుడితో వెళ్లిపోయిన ఇద్దరు పిల్లల తల్లి.. పెళ్లి ఫొటోలు వాట్సాప్‌లో పంపిన షాకింగ్ లవ్ స్టోరీ!
Bihar crime News: బిహార్‌లోని బంకా జిల్లా అమర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వింత ఘటన జరిగింది. మేనల్లుడితో ప్రేమాయణం సాగించిన మేనత్త ఇద్దరి పిల్లల్ని వదిలేసి జంప్ అయింది.

Bihar crime News: ప్రేమలో పడితే పెళ్లి బంధాన్ని, ఇతర సంబంధాలను కూడా దాటుతారు. ఇలాంటి ఘటన బిహార్‌లోని బంకాలో జరిగింది. అమర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్రమైన ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పిల్లల తల్లి తన భర్తను వదిలి మేనల్లుడితో వెళ్లిపోయింది. పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అయ్యారు. ఆమె కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పిల్లలను వెతికిపెట్టాలని మొరపెట్టుకుంటున్నారు.
మహిళ 11 సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది
ఈ కేసు గురించి బాధితుడైన భర్త శివం కుమార్ మంగళవారం (ఆగస్టు 05, 2025)న అమర్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. శివం దాదాపు 11 సంవత్సరాల క్రితం 2014లో అమర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన పూనమ్ కుమారితో వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఒకరికి 10 సంవత్సరాలు కాగా, మరొకరికి దాదాపు ఎనిమిది సంవత్సరాలు.
ఇంటికి వచ్చే మేనల్లుడితో పరిచయం... ప్రేమ.. పెళ్లి..
మహిళ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఏమైందో అని అంతా కంగారు పడ్డారు. చివరకు సన్నిహితుల నుంచి అందిన సమాచారం మేరకు దూరపు బంధువు, వరసకు మేనల్లుడితో జంప్ అయినట్టు తేలింది. గోగ్రీ జమాల్‌పూర్ పోలీస్ స్టేషన్ (ఖగారియా జిల్లా) పరిధిలోని భూరియా దియారా గ్రామానికి చెందిన అంకిత్గా తేలింది. తరచూ అతను మేనత్త ఇంటికి వచ్చే వాడు. మొదట్లో చుట్టపుచూపుగా వచ్చే వాడు, కొన్ని రోజుల తర్వాత తరచూ వచ్చే వాడు. పరిచయం ప్రేమగా మారిది ఇప్పుడు ఇద్దరూ పెళ్లి చేసుకున్నట్టు తేలింది. రెండు రోజుల క్రితం మేనత్త, మేనల్లుడు ఇద్దరు పిల్లలతో కలిసి పారిపోయారు.
పెళ్లి చేసుకుని ఫోన్‌లో ఫోటో పంపింది
బాధితుడైన భర్త శివం కుమార్ మాట్లాడుతూ, తన భార్య కోసం ప్రతిచోటా వెతికానని, కానీ ఆమె ఆచూకీ లభించలేదని చెప్పాడు. గత సోమవారం (ఆగస్టు 04, 2025) అర్ధరాత్రి, అతని భార్య అంకిత్‌తో కలిసి ఒక గుడిలో పెళ్లి చేసుకున్న ఫోటోను తన ఫోన్‌కు పంపింది. భర్త అమర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. తన పిల్లలను తిరిగి తీసుకురావాలని పోలీసులను కోరాడు.





















